breaking news
t-ysrcp leader sivakumar
-
'జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా లేదు'
-
'జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా లేదు'
హైదరాబాద్ : ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జిల్లాల విభజన చేయాలని తెలంగాణ వైఎస్సార్సీపీ నేత శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేయాలంటూ వివిధ పార్టీల నేతలను ఆదివారం అఖిలపక్ష నేతలు కలిశారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ...జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగడం లేదన్నారు. ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మార్పులు చేసిన తర్వాత మరోసారి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు.