breaking news
Superhero
-
సూపర్ హీరోలు వస్తున్నారోచ్
ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్... ఇలా హాలీవుడ్ సూపర్ హీరో కథలను భారతీయ ప్రేక్షకులు వీక్షించారు. అబ్బురపరచే వారి సాహసాలను శభాష్ అన్నారు. అయితే ఇప్పుడు మన ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ కూడా వస్తున్నారోచ్. వెండితెరపై ఆడియన్స్‌ను ఆశ్చర్యపరచే అద్భుత విన్యాసాలు, సాహసాలతో ఆడియన్స్ వావ్ అనేలా కష్టపడటానికి రెడీ అవుతున్నారు. ఇక మన సూపర్ హీరో వివరాలపై ఓ లుక్ వేయండి.విశ్వంభర ప్రపంచంలో... ‘విశ్వంభర’ సినిమాలో సూపర్ హీరో మాదిరి యాక్షన్ చేయనున్నాడట దొరబాబు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ అండ్ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. కాగా ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, దొరబాబుగా విశ్వంభర ప్రపంచంలో సాగే కొన్ని సన్నివేశాల్లో సూపర్ హీరోలా యాక్షన్ సన్నివేశాలు చేస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. పంచభూతాల (గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు) నేపథ్యం, విశ్వంభర అనే బుక్, సిస్టర్స్ సెంటిమెంట్‌తో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం.యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కాక΄ోతే వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమౌతోందని తెలుస్తోంది. ఈ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఇతర ప్రధానపాత్రల్లో ఆషికా రంగనాథ్, బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ కనిపిస్తారు. కీలకపాత్రల్లో సురభి, ఇషా చావ్లా, ప్రవీణ్ కనిపిస్తారని తెలిసింది.వచ్చే ఏడాది స్టార్ట్ ‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి మాస్ సినిమాలు తీసిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ సూపర్ హీరో కథను రెడీ చేశారు. లోకేశ్ కనగరాజ్ కథలోని సూపర్ హీరోగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సూపర్ హీరో సినిమాను ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తనకు ఓ సూపర్ హీరో కథ చెప్పారని, లోకేశ్‌తో తాను ఈ సూపర్ హీరో మూవీ చేయనున్నానని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తామని ఆమిర్ ఖాన్ చెప్పారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు ఆమిర్ ఖాన్. ఈ సినిమా తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈలోపు కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసేస్తారు లోకేశ్ కనగరాజ్. ఇలా... ఆమిర్–లోకేశ్‌ల ఇతర కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోని సినిమా సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు. అలాగే లోకేశ్ దర్శకత్వంలోని తాజా చిత్రం ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా, నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.ఆన్ ద వే! సిల్వర్ స్క్రీన్‌పై రవితేజను ఓ సూపర్ హీరోగా చూపించనున్నారు ‘మ్యాడ్’ డైరెక్టర్ కల్యాణ్ శంకర్. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే ఓ సూపర్ హీరో స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నారు. ఈ కథను రవితేజకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట కల్యాణ్ శంకర్. ఈ స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చి, రవితేజకు కల్యాణ్ శంకర్ ఫైనల్ నరేషన్ ఇచ్చి, రవితేజ ఈ సినిమాకు ఓకే చెబితే, మూవీ సెట్స్‌పైకి వెళ్లినట్లే. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మాత్రం కాస్త సమయం పట్టవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నూతన దర్శకుడు భాను భోగవరపుతో ‘మాస్ జాతర’ అనే మూవీ చేస్తున్నారు రవితేజ.ఆగస్టు 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘అనార్కలి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ కూడా చేస్తున్నారు రవితేజ. ‘మాస్ జాతర’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘అనార్కలి’ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. పైగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ రవితేజ ప్రకటించారు. సో... ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే కల్యాణ్ శంకర్‌తో సూపర్ హీరో తరహా సినిమా చేసే ఆలోచన చేయవచ్చు రవితేజ. ఇక ఈ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలు, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థనే కల్యాణ్ శంకర్–రవితేజల సూపర్ హీరో సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సో... సూపర్ హీరో ఆన్ ద వే అన్నమాట.సరికొత్త ప్రపంచంలోకి... ఆడియన్స్‌ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట దర్శకుడు అట్లీ. ఈ సినిమాలో ఊహకందని లొకేషన్స్, వినూత్నమైన జీవరాసులు ఉంటాయట. పైగా ఈ చిత్రంలో అల్లు అర్జన్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ మూడుపాత్రల్లో ఒకపాత్ర సూపర్ హీరో తరహాలో ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఆల్రెడీ ఈపాత్రకు సంబంధించి విదేశీ సాంకేతిక నిపుణులు, ఫైటర్స్ నేతృత్వంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలిసింది.ఇక ఈ చిత్రంలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ నటించనున్నారు. దీపికపాత్రకు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ వారియర్ తరహాపాత్రలో కనిపిస్తారామె. ఇంకా ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ భాగమయ్యారని, ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్నది చిత్రయూనిట్ ΄్లాన్ అని భోగట్టా.ఇటు అధీర... అటు మహాకాళి! ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా కొన్ని సూపర్ హీరో తరహా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను–మాన్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో పవర్స్ ఉన్న యువకుడు హనుమంతుపాత్రలో కనిపించి, ఆడియన్స్‌ను మెప్పించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తారు. అయితే ఈ చిత్రంలోనూ హనుమంతుపాత్ర ఉంటుందట. ఇంకా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ‘అధీర’ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సూపర్ హీరో సినిమాలో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా నటిస్తారు. ఇంకా ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో భాగంగానే ‘మహాకాళి’ అనే మూవీ రానుంది. విశేషం ఏంటంటే... ఇది ఫీమేల్ సూపర్ హీరో మూవీ అన్నమాట. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేశ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు మెయిన్ లీడ్ చేస్తారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కాగా ప్రశాంత్ వర్మ షో రన్నర్‌గా ఉన్న ‘మహాకాళి’ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఓ కీలకపాత్రలో నటిస్తారు. గత ఏడాది దసరా పండగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు ప్రశాంత్‌వర్మ. ఈపోస్టర్పై మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో ఇన్ ది యూనివర్స్ అని ఉండటం విశేషం.పీపుల్స్ సూపర్ హీరో పీపుల్స్ సూపర్ హీరోగా చెప్పుకునే శక్తిమాన్ సరికొత్త పవర్స్‌తో వెండితెరపైకి రానున్నాడు. మూడు సంవత్సరాల క్రితమే ఈ ‘శక్తి మాన్’ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో శక్తి మాన్‌గా రణ్వీర్ సింగ్ నటిస్తారని, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని, హీరోయిన్గా వామికా గబ్బి కనిపిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ‘శక్తి మాన్’ సినిమాలోని నటీనటులపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సిని మాలో రణ్వీర్ సింగ్ నటించడం లేదని, ఈ సినిమాకు ఓ నిర్మాతగానే ఆయన ఉంటారనే ప్రచారం కూడా బాలీవుడ్లో వినిపించింది. మరి... శక్తి మాన్‌గా ఎవరు కనిపిస్తారనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.