breaking news
Stratosphere
-
గరిష్ట వార్షిక పరిమాణానికి చేరుకున్న ఓజోన్ రంధ్రం
అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం దాని ‘గరిష్ట వార్షిక పరిమాణానికి’ చేరుకుందని ఓజోన్ పొరను పర్యవేక్షించే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవల సంవత్సరాలలో ఇది అతిపెద్ద, లోతైన వాటిలో ఒకటి అని వారు తెలిపారు. ఓజోన్ పొర భూ ఆవరణలలో ఒకటైన స్ట్రాటో ఆవరణలో ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది. ఆ కిరణాల నుంచి మానవాళిని ఇతర ప్రాణులను కాపాడుతుంది. ఇండిపెండెంట్.కో. యూకే నివేదిక ప్రకారం, కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ (కామ్స్) శాస్త్రవేత్తలు ఓజోన్ సాంద్రతలు అంటార్కిటికాపై 20 - 25 కిలోమీటర్ల ఎత్తులో సున్న విలువకు పడిపోయాయని కనుగొన్నారు. ఈ జోన్‌ను ట్రైఆక్సిజన్ అని కూడా పిలుస్తారు. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఓజోన్ పొరలో చిన్న రంధ్రం ఏర్పడిందని, అది తరువాత పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. రసాయనాలైన క్లోరో ఫ్లోరో కార్భన్ల( సీఎఫ్‌సీ)పై నిషేధాన్ని అమలు చేయాలని సైంటిస్ట్‌లు 2019లో చాలా బలంగా చెప్పారు. సీఎఫ్‌సీ ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతాయి. గత వారం నుంచి దక్షిణ ధ్రువంలో సూర్యరశ్మి బాగా పెరగడంతో ఈ ప్రాంతంలో ఓజోన్ క్షీణత ఎక్కువ అయ్యిందని సైంటిస్ట్‌లు తెలిపారు. 2019లో స్వల్ప ఓజోన్ పొర క్షీణతను గుర్తించిన తాము ఈ ఏడాది కొంచెం పెద్ద రంధ్రాన్నే కనుగొన్నామని వారు చెప్పారు. దీనిని ఆపాలంటే మాంట్రియల్ ప్రోటోకాల్‌ను అన్ని దేశాలు తప్పకుండా పాటించాలని సైంటిస్ట్‌లు విజ్ఞప్తి చేశారు. చదవండి: షాకింగ్: ఓజోన్ పొరకు అతిపెద్ద చిల్లు.. -
ఆర్కిటిక్‌లో సాధారణ స్థాయికి ఓజోన్ పొర
జెనీవా: హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి భూగోళాన్ని రక్షిస్తున్న ఓజోన్ పొరకు నానాటికీ పెరుగుతున్న కాలుష్యం పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ పొర మార్చిలో దారుణంగా దెబ్బతిన్నదని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. 2011 తర్వాత ఈ స్థాయిలో ధ్వంసం కావడం ఇదే తొలిసారి. అయితే, ఏప్రిల్ నెలలో మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. క్లోరోఫ్లోరో కార్బన్ల(సీఎఫ్‌సీ) ఉద్గారాలు తగ్గడంతో ఆర్కిటిక్ పొర ఊపిరి పోసుకుందని తెలిపింది. -
సన్‌కే స్ట్రోక్ ఇద్దాం!
