breaking news
Tamilanadu elections
-
కుర్చీ కొట్లాట: పన్నీరు మంతనాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో కుర్చీ కొట్లాట వేడెక్కింది. సర్వ సభ్య సమావేశంలో సాగిన వ్యవహారాల్ని పరిగణించిన పన్నీరుసెల్వం సచివాలయానికి దూ రంగా గ్రీన్‌వేస్ రోడ్డుకే పరిమితమయ్యారు. సీఎం పళనిస్వామి కరోనా సమీక్షను సైతం బహిష్కరించి, మద్దతుదారులతో మంతనాల్లో మునగడం చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం సోమవారం వాడివేడిగా సాగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి ఈ సమావేశం వేదికగా వాదులాటకు దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం ఎవరో, 11 మందితో మార్గదర్శక కమిటీ వ్యవహారంలో ఈ ఇద్దరు నువ్వా, నేనా అన్నటు వాదులాడుకోవడమే కాదు, ఎవరు ఏ ద్రోహం చేశారో, తలబెట్టారో అంటూ తీవ్రంగానే విడుచుకు పడ్డారు. దీంతో అక్టోబర్ 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఎవరో అన్న ప్రకటన అంటూ సభను ముగించేశారు. అలాగే, కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. చదవండి: అన్నాడీఎంకేలో కుర్చీ వార్ దూరంగా.. మద్దతు మంతనాల్లో సీఎం, కో కన్వీనర్ పళనిస్వామి వ్యాఖ్యల దాడి కాస్త స్వరాన్ని పెంచినట్టుగా సంకేతాలు వెలువడ్డ నేపథ్యంలో మంగళవారం సాగిన పరిణామాలు ఆసక్తికరంగా, చర్చకు దారి తీసే రీతిలో మారాయి. కరోనా వ్యవహారం, లాక్డౌన్ ఆంక్షలపై సీఎం పళనిస్వామి సచివాలయంలో కలెక్టర్లు, మంత్రులు, డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయగా, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం డుమ్మా కొట్టారు. సచివాలయానికి దూరంగా ఉన్న ఆయన గ్రీన్‌వేస్ రోడ్డులోని నివాసంలో మద్దతుదారులతో మంతనాల్లో మునిగారు. పార్టీ సమన్వయ కమిటీ ప్రతినిధులు కేపీ మునుస్వామి, వైద్యలింగం సైతం గంటల తరబడి పన్నీరుతో భేటీ కావడం గమనార్హం. ఈ భేటీకి ప్రా«ధాన్యత పెరగడంతో పన్నీరు అడుగులు ఎలా ఉంటాయో అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో పన్నీరు ఢిల్లీ వెళ్తారని కొందరు, సొంత జిల్లా తేనికి వెళ్లనున్నారంటూ మరి కొందరు చర్చించుకోవడంతో చర్చ రచ్చ వేడెక్కింది. అమ్మ మరణం తర్వాత పరిణామాలతో పార్టీ చీలిక సందర్భంలో సాగిన పరిణామాలను ద్రోహం అంటూ తనను ఉద్దేశించి పళనిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని పన్నీరు జీర్ణించుకోలేకున్నట్టుందని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. పన్నీరు చుట్టూ పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేరడం, కొందరు మంత్రులు ఆయనతో ఫోన్లో మాట్లాడడం వంటి పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే కుర్చీ కొట్లా ట వేడెక్కింది. ఈభేటీ ముగించుకుని బయటకు వచ్చిన వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ మనస్పర్థలు, విభేదాలు లేవని, అందరూ ఒక్కటేనని, పన్నీరు, పళని ఇద్దరికీ తన మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, మంత్రి జయకుమార్‌ను సచివాలయంలో మీడియా కదిలించగా, పార్టీలో చి న్నచిన్న వ్యవహారాలు ఉంటాయని, అయితే, తామంతా ఒక్కటే అని, ఐక్యతతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటామని, మళ్లీ అధికారం కైవ సం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి నివాసంలో మంత్రి ఎస్పీ వేలుమణి సాయంత్రం భేటీ కావడం గమనార్హం. మంగ ళవారం సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఇళ్లకు అన్నాడీఎంకే నేతలు క్యూ కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కొత్త దేవతల వరాల జల్లులు