సూపర్ యోధ ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో తరహాలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన, ఈ ‘మిరాయ్’ గ్లింప్స్ వీడియోతో ఈ విషయం స్పష్టమౌతోంది. అడ్వెంచరస్తోపాటు కొన్ని మైథలాజికల్ అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు ఈ చిత్రదర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.మల్టీవర్స్ మన్మథన్ మలయాళ నటుడు నివిన్ పౌలీ ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘మల్టీవర్స్ మన్మథన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆదిత్యన్ చంద్ర శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆనంద్, నితీరాజ్ ఈ సినిమాకు కో రైటర్స్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా ప్రక టించారు. ‘‘ఇండియాస్ ఫస్ట్ మల్టీవర్స్ సూపర్ హీరో సినిమా ఇది’’ అని ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో నివిన్ పౌలీ ‘ఎక్స్’పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ సూపర్ హీరో ఫిల్మ్ మూడు నాలుగు భాగాలుగా రానుందని, తొలి భాగంగా ‘మన్మథన్ రైజింగ్’ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కల నిజమైంది నటుడిగా ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘భాగమతి, కిలాడి, యశోద’ వంటి సినిమాల్లో ఉన్ని ముకుందన్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ మలయాళ నటుడు ఓ సూపర్ హీరో సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఆ మధ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉన్ని ముకుందన్. తాను చిన్నప్పట్నుంచి సూపర్ హీరో కథలు, వీరోచితపోరాటాలు చూస్తూ పెరిగానని, తన కలలో కొందరు సూపర్ హీరోస్ ఉన్నారని, వారిని వెండి తెరపైకి తీసుకువచ్చేందుకు తొలిసారి దర్శకత్వం వహించనున్నానని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు. మిథున్ మాన్యువేల్ థామస్ కథ అందిస్తున్న ఈ సినిమాను గోకులమ్ గోపాలన్ నిర్మించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు ఉన్ని ముకుందన్. ఈ కోవలో మరికొంతమంది సూపర్ హీరోలు వెండితెరపైకి రానున్నారు. – ముసిమి శివాంజనేయులు -
సూపర్ హీరో పాత్రలో బాలకృష్ణ?
హీరో బాలకృష్ణ సూపర్ హీరోగా కనిపించబోతున్నారా? సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. 'అఖండ' తర్వాత డిఫరెంట్ మూవీస్, పాత్రలు చేస్తున్న బాలయ్య.. ఇప్పుడు తర్వాత మూవీ కోసం సూపర్ హీరోగా కనిపిస్తారని అంటున్నారు. దసరా కానుకగా అక్టోబరు 11న దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)బాలకృష్ణ, సూపర్ హీరోగా కనిపిస్తారు సరే. కానీ దీన్ని డీల్ చేసే దర్శకుడు ఎవరు? కథ ఎలా ఉండబోతుంది లాంటి అంశాలపై ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్ టైంలో పురాణాల్లోని పలువురు సూపర్ హీరోలని బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. 'హనుమాన్', 'కల్కి' ఈ తరహా చిత్రాలే.ఇప్పుడు బాలయ్య కూడా ఇలాంటి సినిమానే చేయబోతున్నారని తెలుస్తోంది. లేదంటే ఇదంతా కూడా కొడుకు మోక్షజ్ఞ నటించే సినిమాలోనా అనేది తెలియాల్సి ఉంది. మరి బాలయ్య సూపర్ హీరో అనేది నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వస్తే ఏం మాట్లాడలేం!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
త్రీడీ సూపర్ హీరో
‘కాంచన 3’ సూపర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రాఘవా లారెన్స్. ప్రస్తుతం తన సూపర్ హిట్ చిత్రం ‘కాంచన’ సినిమాను అక్షయ్ కుమార్‌తో ‘లక్ష్మీ బాంబ్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూపర్ హీరోగా లారెన్స్ ఓ చిత్రం చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని 3డీలో తెరకెక్కించే ఆలోచనలో లారెన్స్ ఉన్నారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సూపర్ హీరో సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుందని సమాచారం. -
సూపర్ మ్యాన్ సాహసాలు వికటిస్తే..!