సూరీడు సీరియస్‌గా ఉన్నాడు.. ఎండ దంచి కొడుతోంది.. ఏం చేస్తాం? అడ్డంగా గొడుగు పెడతాం.. మనకు ఓకే.. మరి భూమి మొత్తానికి ఎండ కొడుతోందిగా.. ఏం చేయాలి? గొడుగు పట్టాలా? అడ్డుగా ఏదైనా పెట్టాలా? భూతాపం నుంచి రక్షించుకునేందుకు సూర్యుడి వేడిని ఎలా ఆపాలి? వినడానికిది సిల్లీగా అనిపిస్తోందా.. అయితే, ఇదేదో ఊసుపోని పోరగాళ్ల ముచ్చట కాదు.. ప్రపంచంలోనే పేరొందిన హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తల వినూత్న ఆలోచన.. దీనికి నిధులు సమకూరుస్తోంది కూడా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కావడం విశేషం.. అరె.. సింపుల్‌రా భయ్.. బోలెడంత చాక్ పౌడర్‌ను తీసుకెళ్లి.. ఆకాశంలో చల్లేయ్.. అదే పెద్ద సన్షేడ్లాగ సూరీడు నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది ఇంతకీ సూరీడు దుమ్ము దులిపేసే ఆ ఆలోచన ఏంటి? సూర్యుడి వేడి భూమిపై పడకుండా ఉండేందుకు భారీ మొత్తంలో దుమ్మును ఆకాశంలో సూర్యుడికి అడ్డంగా చల్లుతారట. ఇందుకోసం రోజుకు 800 భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సాయంతో లక్షల టన్నుల చాక్ (క్యాల్షియం కార్బొనేట్) దుమ్మును భూమి కి దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తు (స్ట్రాటోఆవరణం)లో జల్లి వస్తారు. ఇలా చల్లిన దుమ్ము సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను తిరిగి అంతరిక్షంలోకి పంపిస్తుంద ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల భూమిపైకి వచ్చే కిరణాల తీవ్రత తగ్గి.. భూతాపం నుంచి ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. బిల్‌గేట్స్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల నిమిత్తం స్ట్రాటోస్ఫియరిక్ కంట్రోల్డ్ పెర్టుర్బేషన్ ఎక్స్పెరిమెంట్ అనే పరికరం (రూ.20 కోట్లు) ద్వారా ఓ పెద్ద బెలూన్ను ఉపయోగించి రెండు కేజీల క్యాల్షియం కార్బొనేట్ పొడిని 20 కిలోమీటర్ల పైకి పంపి అక్కడ చల్లుతారు. తొలుత న్యూ మెక్సికోలో ఈ ప్రయోగం చేయనున్నారు. దీంతో అక్కడున్న గాలి మందంగా తయా రై సూర్యుడి కిరణాలు కిందకు రాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు. అలాగే కాల్షియం కార్బొనేట్ కణాలు తెలుపు రంగులో ఉండటం వల్ల సూర్యుడి కాంతి పరావర్తనం చెందుతుంది. దీన్నే అల్బిడో అని పిలుస్తారు. శుద్ధమైన మంచుకు అల్బిడో విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అసలు సూర్యుడి కాంతి మొత్తాన్ని పరావర్తనం చెందిస్తుంటుంది. ఎండాకాలంలో ఇంటి మేడపై తెల్లటి (వైట్ వాష్) పెయింట్ వేస్తే సూర్యరశ్మి వేడిమి ఇంట్లోకి రాకుండా ఆపుతుంది కదా.. అలాగన్న మాట. అదే సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాల్షియం కార్బొనేట్‌ను ఆకాశంలో జల్లి వస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. నష్టమా.. లాభమా..? ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి తాపం నుంచి భూమికి, మనకు ఉపశమనం కలుగుతుందో లేదో తెలియదు కానీ.. భవిష్య త్తులో స్ట్రాటో ఆవరణంలోని ఈ పొడి వల్ల వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవించి కరువులు, హరికేన్లు వచ్చే ప్రమాదముందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వాదనలను హార్వర్డ్ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అతి పెద్ద విమానం.. అంతరిక్ష ప్రయాణం..!!