జాతిహితం ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. ద్రవిడ పార్టీలు నాస్తికత్వాన్ని వదిలేయడంతో తాయిలాల పంపకం కొత్త దేవునిగా అవతరించింది. హేతువాదం క్షీణించి, ద్రవిడ రాజకీయాలు చీలి పోవడంతో ఏర్పడ్డ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో పెద్ద సమస్యలూ లేవు, ఒకరినొకరు అవినీతిపరులని ఆరోపించుకునే అవకాశమూ లేదు. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం తాయిలాల పంపకమే. మన దేశంలో పర్యటిస్తున్నప్పుడు కనిపించే గోడల మీద రాతలు కొత్త పరిణామాల ఆవిర్భావాన్ని సూచిస్తుంటాయి. ప్రత్యేకించి ఎన్నికల సమ యంలోననే కాదు, ఎప్పుడైనా జరిగేదే. నగరాలు, వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామాలతో కూడిన పల్లెపట్టున పర్యటిస్తున్నప్పుడు మనం పూర్తిగా కళ్లు విప్పార్చి, చెవులు రిక్కించి గోడల మీద ఏమి రాసున్నదో లేదా మన చెవుల్లో ఏమి మారుమోగుతున్నదో గమనించాలి. మన దేశంలో ఏది మారుతోందో, ఏది మారడం లే దో అనివార్యంగా మీకు తెలుస్తుంది. భారత ఉపఖండం తన హృదయాన్ని గోడల మీద పరుస్తుంది. తమిళనాడు రాజ కీయాలు ప్రత్యేకమైనవి అయినంత మాత్రాన ఆ రాష్ట్రం అందుకు మినహా యింపనడానికి హేతువేమీ కనిపించదు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పేరెన్నికగల పట్టు వస్త్రాలకు పేరుమోసిన కాంచీపురం నాకు దేశంలోకెల్లా అత్యంత ఇష్టమైన స్థలం. చెన్నైకి వంద కిలోమీటర్ల దూరంలోని ఆ పాత పట్టణం శివారున పురాతనమైన శంకర మఠం ఉంది. అది శంకారాచార్యుల నివాసస్థానం. సనాతన హిందూవాద ఆధ్యాత్మిక అధికారానికి అతి ప్రముఖ కేంద్రం. అక్కడ మీరు తగినంత ఎక్కువ కాలమే గడిపేట్టయితే, నేను అక్కడికి వెళ్లిన మొదటిసారి చేసినట్టే మీరూ శంకరాచార్యులను సందర్శించడానికి వెళ్లేట్టయితే... ఆయన ‘‘జూని యర్’’ రాక కోసం వేచి చూస్తున్న శ్రోతలకు వినిపించే రికార్డు చేసిన సంస్కృత శ్లోకాలూ, మఠానికి బయట పక్కనే ఉన్న జుమా మసీదు నుంచి వినిపించే అజాన్ (ప్రార్థనకు పిలుపు) అనుద్దేశపూర్వకంగానే కలగలసి జుగల్ బందీలా ధ్వనించడాన్ని వినకుండా ఉండలేరు. మతతత్వం, నాస్తికత్వాల సహవాసం సరిగ్గా ఆ వీధి కూడలిలో శంకరాచార్యుల కోసం పూలు, పళ్లు కొనడానికి దిగే చోట... 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడైన పెరియార్ బస్ట్ సైజు విగ్రహం కనిపిస్తుంది. ఆయనను మరచిపోయిన తరాలవారు సునీల్ ఖిలానీ తాజాగా రాసిన ‘ఇన్కార్నేషన్స్’ను త్వరత్వరగా తిరగేసి చూడొచ్చు. బ్రాహ్మణవాదం, కులవాదం, సామాజిక అసమానత, మూఢ నమ్మకాల వ్యతిరేక పోరాటంతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన, వివాదాస్పదమైన సామాజిక-రాజకీయ పరివర్తన ఉద్యమాన్ని పెరియార్ ప్రారంభించారు. ఆయన వీటన్నిటినీ హేతువాదం, నాస్తికత్వం అనే ఒకే భావజాల ఛత్రం కింద చేపట్టారు. ఇప్పుడాయన మఠం, మసీదులను చూస్తూ ఉన్నారు. అంతేకాదు విగ్రహానికి కింద దేవుడిని, దైవత్వాలను ఖండిస్తూ చేసిన ఆయన