సూపర్ మ్యాన్ అనగానే మనకు కళ్లు తిరిగే సాహసాలు గుర్తొస్తాయి.. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా.. మెరుపువేగంతో స్పందించి.. ఆపదలతో పోరాడి సూపర్ మ్యాన్లు బాధితులను కాపాడుతుంటారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మన్ ఇలా అందరూ అద్వితీయమైన సాహసాలు చేసినవారే.. ఇదే కోవలో మన ఇండియన్ సూపర్ హీరో ‘ఫ్లయింగ్ జాట్’ కూడా సాహసాలు చేయబోతాడు. కానీ అవి వికటిస్తాయి. ఆపదలోని బాధితుల్ని కాపాడబోయి తానే కష్టాల్లో పడతాడు. అన్నీ ఉల్టాపల్టా చేయబోతాడు.. ఇలా విచిత్రమైన సాహసాలతో ’ఫ్లయింగ్ జాట్’గా కండలు తిరిగిన యువహీరో టైగర్ ష్రఫ్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఈ సినిమాలో అతీత శక్తులున్న సూపర్ హీరోగా టైగర్ కనిపించనున్నాడు. అయితే, అతడు చేసే సాహసాలన్నీ మొదట్లో వికటిస్తాయి. ఆ తర్వాత విలన్లు ఎంట్రీ అవుతారు. మొత్తానికీ, రెగ్యులర్ సూపర్ హీరో సినిమాల మాదిరిగా కాకుండా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందినట్టు కనిపిస్తోంది. టైగర్ కు జోడీగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటించింది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ఫేస్బుక్లో విడుదలైంది. -
స్పైడర్‌గా కొత్త మ్యాన్
అతను హైస్కూల్ కుర్రాడు... తెలివైనవాడు కానీ అమాయకుడు. అందరి చేతిలోనూ దెబ్బలు తింటూ ఉంటాడు. హఠాత్తుగా ఓ సాలీడు కుట్టడం వల్ల ఎగురుతాడు, గోడ మీద పాకుతాడు... ఎంత ఎత్తు మీద నుంచైనా దూకుతాడు. ప్రపంచాన్నే కాపాడే స్థాయికి ఎదుగుతాడు. ఈ కథ విన్న వాళ్లెవరికైనా గుర్తొచ్చే సూపర్‌హీరో ‘స్పైడర్‌మ్యాన్’. చెప్పాలంటే పిల్లల్నీ, పెద్దలందరినీ ఆకట్టుకుంటాడీ స్పైడర్ హీరో. ప్రేక్షకుల మనసుల్లో ఈ సాలీడు వీరుడు గూడు అల్లేసుకున్నాడు. ఇప్పటివరకూ ఈ హీరో వెండితెరపై చాలాసార్లు కనిపించాడు. గడచిన పదమూడేళ్లల్లో వచ్చిన స్పైడర్‌మ్యాన్ సిరీస్ చిత్రాల్లో ఇద్దరు నటులు ఈ హీరో పాత్ర చేశారు. ఒకరు - టొబే మాగ్వైర్, మరొకరు - ఆండ్రూ గ్యార్‌ఫీల్డ్. హైస్కూల్ విద్యార్థులుగా ఈ ఇద్దరు నటులు మంచి అభినయం కనబరిచారు. ఈ సినిమాలో నటించే సమయానికి వారికి 26, 27 ఏళ్లున్నాయి. ఇప్పుడు మళ్లీ ‘స్పైడర్‌మ్యాన్’ సిరీస్‌ను మొద లుపెట్టడానికి సోనీ, మార్వెల్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, ఈ పాత్రకు కొత్త కుర్రాణ్ణి ఎంపిక చేశాయి. అలా ఈ తాజా స్పైడర్‌మ్యాన్ పాత్ర కు బ్రిటన్‌కు చెందిన 19 ఏళ్ల టామ్ హాలాండ్‌ను ఎంపిక చేశారు. సో... ఇప్పుడీ కుర్రాడు ఈ మధ్యకాలంలో ముచ్చటగా మూడో స్పైడర్ మ్యాన్ అన్నమాట. -
బిగ్ బి...ద సూపర్‌హీరో!
‘పీకు’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఇప్పుడు సూపర్ హీరో అవతారం ఎత్తారు. 72 ఏళ్ల వయసులో సూపర్‌హీరో పాత్ర ఏంటంటారా! బుల్లితెరపై రానున్న ఓ యానిమేటేడ్ సిరీస్ కోసం అమితాబ్ రూపురేఖల్లో సూపర్ హీరో పాత్ర ఉంటుంది. అంతరిక్షంలో జరిగిన యుద్ధంలో గాయపడి భూమ్మీదకు వచ్చేసిన అస్త్ర అనే సూపర్‌హీరో అది. ‘అస్త్ర ఫోర్స్’గా డిస్నీ చానల్లో 2017 నుంచి ఈ టీవీ సిరీస్ ప్రసారం కానుంది.