breaking news
structure of polavaram project
-
రవాణాకు పోలవరం
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గోదావరి మీదుగా జలమార్గం ఏర్పడనుంది. నీటిలోతు సుమారు వందమీటర్లు ఉంటేనే లాంచీలో ప్రయాణం సాధ్యమవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మితమైతే ఆ మేరకు నీరు నిల్వ చేయవచ్చు. రోడ్డు, రైలుమార్గం కంటే జలమార్గం ద్వారా ప్రయాణికులకు దూరం తగ్గుతుంది. పేరంటాలపల్లి, పాపికొండలు వంటి పర్యాటక ప్రాంతాలను చూసే వీలవుతుందని సర్వే అధికారులు నిర్ధారించారు. 2012లో ఐడబ్ల్యూఏఐ (ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సంస్థ చీఫ్ శ్రీవాత్సవ రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు లాంచీలో ప్రయాణించి జలమార్గాన్ని పరిశీలించారు. అదేఏడాది రెండుసార్లు జలమార్గం కోసం సర్వే నిర్వహించారు. 2013లో ఢిల్లీ, నోయిడాలోని ప్రభుత్వరంగ సంస్థ ఐడబ్ల్యూఏఐ సర్వే నిర్వహించింది. ఆ తర్వాతహైదరాబాద్కు చెందిన ఐఐసీ (ఇంటెలిజన్ ఇన్ఫర్మేషన్ కన్వర్షన్) అనే కాంట్రాక్టు సంస్థ అధికారులు కూడా సర్వే చేశారు. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు మండల పరిధిలోని వింజరం రేవు మీదుగా సర్వే నిర్వహించిన అధికారులు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ద్వారా నీటిలోతు, నది ఒడ్డు కొలతలను నమోదు చేసుకున్నారు. భద్రాచలం బ్రిడ్జి నుంచి రాజమండ్రి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వరకు గోదావరి 157 కిలో మీటర్లు, నది ఒడ్డు 171కి.మీ ఉందని అప్పట్లో సర్వే చేసిన ఐఐసీ అధికారులు తేల్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోచవరం, పాపికొండలు వద్ద 59 మీటర్లు, కచ్చులూరు వద్ద గోదావరిలో 60 మీటర్ల లోతు ఉంది. కుక్కునూరు మండలం వింజరంలో ఆరు మీటర్ల లోతే ఉందని నిర్ధారించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆ లోతు సుమారు వందమీటర్లకు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు. భద్రాచలం నుంచి చింతూరు మీదుగా రాజమండ్రికి రోడ్డు ప్రయాణం 209 కి.మీ, భద్రాచలం నుంచి కుక్కునూరు మీదుగా రాజమండ్రికి 185 కి,మీలు ఉంది. జలమార్గం ద్వారా ఆ దూరం 157 కి. మీ.లకు తగ్గుతుంది. దీనిద్వారా ప్రయాణ సమయం ఆదా అవుతుందని, రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని, ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని సర్వే అధికారులు పేర్కొన్నారు. పేరంటాలపల్లి, పాపికొండల యాత్రికులకు ఇది కలిసివస్తుందని అభిప్రాయపడ్డారు. -
ముంపు ప్రాంతాల కోసం దశలవారీ ఆందోళన
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్ల నుంచి వేరు చేయాలని చూస్తున్న ఏడు మండలాలను తమ ప్రాణం పోయినా వదులుకునేది లేదని అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. భద్రాచలంలోని రెడ్‌క్రాస్ బిల్డిం గ్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమి టీ ఆధ్వర్యంలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భం గా స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పోలవరం నిర్మాణంతో ఆదివాసీలు జలసమాధి అయ్యే ప్రమాదం ఉందని, దీనిని సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, భౌగోళికంగా జిల్లా తో అనుబంధం ఉన్న భద్రాచలం, పాల్వంచ డివిజన్లోని ఆదివాసీలను, ప్రజలను ఎట్టి పరిస్థితిలోనూ వదులుకునేది లేదన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని ఆంధ్రకు చెందిన అన్ని పార్టీలు పట్టుబడుతున్నాయని, అంత కంటే ఎక్కువగా తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులంతా ఐక్యంగా ఉద్యమించి ముంపు మండలాల ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి నదితో పాటు ఏజెన్సీ సంపదను దోచుకునేందుకు ఆం ధ్రావారు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ముంపు ప్రాంతాలను కాపాడుకునేలా అఖిలపక్షం ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించారు. ఈనెల 30న ముంపునకు గురయ్యే ఏడు మండలాల్లో బంద్ పాటించాలని, 31, జూన్ 1 తేదీలలో అయా మండలాలలో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని, 2న ముంపు గ్రామాల పంచాయతీ కార్యాలయాల ఎదుట నల్లజెండాలు ఎగురవేయాలని, అనంతరం సరిహద్దులను ది గ్బంధించాలని నిర్ణయించారు. సదస్సులో న్యూ డెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి, వెంకటేశ్వర్లు, కల్పన, బిక్షం, నాగన్న, సీపీఎం నాయకు లు ఏజే రమేష్, కాంగ్రెస్ నాయకులు బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, టీడీపీ నాయకురాలు కొమరం ఫణీశ్వరమ్మ, సీపీఐ నాయకులు తమ్మళ్ల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నుంచి తిప్పన సిద్దులు, ఎండీ రఫీ, బీ జేపి నుంచి ఆవుల సుబ్బారావు, ఏవీఎస్పీ నుం చి సోందె వీరయ్య, ఏఎస్పీ నాయకులు గుండు శరత్‌బాబు, ఆదివాసీ సేన నాయకులు లక్ష్మణ్‌రావు, ఏపీటీఎఫ్ నుంచి రామాచారి, టీఎన్జీవోస్ నాయకులు నాగేశ్వరరావు, మాలమహానాడు నాయకులు శేఖర్, ఎంఎస్ఎఫ్ నా యకులు అలవాల రాజా, పోలవరం వ్యతిరేక కమీటీ నాయకులు నారాయణ పాల్గొన్నారు.