వ్యాఖ్యలు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కించుకుని మరీ పరివేష్టితులై ఉనారు. దేవుడు లేడు/దేవుడు లేడు/దే వుడు లేనే లేడు/దేవుణ్ణి కనిపెట్టివవాడు మూర్ఖుడు/దేవుణ్ణి ప్రచారం చేసేవాడు వంచకుడు/దేవుణ్ణి పూజించేవాడు ఆటవికుడు: దేశంలోని మరే ప్రజా నాయకుడు దేవుణ్ణి ఖండించి, ధిక్కరించి ఎరుగని రీతిలో ఆయన... గొప్ప హిందూ సాంస్కృతిక కేంద్రం, ప్రముఖ మసీదులతో పాటూ ఆ వ్యూహాత్మక ప్రదేశాన్ని పంచు కుండటమే ముఖ్యమైన విషయం. గాఢమైన, సనాతన మతతత్వం, అత్యంత సూటియైన హేతువాదం కలసి ఒకే రెండు వందల చదరపు గజాల స్థలాన్ని పంచుకోవడాన్నిమరే దేశంలో చూడగలం? హిందూ గ్రూపులు దీన్ని అపచారమంటూ సవాలు చేశాయి. కానీ మద్రాసు హైకోర్టు 1979 తీర్పులో ఒక వ్యక్తి విగ్రహంతో పాటూ అతని అభిప్రాయాలను లిఖించడంలో తప్పేమీ లేదని తీర్పు చెప్పింది. ఆ ఆదేశాల సారాంశం సైతం కళ్ల జోడు పెట్టుకున్న పెరియార్‌కు దిగువన మరో నల్ల రాతిపై కనిపిస్తుంది. సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడే నల్ల రాతి ప్రతిమ అవతారమెత్తి దేవుళ్లను వెక్కిరించడం, అది నల్ల రాతిపై తెల్ల అక్షరాలతో చెక్కి ఉండ టానికి మించిన వ్యంగ్య పరిహాసం ఇంకేమంటుంది? నాస్తికత్వానికి ద్రవిడ పార్టీల చెల్లు చీటి ఒకప్పడు ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. బ్రాహ్మణ కులానికి చెందిన జయలలిత తన మతతత్వాన్ని ఎన్నడూ దాచుకున్నది లేదు. ఇక క రుణానిధి, ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్ (నా వాదనకు మద్దతు కోసం ఆధారపడుతున్నది ఆయనపైనే) అన్నట్టు... పాత హేతువాదపు చివరి ప్రముఖ స్వరంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నా, ఆయన తర్వాత ఇప్పట్లో అలాంటి వారు ఆవిర్భవించరు. ఆయన కుమారుడు స్టాలిన్ కుటుంబం తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంది. పురావస్తు, చారిత్రకపరమైన ఆసక్తితోనే వెళుతున్నామనేదే వారు చెప్పే ప్రధానమైన సాకు. ఎన్నికలు జరగ నున్న తమిళనాడులో నేను గడిపిన ఐదు రోజుల్లో దేవుడులేడనే తత్వం గుర్తున్న ఒక్క ఓటరు కూడా నాకు కనబడలేదు లేదా నా దృష్టికి రాలేదు. ఆలయాల నిండా భక్తులున్నారు. పెద్ద సంఖ్యలో బ్రాహ్మణేతర పురోహితు లున్నారు. దక్షిణాదిలోని ప్రముఖ దైవాంశ సంభూతులైన బాబాలు, గురు వుల అనుయాయులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్‌లు సైతం వారిలో ఉన్నారు. కరుణానిధి భార్య లలో ఒకరు పెద్ద కుంకుమ బొట్టును పెట్టుకుంటారని డీఎండీకే నేతగా మారిన సినీ నటుడు విజయ్‌కాంత్ చెబుతున్నారు. తమిళ రాజకీయాలు, సంస్కృతికి సంబంధించిన ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన ఏఆర్ వెంకటాచలపతి నేను కనుగొన్న విషయాలతో ఏకీభవిస్తూనే... సీఎన్ అన్నాదురై సైతం 1940ల చివర్లో పెరియార్‌తో విడిపోయినప్పుడు ఆయన నాస్తికత్వానికి దూరంగా జరిగారనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనే సమస్యపై అన్నాదురై, పెరియార్‌కు దూరమయ్యారు. ఏడు దశాబ్దాల తర్వాత సరిగ్గా అదే విషయంపై కేజ్రీవాల్, అన్నా హజారే నుంచి విడిపోయారు. సామాజిక అసమానతపై దాడి చేయడానికి హేతు వాదాన్ని ఉపయోగించుకోవడం, అందుకు వ్యతిరేకులుగా ఉన్న ఓటర్లను ఆక ట్టుకోవడం పూర్తిగా భిన్నమైనవని అన్నాదురై గుర్తించారని వెంకటాచలపతి గుర్తుచేశారు. తమిళనాడులోకెల్లా