breaking news
Strasbourg
-
క్వార్టర్స్‌లో సానియా జంట
పారిస్: స్ట్రాస్‌బర్గ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా ద్వయం 3–6, 6–3, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో లుద్మిలా కిచెనోక్ (ఉక్రెయిన్)–తెరీజా మిహలికోవా (స్లొవేకియా) జోడీపై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ హోరాహోరీగా సాగినా నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సానియా–హర్డెస్కా ద్వయం పైచేయి సాధించింది. -
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి.. రద్దీ ప్రాంతంలో కాల్పులు
స్ట్రాస్‌బర్గ్: క్రిస్మస్ పండుగ వేళ ఫ్రాన్స్ ఉలిక్కిపడింది. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరంలో రద్దీగా ఉండే ఓ వీధిలో బుధవారం ముష్కరుడు కాల్పులతో బీభత్సం సృష్టించాడు. క్రిస్మస్ పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్న సమయంలో అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 12మంది గాయపడ్డారు. ఇది ఉగ్రవాద ఘటనేనని ఫ్రాన్స్ పోలీసులు ధ్రువీకరించారు. స్ట్రాస్‌బర్గ్‌లోని రద్దీగా ఉన్న ఓ వీధిలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడని, కాల్పులు జరిపే సమయంలో అతడు ‘అల్లాహో అక్బర్’ అని నినాదాలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా పోలీసులు గాలింపులు జరుపుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని ఇప్పటివరకు షెరీఫ్ సీ గా గుర్తించారు. అతడికి నేరచరిత్ర, రాడికల్ భావజాలం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. -
ఆ నగరానికి ఏమయ్యింది?
మిస్టరీ ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్... 1518వ సంవత్సరంలో ఓ వేసవి.... ఉదయం పదిన్నర కావస్తోంది. మగవాళ్లు పనులకు పయనమయ్యారు. మహిళలు ఇంటి పనుల్లో తల మునకలై ఉన్నారు. బడికి సెలవులు కావడంతో పిల్లలు వీధుల్లో చేరి ఆటలాడుతున్నారు. అంతలో ఓ పిల్లాడు ‘అమ్మా’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపు వీధి అంతా ప్రతిధ్వనించింది. ఆ పిల్లాడి తల్లి చెవులనూ సోకింది. వెంటనే ఆ తల్లి గబగబా బయటకు వచ్చింది. శిలలా నిలబడిపోయిన పిల్లాడి దగ్గరకు పరుగు తీసింది. ‘‘ఏంటి నాన్నా... ఏమైంది? ఎందుకలా అరిచావ్?’’ అంది కంగారుగా. ఆ బాబు మాట్లాడలేదు. అటు చూడు అన్నట్టుగా తన కుడిచేతిని చాచాడు. వెంటనే తల్లి అటువైపు చూసింది. ఆశ్చర్యంతో ఆమె కనుబొమలు ముడిపడ్డాయి. ఓ స్త్రీ... నలభయ్యేళ్ల పైనే ఉంటాయేమో... వీధిలో పిచ్చిపిచ్చిగా పరుగులు తీస్తోంది. మధ్యమధ్యన ఆగి డ్యాన్స్ చేస్తోంది. మాసిన బట్టలు, చింపిరి జుత్తు... చూడ్డానికి కాస్త భయంకరంగానే ఉంది. ఆమెను చూసి పిల్లలు హడలిపోతున్నారు. పరిగెత్తుకుపోయి అమ్మల మాటున దాగుతున్నారు. ఆమె ఎవరో అక్కడ ఎవరికీ తెలియదు. దాంతో ఎవరో పిచ్చిదై ఉంటుంది అనుకున్నారు. ఎవరి మానాన వాళ్లు వెళ్లిపోదామనుకున్నారు. కానీ కాళ్లకు బ్రేకులు వేసినట్టుగా ఠక్కున ఆగిపోయారు. ఎందుకంటే ఉన్నట్టుండి ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. ఆ మహిళతో కలసి తాను కూడా పిచ్చిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంకొకరు... ఆపైన మరొకరు... ఒకరి తర్వాత ఒకరుగా వస్తూనే ఉన్నారు. ఒళ్లు మరిచి నృత్యం చేస్తున్నారు. ఆ ఒక్క వీధిలోనే కాదు. ఆ ప్రాంతం మొత్తంలో ఇదే పరిస్థితి. వీధుల్లో ఎక్కడ చూసినా పిచ్చి పట్టినవారిలా డ్యాన్స్ చేస్తున్నవారే. వారు కాసేపు చేసి ఆగిపోలేదు. మూడు రోజులు... నాలుగు రోజులు... ఆరు రోజులు... అలా చేస్తూనే ఉన్నారు. తిండీ తిప్పలూ లేకుండా రోడ్లమీద చిందులు వేస్తూనే ఉన్నారు. చివరికి సత్తువ అంతా అయిపోయి కూలబడిపోయారు. పడినవాళ్లు మళ్లీ లేవలేదు. అలాగే ప్రాణాలు వదిలేశారు. వారం రోజుల పాటు సాగిన ఈ ఘోరకలి ఫ్రాన్స్ మొత్తాన్నీ వణికించింది. అసలేం జరిగిందో, వాళ్లంతా అలా ఎందుకు ప్రవర్తించారో, ఎందుకు ప్రాణాలు కోల్పోయారో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడే కాదు... ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. వ్యాధి ఫలితమా? ఆత్మల శాపమా? అప్పట్లో ఫ్రాన్స్‌లో తీవ్రమైన కరువు వచ్చింది. దాని బారిన పడి అల్లాడిన కొందరు మానసికంగా దెబ్బతిన్నారని, అందుకే అలా ప్రవర్తించారని కొందరు వివరణ ఇచ్చారు. నాలుగువందల మందిని బలి తీసుకున్న అలాంటి దారుణం జరక్కుండా పూజలు, హోమాలు, ప్రార్థనలు చేశారు మతపెద్దలు. అదేమీ నిజం కాదు, ఏదో అంతుపట్టని వ్యాధి వచ్చిందన్నారు వైద్యులు. కాదు కాదు, పితరుల ఆత్మలేవో శపించి ఉంటాయన్నారు ఛాందసులు. వైద్య నిపుణుల్ని రంగంలోకి దించింది ప్రభుత్వం. వాళ్లు ఆ పరిస్థితికి డ్యాన్సింగ్ ప్లేగ్ అని పేరు పెట్టారు. రోజులు, వారాలు, సంవత్సరాల తరబడి పరిశోధనలు చేశారు. కానీ కారణాన్ని మాత్రం కనుక్కోలేకపోయారు. నేటికీ ఆ ర హస్యాన్ని ఛేదించినవాళ్లు లేరు. అందుకే డ్యాన్సింగ్ ప్లేగ్ చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయింది. డ్యాన్సింగ్ ప్లేగ్ గురించి జాన్ వాలర్ అనే చరిత్రకారుడు ఎంతో పరిశోధించాడు. తన అనుభవాలన్నింటినీ రంగరించి ‘ఎ టైమ్ టు డ్యాన్స్, ఎ టైమ్ టు డై’ అనే పుస్తకాన్ని రచించాడు. ఆయన అందులో నాటి పరిస్థితిని స్పష్టంగా వివరించాడు. చాలా పరిశోధనలకు ఈ పుస్తకం ఆధారమయ్యింది. కానీ మిస్టరీ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.