breaking news
ST subplan funds
-
'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి'
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ ఆరోపించారు. ఈ పథకానికి ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 15 శాతం కూడా ఖర్చు చేయటం లేదన్నారు. ఈ నిధులను దారిమళ్లకుండా ఉండాలంటే ఎస్సీ సబ్ ప్లాన్ చట్టానికి సవరణలు చేయాలని ఆయన సూచించారు. దళిత, గిరిజన సంక్షేమంపై కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన మంత్రులు, అందుకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. లేకపోతే దళిత, గిరిజన సంఘాలతో కలిసి బీజేపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
'ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు మరిన్ని నిధులు కేటాయింపు'
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు మరిన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చుపై తాము నోడల్ ఏజెన్సీతో చర్చించినట్టు ఆయన తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో వృత్తినైపుణ్యం పెంపు అందిస్తామని మంత్రి రావెల అన్నారు.