Teams chasing and catching
-
గల్లీమే సవాల్!
విజృంభిస్తున్న చైన్‌స్నాచర్లు స్పాట్లు మారుస్తూ...రెక్కీలు నిర్వహిస్తూ కొత్త పోకడలు పోలీసులకు ముప్పతిప్పలు గురువారం సైబరాబాద్‌లో మూడు ఘటనలు ఓపక్క ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీస్)తో పోలీసులనిరోధక చర్యలు... మరోపక్క దూకుడు తగ్గించకుండా తమ పంథా కొనసాగిస్తున్న చైన్‌స్నాచర్లు... సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలా అసలైన ఆట మొదలైంది. పోలీసులు తీసుకుంటున్న చర్యల్ని ‘అధిగమిస్తున్న’ గొలుసు దొంగలు కొత్త గల్లీలు వెతుక్కుంటూ తాపీగా తమ ‘పని’ కానిస్తున్నారు. పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతున్నారు. వనస్థలిపురం పరిధిలోని ఆటోనగర్‌లో గొలుసు దొంగలపై సీసీటీమ్స్ కాల్పులు జరిపిన రెండు రోజుల్లోనే స్నాచర్లు మళ్ళీ పంజా విసిరారు. గురువారం ఒక్కరోజే మల్కాజ్గిరి, మేడిపల్లి, సరూర్‌నగర్‌లలో మూడు స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. సిటీబ్యూరో: నేరగాళ్లు, అసాంఘిక శక్తులపై పోలీసులు నిఘా ఉంచడం సహజం. ఇది అందరికీ తెలిసిందే. నగరంలో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న స్నాచింగ్ ఉదంతాలను పరిశీలిస్తే... దొంగలు కూడా పోలీసులు, వారి కదలికలపై నిఘా ఉంచారని..వారిని పక్కాగా గమనిస్తూ అదును చూసి పంజా విసురుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ‘గస్తీ’కి తోడు సీసీటీమ్స్... చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి కమిషనరేట్ పరిధిలో ఒకప్పుడు కేవలం గస్తీ బృందాలు మాత్రమే ఉండేవి. పోలీసుస్టేషన్ల వారీగా అక్కడక్కడ పికెట్లు ఏర్పాటు చేసే వారు. ఇటీవల స్నాచర్ల తీరు హింసాత్మకంగా మారుతుండడంతో ఏకంగా సీసీటీమ్స్ను రంగంలోకి దింపారు. మెరికల్లాంటి సిబ్బందిని ఎంపిక చేసుకోవడంతో పాటు మూడు వారాల పాటు శిక్షణ ఇచ్చి, తుపాకులూ అందించారు. ప్రస్తుతం కమిషనరేట్ మొత్తమ్మీద 55 బృందాలు పని చేస్తున్నాయి. ఈ రకంగా చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి పోలీసులు అన్ని శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. పరిశీలిస్తూ ‘పని’ పూర్తి చేస్తూ... పోలీసులు తీసుకుంటున్న చర్యల విషయం మీడియా ద్వారా ఇటు ప్రజలతో పాటు అటు స్నాచర్లకూ తెలుస్తూనే ఉంటోంది. దీంతో గొలుసు చోరులు ఎప్పటికప్పుడు తమ పంథాలను మార్చుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే పోలీసులు గుర్తించిన...నిత్యం స్నాచింగ్స్ చోటు చేసుకునే హాట్‌స్పాట్స్ ఏరియాల్లోకి స్నాచర్లు అడుగుపెట్టడం లేదు. వీటిపై పోలీసు నిఘా ఉంటుందనే ఉద్దేశంతో గల్లీలనే మార్చి రెచ్చిపోతున్నారు. గస్తీ బృందాలు, పికెట్లు, సీసీటీమ్స్ లేని ప్రాంతాలను ఎంచుకుని, ముందుగా రెక్కీ చేస్తూ ఆపై టార్గెట్లను గుర్తించి పంజా విరుసుతున్నట్లు జరుగుతున్న ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. నేరగాళ్ళకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలిసి, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న అధికారుల సంఖ్య వేళ్లపైనే లెక్కించవచ్చు. అయితే ప్రస్తుతం వీరిలో చాలా మంది క్షేత్రస్థాయిలో అందుబాటులో లేరు. సైబరాబాద్‌కు చెందిన అధికారులు ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీలతో హైదరాబాద్ సహా అనేక చోట్లకు బదిలీ అయ్యారు. మరికొందరు లా అండ్ ఆర్డర్ విభాగానికి మారిపోయారు. క్రైమ్ విభాగానికి రావడం అంటే సమర్థులైన అధికారులంతా అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. అక్కడున్న పరిస్థితులే ఈ భావనకు ఊతం ఇస్తున్నాయి. వీటికి తోడు