breaking news
Smartphone sector
-
దిగ్గజాలకు వివో సవాల్ : అద్భుత స్మార్ట్‌ఫోన్
బీజింగ్ : స్మార్ట్ఫోన్ల తయారీలో కంపెనీలు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు వేగం విషయంలో ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానం కోసం ఆరాటపడుతున్న చైనా కంపెనీ వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ ద్వారా రంగంలోకి వచ్చింది. అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లో హల్ చల్ చేయనుంది. ఏకంగా 12జీబీ ర్యామ్‌తో ఒక స్మార్ట్‌ఫోన్ తీసుకురానున్నట్టు ఐ క్యూ వెల్లడించింది. అంతేకాదు ఐ క్యూ బ్రాండ్ కింద కేవలం ప్రీమియం బాండ్లను మాత్రమే లాంచ్ చేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 1వ తేదీన లాంచ్ చేయబోతున్నామని కంపెనీ పేర్కొంది. చైనాలో ఈ ఈవెంట్ నిర్వహిస్తామని చైనా సోషల్ మీడియా వైబోలో ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇతర వివరాలను ఇంకా రివీల్ చేయకపోయినప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ క్వాల్కం స్నాప్‌డ్రాగన 855 ప్రాసెసర్ ట్రిపుల్ రియర్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అంతేకాదు 6వ తరం ఫింగర్ ప్రింట్ సెన్సర్కూడా ఇందులో పొందుపర్చిందట. See you in Shenzhen, 1st March! Apply for the invitation for attending the launching event with free flight ticket and hotel https://t.co/aPLR9iIX6T https://t.co/9rEM1hKSwD pic.twitter.com/tP7h8BKWr1 — iQOO (@iQOOGlobal) February 20, 2019 -
ఐ వాచ్ అయిపోయింది.. ఇప్పుడిక ‘ఐ రింగ్’
‘ఐ ఫోన్’తో స్మార్ట్ఫోన్ల రంగంలో గొప్ప విప్లవానికి శ్రీకారం చుట్టిన ఆపిల్ కంపెనీ.. ఇప్పుడు వేరబుల్ (ధరించగల) టెక్నాలజీ విషయంలో మరో అడుగు ముందుకేసింది. ఇటీవలే ‘ఐ వాచ్’ను ఆవిష్కరించిన ఈ సంస్థ ఇప్పుడు ‘ఐ రింగ్’కు శ్రీకారం చుట్టింది. ఆపిల్ కంపెనీ ‘ఐ రింగ్’కు పేటెంట్ పొందింది. తద్వారా మరో కొత్తరకం గాడ్జెట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ఆరంభించింది. అత్యంత చిన్నదైన టచ్‌స్క్రీన్ గాడ్జెట్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ఆపిల్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ స్థాయి ఫీచర్లైన ఫొటోస్, టెక్ట్స్‌తో పాటు ఇంకా అసంఖ్యాకమైన అప్లికేషన్లతో ఈ ఐ రింగ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా వివరించింది. ఐ రింగ్‌ను వేరబుల్ టెక్నాలజీలో కొత్త విప్లవంగా అభివర్ణించింది. ఐ వాచ్‌లాగానే ఈ స్మార్ట్ రింగ్ కూడా ఐఫోన్‌తో అనుసంధానం కాగలదు. అన్ని ఫీచర్లూ పొదిగిన రింగ్ ఇది... మనం డిక్టేట్ చేసిన పదాలను స్పెల్లింగ్‌తో సహా రాసిపెడుతుంది, ఐ ఫోన్లో ఇమిడే అన్ని అప్లికేషన్లనూ ఇముడ్చుకుని వాటిని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఫోన్‌తో అనుసంధానం అయి ఉండే ఈ రింగ్... ఫోన్‌కు టెక్ట్స్ మెసేజ్‌లు వచ్చినప్పుడు అలర్ట్ టోన్స్‌ను వినిపిస్తుంది. టెక్ట్స్, ఆడియో, వీడియో మెసేజ్‌లను డిస్ప్లే చేసే సామర్థ్యం ఉంటుంది ఈ రింగ్‌కి. ఇన్‌బిల్ట్‌గా ఉండే కెమెరాతో ఫొటోలు తీసుకోవచ్చు. దీన్ని ధరించిన వ్యక్తి ఉన్న చోట వాతావరణ పరిస్థితులను, ఉష్ణోగ్రత వివరాలను చెబుతుంది ఈ రింగ్. పేటెంట్ హక్కులు తీసుకున్నామని... ఈ డివైజ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తామని ఆపిల్ యాజమాన్యం ప్రకటించింది.