కొలరాడో, అమెరికా : ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ‘స్ట్రాటో లాంచ్’ అతి త్వరలోనే తొలిసారి గగనయానం చేయనుంది. దాదాపు ఫుట్‌బాల్ మైదానమంత భారీ రెక్కలు కలిగిన ఈ విమానానికి రెండు కాక్‌పిట్స్, 28 చక్రాలు, ఆరు ఇంజన్లను అమర్చారు. సాధారణంగా ఆరు ఇంజన్లలతో 747 జంబో జెట్లను నడపొచ్చు. భవిష్యత్‌లో ఈ విమానం ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి, అంతరిక్ష యానానికి వెళ్లే ప్రజలను భూమి నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్కు చేర్చడానికి ఉపయోగపడనుంది. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పాల్ అలెన్ కలలకు రూపం స్ట్రాటో లాంచ్. కొలరాడోలో జరిగిన 34వ స్పేస్ సింపోజియంలో ఈ వేసవిలో విమానం తొలిసారి గగనతల విహారానికి వెళ్లనుందనే ప్రకటన వెలువడింది. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు స్ట్రోటో లాంచ్ కొన్ని రాకెట్లను మోసుకెళ్లనుంది కూడా. ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నాలజీల కన్నా అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోని స్ట్రాటో లాంచ్ ద్వారా ప్రయాణించొచ్చని పాల్ అలెన్ తెలిపారు. -
లక్ష అడుగుల ఎత్తు నుంచి తీసిన వీడియో
అరిజోనా: బెలూన్‌కు అమర్చి ఆకాశంలోకి పంపిన అధునాతన కెమెరా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తోంది. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు 2013లో చేసిన ప్రయోగం ఫలితాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. అరిజోనా సమీపంలో అధునాతన కెమెరాను అమర్చిన బెలూన్ను ఎన్నో పరీక్షల అనంతరం ఆకాశంలోకి పంపారు. అది భూమి నుంచి లక్ష అడుగుల ఎత్తులోని స్ట్రాటో ఆవరణం వరకు వెళ్లొచ్చింది. గంటన్నర పాటూ ప్రయాణించిన బెలూన్ ప్రయాణించే సామర్థ్యం కోల్పోయి తిరిగి భూమిని చేరింది. అది ప్రయాణిస్తున్న సమయంలో అరిజోనాలోని కొలరాడో నది, గ్రాండ్ కానియన్, భూమిమీద వివిధ ప్రాంతాలు.. కెమెరా తీసిన వీడియోలో స్పష్టంగా వచ్చాయి. భూమిని అంత ఎత్తునుంచి తీసిన వీడియో విహంగవీక్షణంలా ఉంది. అప్పుడే తిరిగి భూమికి వచ్చిన ఆ బెలూన్ ఇటీవల లభించడంతో ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. బెలూన్ ప్రయాణించే సమయంలో కెమెరా తీసిన వీడియోనే కాకుండా, ఈ ప్రయోగం కోసం ఆ విద్యార్థులు ఎలా సన్నదమయ్యారో కూడా కలుపుకోని మొత్తం నాలుగు నిమిషాల నిడివి గల వీడియో ఫూటేజ్ అందులో ఉంది. అధునాతన కెమరాని పరీక్షించడం, గ్రాండ్ కానియన్ విభిన్న ఫుటేజ్‌ని సంపాదించడం కోసం ఈ ప్రయోగం చేసినట్టు ఆ విద్యార్థులు చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత తాము పంపిన కెమెరా ఫూటేజ్ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. -
స్ట్రాటో ఆవరణకు చేరుకున్న తొలి భారతీయుడు
- ఇస్రో జనవరి 5న శ్రీహరికోట నుంచి నిర్వహించిన జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగం విజయవంతమైంది. - అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ జనవరి 20న విజయవంతంగా ప్రయోగించింది. - ఆస్టరాయిడ్ బెల్ట్‌లోని సిరీస్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదలవుతుందని ఐరోపా అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు జనవరి 23న ప్రకటించారు. - రాజస్థాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్ర ఏర్పాటుకు భెల్, పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ సహా ఆరు ప్రభుత్వ రంగసంస్థలు సంకల్పించాయి. - జమ్మూలో 101వ సైన్స కాంగ్రెస్‌ను ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు ‘ఇన్నోవేషన్స ఇన్ సైన్స అండ్ టెక్నాలజీ ఫర్ ఇన్‌క్లూజివ్ డెవలప్మెంట్’ ఇతివృత్తంతో నిర్వహించారు. - అత్యంత ప్రాధాన్యతనివ్వవలసిన పర్యావరణ అంశాల పనితీరు ఆధారంగా రూపొందించిన ప్రపంచ పర్యావరణ జాబితాలో భారత్‌కు 155వ స్థానం దక్కింది. - అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 715 కొత్త గ్రహాలను కనుగొన్నట్లు