సిబ్బందితో ఇబ్బంది ఎలానూ ఉంది. ఇలా అనేక కారణాల నేపథ్యంలో నేరగాళ్ళకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పడం సవాల్‌గా మారింది. ప్రజలూ సహకరించాలి... చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి ప్రజల సహకారం సైతం ఎంతో కీలకం. వీరిలో స్పందన, అవగాహన వస్తే తప్ప ఆశించిన ఫలితాలు రావు. ఎవరికి వారు కనీస జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏదైనా ఉదంతం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు, పోలీసులకు సహకరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఆటోనగర్ ఉదంతాన్నే తీసుకుంటే పారిపోతున్న స్నాచర్ల వెంట సీసీటీస్ సిబ్బందే వెళ్ళారు తప్ప అక్కడున్న ఏ ఒక్క సాధారణ పౌరుడూ ముందడుగు వేయలేదు. అదే జరిగితే ఆ స్నాచర్లు అక్కడే చిక్కడానికీ అవకాశాలు ఉండేవి. బాధితులు సైతం స్నాచింగ్ జరిగిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసుల సమాచారం ఇవ్వడం స్నాచర్లను పట్టుకోవడానికి ఉపకరించే అవకాశాల్లో కీలకమైందని మరువకూడదు. -
సీసీటీమ్స్కు స్పెషల్ క్లాస్
సిటీబ్యూరో: చైన్ స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీమ్స్)కు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పెషల్ డెరైక్షన్స్ ఇవ్వనున్నారు. ఆటోనగర్‌లో సోమవారం చైన్ స్నాచర్లపై సీసీటీమ్స్ కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆయా బృం దాలు కిందిస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిం చారు. చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించనున్నారు. సీసీటీమ్స్ ఇచ్చిన సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని అందుకనుగుణంగా చైన్‌స్నాచర్ల వీరంగానికి అడ్డుకట్ట వేయడంపై సీవీ ఆనంద్ ప్రత్యేకదృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ తో సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. ‘జనరద్దీ ఉన్న ప్రాంతాల్లో కాల్పులు జరపొద్దు. అయితే కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో చైన్స్నాచర్లను నిలువరించే క్రమంలో జరుగుతుంటా యి. ఎల్బీనగర్లోని ఆటోనగర్‌లో చైన్స్నాచర్లను పట్టుకునేందుకు సిబ్బంది చాలా ధైర్యం చేసింది’అని సీవీ ఆనంద్ అన్నారు. మహిళల భద్రత కోసమే... ‘మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఛేజిం గ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఓయూ లో జరిగిన ఘటనలో సుమిత్రా అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన వివిధ ఘటనల్లో పదుల సంఖ్యలో మహిళలు గాయపడ్డారు. అందుకే చైన్‌స్నాచర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎల్బీనగర్ ఆటోనగర్‌లో చైన్స్నాచర్లను నిలువరించే క్రమంలో సీసీటీమ్స్ కాల్పులు జరిపాయి. ఇది లోకల్ ముఠా పనే, సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటామ’ని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. -
కాస్కోండి
ఇక చైన్ స్నాచర్ల ఆటకట్టు ఆపరేషన్స్ ప్రారంభించిన ‘సీసీ టీమ్స్’ వారంలోనే వనస్థలిపురంలో తొలి ఘటన హాట్‌స్పాట్స్‌లో మకాం వేస్తున్న బృందాలు ప్రాంతాల వారీగా విధులు కేటాయింపు సిటీబ్యూరో: అదును చూసి వరుసగా పంజా విసురుతూ...