అత్యంత జనాదరణగల దేవుడు గణేశుడు. అంతేకాదు పెరియార్ పగలగొట్టిన దేవుళ్ల విగ్రహాల్లో గణేశుని విగ్రహాలే ఎక్కువ. ‘‘నేను పిళ్లయ్యార్కు కొబ్బరికాయలూ కొట్టను, ఆయన విగ్రహాలూ పగులగొట్టను’’ అని అన్నాదురై 1954లో చెప్పిన సుప్రసిద్ధ వాక్యాలను ఆయన గుర్తుకు తెచ్చారు. అమ్మ, స్టాలిన్ల నడుమ ఆ ఎడబాటు ఇప్పడు పరిపూర్ణమైంది. జనాకర్షణ కోసం పాట్లే భావజాలం బ్రాహ్మణాధిపత్య క్షీణత కూడా ఇందుకు తోడ్పడింది. పీకే సినిమాలోని అమీర్‌ఖాన్ అంగారక గ్రహవాసి బాబాలకు ‘‘దేవుని మేనేజర్లు’’ అని పేరు పెట్టడానికి చాలా ముందే ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకులు ఆ విషయాన్ని గుర్తించారు. ఇప్పుడా మేనేజర్లు ధైర్యంగా మాట్లాడుతుండగా... నాటి ద్రవిడ ఉద్యమ నేతల పిల్లలకు దేవలతో అలాంటి పేచీయే లేకుండా పోయింది. ఆ పార్టీల్లోని కరడుగట్టిన నాస్తికులు దీనికి చుట్టుదారిని కనుగొన్నారు. వృద్ధ కరుణానిధిలాగే నేనూ కొంతకాలం ప్రముఖ యోగా బోధకుడు టీకేవీ దేశి కాచార్ (కృష్ణమాచార్య యోగా మందిరం) వద్ద యోగాభ్యాసం చేశాను. ఆయన ఎన్నడూ ‘‘ఓం’’ అని పలికి ఎరుగరు. ‘‘సూర్యుడు, ఎంతైనా మా పార్టీ గుర్తే కదా’’ అంటూ ఆయన తనకు సూర్య నమస్కారాలతో సమస్యేమీ లేదని చెప్పారు. హేతువాదం క్షీణించిపోయి, ద్రవిడ రాజకీయాలు చీలిపో వడంతో దాదాపు ఒకే భావజాలంగల రెండు పార్టీలు ఏర్పడ్డాయి. అయితే ఆ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారిపోయాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో శ్రీలంక సహా పెద్ద సమస్యలంటూ ఏమీ లేవు. తమిళ రాజకీయాల్లోని ఆ రెండు ధ్రువాలను సూచించే ప్రత్యేక సూత్రాలు, భావాలు లేదా నినాదాలు ఏవీ లేవు. ఒకరు మరొరిని అవినీతిపరులని ఆరోపించే అవకాశమైతే అసలుకే లేదు. ఉన్నవల్లా యుద్ధానికి దిగిన కుటుంబాలే. అవి కరుణానిధి కుటుంబం, ఎమ్జీఆర్ కుటుంబం. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం ఓటర్లకు తాయిలాల పంపకమే. అమ్మ ఓటరుకు పూర్తి వంటగది సామాను, కుటుంబ వినోదం, కొంత బంగారం కూడా ఉచితంగా ఇచ్చేస్తారు. డీ ఎంకే ఆమె ఇచ్చే ఉచిత కానుకలను దుమ్మెత్తి పోస్తుందనిగానీ, అదీ విద్యార్థుల, రైతుల రుణాలను మాఫీ చేస్తానంటుంది. ఇక విజయకాంత్ ఈ అర్థరాహిత్యాన్ని మరో స్థాయికి లేవ నెత్తి ఉచితంగా రేషన్ సామానంతా ఇంటికే సరఫరా చేస్తామంటారు. దేవుడు పూర్తిస్థాయిలో పునఃప్రవేశం చేయడంతో తాయిలాల పంపకమే నూతన రాజకీయ భావజాలంగా మారింది. అయినా ద్రవిడవాద పునరు ద్ధరణ మొలకలు కొన్ని కనిపిస్తున్నాయి. అతి చిన్న పట్టణాలలో పుస్తకాలు, పేపర్ల దుకాణాల్లో పెరియార్ రచనలు అత్యధికంగా అమ్ముడు పోతున్నాయి. ‘‘ఒక రాజకీయ మతాన్ని దాని అనుచరులు వదులుకున్నాక దాని అంచులలో మనుగడ సాగిస్తున్నవారు మరింత గట్టి భావజాలవాదులుగా మారారు’’ అని వెంకటాచలపతి అన్నారు. నేటి తమిళనాడులో పెరియార్వాదులైన యువత, విద్యార్థులు పెరగడం, విద్యావంతులైన దళిత యువత ఆయనపట్ల ఆకర్షితులు కావడం పెరగడం దాన్నే ప్రతిబింబిస్తోంది. ఈ నూతన కేంద్రీ కరణ ఎంత శక్తివంతమైనదో మనం ఇప్పటికే మద్రాసు ఐఐటీలో అంబేడ్కర్-పెరియార్ గ్రూపు ఏర్పాటు ద్వారా చూశాం. భారత రాజ కీయాలు ఎప్పుడూ విస్మయకర అంశాలను బయటపెడుతుంటాయి. అదే మన రాజకీయాలకున్న ప్రబల ఆకర్షణ శక్తి. - శేఖర్ గుప్తా Twitter@ShekarGupta