ఫిబ్రవరి 26న తెలిపింది. ఈ కొత్త గ్రహాలతో కలిపి సౌర కుటుంబం వెలుపల కచ్చితంగా గుర్తించిన గ్రహాల సంఖ్య దాదాపు 1700కు చేరింది. - మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు ఫిబ్రవరి 5 నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1944, ఫిబ్రవరి 5న ఈ ‘కోలోసస్’ కంప్యూటర్ వినియోగంలోకి వచ్చింది. - వరల్డ్ వైడ్ వెబ్(www) మార్చి 12న పాతికేళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టింది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టీమ్ బెర్నర్స్ లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. - ప్రపంచంలో ప్రకృతి విపత్తుల బారినపడే 616 నగరాల పరిస్థితులపై స్విస్ రే అనే సంస్థ మార్చి 26న విడుదల చేసిన జాబితాలో కోల్‌కతా ఏడో స్థానంలో నిలిచింది. టోక్యో(జపాన్) మొదటి స్థానం, మనీలా (ఫిలిప్పీన్స్) రెండో స్థానంలో ఉన్నాయి. - కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్-3ఇ జీవిత కాలం ముగియడంతో పని చేయడం ఆగిపోయిందని ఏప్రిల్ 2న ఇస్రో ప్రకటించింది. - జీవం ఉనికి ఉండే భూమి పరిమాణంలోని మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘గోల్డ్‌లాక్స్ జోన్’లో ఉన్న ఈ గ్రహంలో ద్రవ రూపంలో నీరు, జీవం ఉనికికి కావాల్సిన వాతావరణం ఉండొచ్చని భావిస్తున్నారు. - స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని డీఆర్డీవో మే 4న విజయవంతంగా పరీక్షించింది. దృష్టి క్షేత్రానికి ఆవల (బియాండ్ విజువల్ రేంజ్) గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా వాయుసేన ప్రయోగించింది. - అమెరికా తన విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించాలని జూన్ 2న ప్రతిపాదించింది. - ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఫ్రాన్సకు చెందిన ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా జూన్ 2 నుంచి 13 వరకు ‘ఈఎక్స్ గరుడ 5 ((Ex Garuda V)’ అనే పేరుతో విన్యాసాలు నిర్వహించాయి. - తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం (కేఎన్‌పీపీ)లోని ఒకటో యూనిట్లో జూన్ 7న నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం ఇంత సామర్థ్యంతో పనిచేయడం ఇదే తొలిసారి - దేశంలో అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 14న గోవాలో జాతికి అంకితం చేశారు. - గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల అస్త్ర క్షిపణిని సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భారత వాయుసేన జూన్ 20న విజయవంతంగా పరీక్షించింది. - ప్రపంచ పర్యావరణ నేరాల విలువ 213 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఐక్యరాజ్యసమితి, ఇంటర్‌పోల్ జూన్ 24న విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. - భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఐ.ఎన్.ఎస్ కమోర్తా అనే అత్యాధునిక యుద్ధ నౌకను తయారు చేసింది. - ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్‌ను ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) రూపొందించింది. దీనికి మ్యాజిక్ అట్మాస్ఫిరిక్ చెరింకోవ్ ఎక్స్పెరిమెంట్ (మేస్) అని పేరుపెట్టింది. ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్ హెస్ నమీబియాలో ఉంది. - ఇస్రో జూన్ 30న శ్రీహరికోట నుంచి చేపట్టిన పీఎస్ ఎల్వీ-సీ23 అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. - దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఢిల్లీ- ఆగ్రాల మధ్య విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తిచేసే ఈ రైలుని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జూలై 3న ప్రారంభించారు. - అంటార్కిటికా ఖండంలోని మెక్ డొనాల్డ్ హైట్స్ దక్షిణ భాగంలో 930 మీటర్ల ఎత్తున్న ఓ పర్వతానికి భారత-అమెరికన్ శాస్త్రవేత్త అఖౌరి సిన్హా పేరు పెట్టారు. - వాతావరణంలో ఉండే కార్బన్‌డై ఆక్సైడ్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నాసా ప్రత్యేక ఉపగ్రహాన్ని జూలై 2న విజయవంతంగా ప్రయోగించింది. - గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్ఓఎఫ్ఎన్.) ప్రాజెక్ట్ కింద చేపట్టిన సర్వే పూర్తయింది. - 2011 నుంచి అటవీ విస్తీర్ణం 5,871 చదరపు కిలోమీట ర్లు పెరిగినట్లు భారత అటవీ నివేదిక 2013 తెలిపింది. - పరిపాలనలో ప్రజలను మరింత భాగస్వామ్యుల్ని చేసేందుకు ఝడజౌఠి.