సాధారణ ప్రజలతో పాటు పోలీసుల్నీ ముప్పతిప్పలు పెడుతున్న చైన్ స్నాచర్ల ఆటకట్టించడానికి సైబరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీస్) తమ ఆపరేషన్స్ ప్రారంభించాయి. వారం రోజులుగా వనస్థలిపురం ప్రాంతంలో మకాం వేసి ఓ బృందం సోమవారం ఇద్దరు స్నాచర్లను పట్టుకోవడానికి ప్రయత్నించింది. తప్పించుకు పారిపోతున్న దొంగలపై కాల్పులు జరిపింది. బహిరంగ ప్రదేశం కావడంతో టార్గెట్ మిస్ అయినప్పటీ సీసీటీమ్స్ ఏర్పాటు స్ఫూర్తి అమలులోకి వచ్చినట్లయింది. చైన్ స్నాచర్లకు చెక్ చెప్పడానికి ఉద్దేశించిన సీసీటీమ్స్కు మూడు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. స్నాచర్లను ఎదుర్కొనే విధానాల్లో భాగంగా హై స్పీడ్ వాహనాలను సురక్షితంగా డ్రైవ్ చేయడం, ఎలాం టి ఆయుధాలు లేకుండా స్నాచర్లతో పోరాడగలగటం, అవసరమైనప్పుడు కాల్పులు జరపటంలో మూడు వారాల పాటు శిక్షణ ఇచ్చారు. ఠాణాల వారీగా హాట్‌స్పాట్స్ గుర్తింపు... సైబరాబాద్ మొత్తమ్మీద 110 మందితో 55 సీసీటీమ్స్ను రం గంలోకి దింపిన అధికారులు వాటికి విధులనూ వ్యూహా త్మంకగా అప్పగించారు. ఠాణాల వారీగా గడిచిన మూడేళ్ళల్లో చోటు చేసుకున్న స్నాచింగ్స్‌ను పరిశీలించిన అధికారులు తరచుగా గొలుసు చోరీలు చోటు చేసుకుంటున్న హాట్ స్పాట్స్‌ను గుర్తించారు. ప్రాంతాలతో పాటు సమయాలు, కచ్చితమైన చోట్లనూ స్థానిక అధికారుల సాయంతో తెలుసుకుని జాబితాలు సిద్ధం చేసుకున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పని చేసే సీసీటీమ్స్ల్లో ఒక్కోదానికీ కొన్ని ప్రాంతాలను అప్పగించారు. వీరు ఆయా ప్రాంతాల్లో నిఘా వేసి ఉంచడంతో పాటు స్నాచింగ్స్‌కు అనుకూలమైన సమయాలు, ఏరియాలను గుర్తిస్తూ అవసరమైన చర్యలకు తీసుకోవాల్సి ఉంటుం ది. ఈ విధులు నిర్వర్తిస్తున్న ఒక్కో బృందానికీ సైబ రాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నెలకు రూ.5 వేలు చొప్పున అదనంగా అందిస్తున్నారు. తక్షణం స్పందించే తత్వం ఉండేదుకు సీసీటీమ్స్లో పని చేస్తున్న యువకులు గరిష్టంగా 25 ఏళ్ళ లోపు వాళ్ళే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒంటరి మహిళల్ని ఫాలో అవుతూ... సీసీటీస్లో పని చేసే సిబ్బంది పూర్తి స్థాయిలో మఫ్టీలోనే ఉం టారు. ఆహార్యం, వస్త్రధారణలో సైతం ఎక్కడా పోలీసుల్లా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చైన్ స్నాచర్లు ఎక్కువగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల్నే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీసీటీమ్స్ తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వరిస్తున్నాయి. ఈ బృందంలో ఉండే ఇద్దరు సభ్యులు తమకు కేటాయించిన ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు. హాట్‌స్పాట్‌కు అతి దగ్గరలో ఒకరు వాహనంపై సిద్ధంగా ఉంటారు. మరొకరు ఆ ప్రాం తంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలకు కాస్త దూరంలో అనుసరిస్తారు. ఒక మహిళ ఆ ప్రాంతం దాటిపోతే మరో మహిళ వెనుక అనుసరిస్తుంటారు. ప్రతి గంట కూ వీరు స్థానాలు మారుతూ విధులు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలోనే వనస్థలిపురం ఘటనలో బాధితురాలికి అతి సమీపంలోనే సీసీటీమ్ సిబ్బంది ఉన్నారు. ‘మూవింగ్ ఆజ్జెట్స్’తోనే ఇబ్బంది... చైన్‌స్నాచర్లు తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన క్షేత్రస్థాయి పోలీసులపై దాడులకు దిగడం, కత్తులతో హత్యాయత్నాలకు పాల్పడటం గతంలో చోటు చేసుకున్నాయి. ఉత్తరాది నుంచి వస్తున్న స్నాచర్లు తమ వెంట నాటు తుపాకులు సైతం తెచ్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇద్దరు సభ్యులతో ఉండే ఒక్కో సీసీటీమ్స్ బృందానికీ ఒక తుపాకీ కేటాయించారు. వీరికి మొయినాబాద్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఐఐటీఏ)లో 40 రౌండ్లు చొప్పున ఫైరింగ్ ప్రాక్టీస్ సైతం చేయించారు. అయి తే గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోల మాదిరిగా జనసమర్థ ప్రాంతాల్లో కదులుతున్న వస్తువులు, వ్యక్తులు (మూవింగ్ ఆబ్జెక్ట్స్)ను టార్గెట్ చేయడంలో సీసీటీమ్స్ సభ్యులు నిష్ణాతులు కాదు. ఈ కారణంగానే వనస్థలిపురం ఉదంతంలో చైన్ స్నాచర్లు తప్పించుకోగలిగారు. -
