breaking news
Talent series tennis tournment
-
ఆకాశ్, అనన్యలకు టైటిల్స్
అండర్-14 టెన్నిస్ టోర్నీ ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ అండర్-14 టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎల్. ఆకాశ్ రెడ్డి, అనన్య మోహన్ విజేతలుగా నిలిచారు. ఇమాన్యుయెల్ కోచింగ్ సెంటర్, సూర్యోదయ టెన్నిస్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర సింగిల్స్ టైటిల్‌ను ఆకాశ్, బాలికల టైటిల్‌ను అనన్య కైవసం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని అకాడమీలో మంగళవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఆకాశ్ రెడ్డి 3-6, 7-6, 6-4తో అమన్ అయూబ్‌ఖాన్‌పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో అతను 5-3, 4-1తో చింతా ప్రణవ్‌పై, అయూబ్ ఖాన్ 4-2, 4-2తో లంక సుహిత్రెడ్డి పై గెలిచారు. బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో అనన్య మోహన్ 6-1, 6-3తో దామెర సంస్కృతిపై గెలిచింది. సెమీఫైనల్లో ఆమె 4-0, 4-0తో లిపిక మురమాలపై, సంస్కృతి 4-2, 3-5, 4-1తో సాహితిరెడ్డిపై గెలుపొందారు. అంతకుముందు జరిగిన బాలుర క్వార్టర్ ఫైనల్లో అకాశ్ 7-3తో రుచిత్ గౌడ్‌పై, అయూబ్ ఖాన్ 7-2తో పి.కౌశల్‌పై, సుహిత్రెడ్డి 7-4తో వల్లభనేని ప్రీతమ్‌పై, ప్రణవ్ 7-4తో లోకాదిత్య వర్ధన్‌పై నెగ్గారు. బాలికల క్వార్టర్స్‌లో సంస్కృతి 8-4తో లాస్య పట్నాయక్‌పై, అనన్య మోహన్ 8-2తో కె.అవంతికరెడ్డిపై, లిపిక 8-4తో పి.అమూల్యపై నెగ్గారు. -
సెమీఫైనల్లో సంస్కృతి
ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఐటా అండర్-14 టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో దామెర సంస్కృతి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేరెడ్మెట్ క్రాస్ రోడ్స్‌లోని రమా టెన్నిస్ అకాడమీలో మంగళవారం బాల, బాలికల సింగిల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ పోటీలు జరిగాయి. బాలికల సింగిల్స్‌లో సంస్కృతి 4-1, 4-2తో సొనాలి జైస్వాల్‌పై అలవోక విజయం సాధించింది. ఇతర సింగిల్స్ మ్యాచ్‌ల్లో సృష్టి 1-4, 4-0 (10/7)తో ఇషికా అగర్వాల్‌పై, తులసీ కార్వార్ 4-1, 4-2తో అనన్య మోహన్‌పై, సాహితి రెడ్డి 4-1, 5-3తో షరాన్ శామ్సన్‌పై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అమన్ ఖాన్ 4-0, 5-3తో రిషిల్ గుప్తాపై, సుహిత్ రెడ్డి 4-1, 5-4 (11/9)తో వల్లభనేని ప్రీతమ్‌పై, శివ అనిరుధ్ 4-1, 4-1తో దీపక్ వాయరపై, సిఖ్ సంచిత్ 4-2, 4-5 (10/6)తో హర్షిత్ కొసరాజుపై గెలుపొందారు.