జీఛి.జీ అనే పేరుతో ఓ వెబ్సైట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26న ప్రారంభించారు. - విపత్తులు, ప్రమాదాల సమయంలో సమాచార వ్యవస్థలు పనిచేయని ప్రదేశాల్లో అండగా నిలిచే అత్యాధునిక సమాచార వ్యవస్థను భారత్-జపాన్ శాస్త్రవేత్తలు జూలై 24న ప్రదర్శించారు. దీనికి దిశానెట్ అని పేరు పెట్టారు. - హ్యాండ్ గెడైడ్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా చండీగఢ్‌లోని నేషనల్ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్డీఆర్ఐ) శాస్త్రవేత్తలు ఒక కోడెదూడను సృష్టించారు. జూలై 23న జన్మించిన దీనికి రజత్ అని పేరు పెట్టారు. - స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్‌కతా భారత నావికాదళంలోకి ఆగస్టు 16న చేరింది. - నేడు ప్రపంచమంతా విస్తృతంగా వాడకంలో ఉన్న ఎలక్ట్రానిక్ మెయిల్ (ఈ-మెయిల్)కు ఆగస్టు 30తో 32 ఏళ్లు నిండాయి. - విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్‌లోని రావత్‌భటా అణువిద్యుత్ కేంద్రంలోని యూనిట్-5 నిరంతరాయంగా ఆగస్టు 11 నాటికి 739 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసింది. దీంతో ప్రపంచంలో సుదీర్ఘకాలం నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన రెండో కేంద్రంగా రావత్‌భటా నిలిచింది. - దేవనాగరి లిపిలో కొత్త డొమైన్ డాట్ భారత్‌ను కేంద్రం న్యూఢిల్లీలో ఆగస్టు 27న ప్రారంభించింది. ఈ డొమైన్ హిందీ, బోడో, డోగ్రీ, కొంకణ్, మైథిలీ, మరాఠీ, నేపాలీ, సింధీ వంటి ఎనిమిది భాషల్లో ఉంటుంది. - తూర్పు తీర భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో రూపొందిన అతిపెద్ద తీరగస్తీ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను భారత నౌకాదళ ఛీఫ్ అడ్మిరల్ ఆర్కే ధోవన్ సెప్టెంబర్ 4న చెన్నైలో జాతికి అంకితం చేశారు. - భారత్-నేపాల్ దేశాలు సంయుక్తంగా పితోరాఘర్‌లో సూర్యకిరణ్-7 పేరిట నిర్వహించిన సైనిక విన్యాసాలు ఆగస్టు 31తో ముగిశాయి. - ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త టి.ఎన్.సురేశ్‌కుమార్ భూ వాతావరణంలో రెండో పొర స్ట్రాటో ఆవరణ వరకు ప్రయాణించారు. దీంతో స్ట్రాటో ఆవరణ చేరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. - భారత ఉపగ్రహం మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) సెప్టెంబర్ 24న అంగారకగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. - అమెరికాకు చెందిన మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (మావెన్) ఉపగ్రహం దిగ్విజయంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. - దక్షిణ కొరియాలోని యాంగ్ చాంగ్ నగరంలో జీవ వైవిధ్య సదస్సు (కాప్ 12)ను అక్టోబర్ 12 నుంచి 14 తేదీ వరకు నిర్వహించారు. - మిత్రశక్తి పేరిట భారత్-శ్రీలంక దేశాలు నవంబర్ 3 నుంచి 23 వరకు కొలంబో (శ్రీలంక) సమీపంలోని ఓ దీవిలో సైనిక విన్యాసాలు నిర్వహించాయి. - ఖగోళ చరిత్రలో తొలిసారి తోకచుక్కపై ల్యాండర్ చేరింది. 67పి/చుర్యుమోన్-గెరాసి మెంకో అనే తోకచుక్క వెంట పదేళ్లుగా ప్రయాణించిన ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన రొసెట్టా వ్యోమ నౌక ఫీలే నవంబర్12న కాలుమోపింది. - {పమాదకర స్థాయికి తక్కువగా భూతాపం ఉండాలంటే ప్రపంచ దేశాలు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. - గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు సమకూరుస్తామని బెర్లిన్‌లో సమావేశమైన 30 దేశాలు నవంబర్ 20న హామీనిచ్చాయి. గ్రీన్ క్లైమెట్ ఫండ్ ప్రధాన కేంద్రం దక్షిణ కొరియా. - విశ్వం ప్రాథమిక నిర్మాణం గురించి పరిశోధన