స్నాచర్..టైర్రర్
రెచ్చిపోయిన గొలుసు దొంగలు నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్ ఆటోనగర్‌లో సీసీటీమ్స్ కాల్పులు సరూర్‌నగర్, అల్వాల్, టోలీచౌకిల్లోనూ ఘటనలు.. తొమ్మిది తులాల బంగారు ఆభరణాలతో పరారీ జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోమవారం నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు. ఎల్బీనగర్ పరిధిలోని ఆటోనగర్‌లో అనురాధ అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా..ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొనేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. ఇది గమనించిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీమ్స్) కానిస్టేబుళ్లు రవిశంకర్, నరేందర్ వారిని వెంబడించగా బైక్‌పై పారిపోయారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో కానిస్టేబుళ్లు కాల్పులు కూడా జరిపారు. అయినా చైన్‌స్నాచర్లు తప్పించుకున్నారు. సరూర్‌నగర్, అల్వాల్, టోలీచౌకి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో బాధితులు తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను కోల్పోయారు. - సాక్షి, సిటీబ్యూరో సరూర్‌నగర్‌లో... చైతన్యపురి: హుడాకాంప్లెక్స్‌లో నివాసముండే డి.సుమతి(48) సోమవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లివస్తుంది. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న బైకును గమనించింది. చీరకొంగు భుజాలపై వేసుకుంటుండగా బైకుపై వెనుక కూర్చున్న అగంతకుడు ఆమె మెడలోని బం గారు పుస్తెలతాడును లాగాడు. దీంతో అప్రమత్తమైన ఆమె గట్టిగా పట్టుకోగా పుస్తె, లక్ష్మిరూపు కిందపడిపోగా, మూడు తులాల గొలుసు దుండగుల చేతికి చిక్కింది. బాధితురాలు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని డీఐ సునిల్ తెలిపారు. అల్వాల్‌లో... అల్వాల్: గోల్నాక అల్వాల్‌కు చెందిన ఇందిర (55) సోమవారం ఉదయం టెంపుల్ అల్వాల్‌లో ఉన్న తన టెలిఫో న్ బూత్ వైపు నడుచుకుంటు వెలుతుండగా, వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని అగంతకులు ఇందిర మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కొని ముందుకు పరిగెత్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనంపై పారిపోయారు. కొద్ది దూరం వెళ్లాక నిందితుడు బం గారు గొలుసుకు ఉన్న పుస్తెలను తొలగించి రోడ్డుపై పడవేసి వెళ్లాడు. తెలుపు రంగు టీషర్ట్, షార్ట్ ధరించి ఉన్నాడని 50 సంవత్సరాల వయసు కలిగి ఉండవచ్చని బాధితురాలు అల్వాల్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. టోలిచౌకి ఫ్లైఓవర్‌పై... గోల్కొండ: గచ్చిబౌలికి చెం దిన సంపత్‌రావు ఆదివారం రాత్రి పది గంటల ప్రాం తంలో తన భార్య వరలక్ష్మితో కలిసి పురానాపూల్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే సంపత్ టోలీచౌకి ఫ్లైఓవర్‌పై నుంచి షేక్‌పేట్ నాలావైపు వెళుతుండగా రుమాన్ హోటల్ ఎదురుగా కొందరు యువకులు గుమిగూడి వాగ్వావాదం చేసుకుంటున్నారు. ఆ గుంపునకు సమీపంలో వచ్చి సంపత్‌రావు బైక్ వేగాన్ని తగ్గించాడు. అదే సమయంలో వెనక నుంచి పల్సర్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు వరలక్ష్మి మెడలోని నాలుగు తులాల బంగారు మంగళ సూత్రాన్ని లాక్కొని పరార య్యారు. దీంతో హతాషుడైన సంపత్‌రావు బైక్ వేగాన్ని పెంచి వారిని వెంబడించాడు. అక్కడున్న ఇద్దరు యువకులు కూడా పల్సర్‌ను వెంబడించినా లాభం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.