జరుపుతున్న ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్) ప్రాజెక్టులో ఐఐటీ మద్రాస్ చేరింది. - సమాచార ఉపగ్రహం జీశాట్-16ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 7న ఏరియన్-5 ద్వారా జీశాట్-16ను ప్రయోగించారు. - జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌ప్లోరర్ హయబుస-2ను డిసెంబర్ 3న విజయవంతంగా ప్రయోగించింది. - అంగారక యాత్రకు మానవులను పంపే ప్రయత్నంలో అమెరికా డిసెంబర్ 5న చేపట్టిన వ్యోమనౌక పరీక్ష విజయవంతమైంది. ఒరియన్ అనే వ్యోమనౌకను కేప్ కెనవరాల్‌లోని వైమానిక స్థావరం నుంచి డెల్టా-4 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. - శిలాజ ఇంధనాలను మండించడం, పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా 2013లో ప్రపంచంలో అత్యధికంగా 35.3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది 2012 కంటే 0.7 బిలియన్ టన్నులు అధికం. - ఇస్రో డిసెంబర్ 18న చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. జీఎస్ఎల్వీ మార్క్ 3 (ఎల్వీఎం 3) రాకెట్ ఎత్తు 43.43 మీటర్లు, బరువు 630.58 టన్నులు. - అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సూపర్ ఎర్త్‌ను గుర్తించినట్లు డిసెంబర్ 19న శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది భూమికి దాదాపు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. - భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన వెయ్యి కిలోల గ్లైడ్ బాంబును డిసెంబర్ 19న పరీక్షించింది. భారత్ చేపట్టిన మంగళ్‌యాన్‌ను 2014 అత్యుత్తమ ఆవిష్కరణగా టైమ్ పత్రిక అభివర్ణించింది. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి చేరుకోవడం సాంకేతిక అద్భుతమని, అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు సాధించని ఘనతను భారత్ సెప్టెంబరు 24న సొంతం చేసుకుందని ప్రశంసించింది. -
అంతరిక్షం అంచుల నుంచి.. ధ్వని కంటే వేగంగా!
వాషింగ్టన్: ఆకాశం నుంచి కిందికి దూకడంలో గూగుల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు సరికొత్త రికార్డు సృష్టించారు. అంతరిక్షం అంచుల దాకా బెలూన్‌తో వెళ్లి.. అక్కడి నుంచి ధ్వని కంటే వేగంగా కిందికి దూకేశారు! గూగుల్ నాలెడ్జి విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన 57 ఏళ్ల అలెన్ యూస్టేస్ ఈ ఘనత సాధించారు. స్ట్రాటోస్పియర్ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఆయన ఈ స్కైడైవింగ్ చేశారు. తొలుత పెద్ద బెలూన్‌కు వేలాడుతూ నిమిషానికి వెయ్యి అడుగుల చొప్పున రెండున్నర గంటలపాటు పైకి ప్రయాణించిన అలెన్ 1.35 లక్షల అడుగుల (41 కిలోమీటర్లు) ఎత్తులో స్ట్రాటోస్పియర్ చివరికి చేరుకున్నారు. అక్కడ అరగంట పాటు అంతరిక్షాన్ని, భూ వాతావరణం అందాలను చూస్తూ గడిపారు. ఆ తర్వాత బెలూన్ నుంచి విడిపోయారు. వెంటనే ఓ చిన్న రాకెట్లాంటి మాడ్యూల్ మండుతూ అలెన్‌ను వేగంగా కిందికి తోసింది. దీంతో.. ధ్వని కంటే వేగంగా.. అంటే సెకనుకు 340.29 మీటర్ల వేగాన్ని మించి 90 సెకన్ల పాటు కిందికి దూసుకొచ్చారు. ఉపరితలానికి 18 వేల అడుగుల ఎత్తులోకి రాగానే పారాచూట్‌ను విప్పుకొని నెమ్మదిగా నేలపై వాలిపోయారు. న్యూమెక్సికోలోని రాస్వెల్ వద్ద నిర్వహించిన ఈ స్కైడైవింగ్‌కు పారగన్ స్పేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాంకేతిక సహకారం అందించింది. నేలకు సురక్షితంగా చేరుకున్న తర్వాత ఆనందంతో తబ్బిబ్బయిపోయిన అలెన్.. ‘అక్కడి నుంచి అంతరిక్షం నలుపును చూశాను. తొలిసారిగా వాతావరణం పొరలను చూశాను. చాలా అద్భుతంగా, అందంగా ఉంది’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా, ఇంతకుముందు అత్యధిక ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన రికార్డు ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్గార్ట్నర్ పేరు మీద ఉంది. ఆయన కూడా న్యూమెక్సికో నుంచే 2012లో 38.969 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని స్కైడైవింగ్ చేశారు.