breaking news
Sir Don Bradman
-
22 బంతుల్లోనే రికార్డు శతకం.. 95 ఏళ్ల క్రితమే!
టీ20 క్రికెట్ వచ్చాకా ఆటలో వేగం పెరిగిపోయింది. దీంతో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీలు నమోదు చేస్తున్న బ్యాటర్ల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సెంచరీ భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ నుంచి వచ్చింది. రెండు వరుస ఐపీఎల్ సీజన్లలో తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 37 బంతుల్లో శతకం సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన వైభవ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వైభవ్‌ను ఆకాశానికెత్తుతున్నాం కానీ 95 ఏళ్ల క్రితమే టెస్టు క్రికెట్లో ఆసీస్ దిగ్గజ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ కేవలం మూడు ఓవర్లలోనే సెంచరీ మార్క్ సాధించడం విశేషం. 1931 నవంబర్ 2న బ్లాక్హెత్ తరఫున బ్రాడ్‌మన్ న్యూ సౌత్‌వేల్స్ వేదికగా లిత్గో పొటరీస్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటేంటే అప్పట్లో ఒక ఓవర్‌కు ఆరు బంతులకు బదులు 8 బంతులుండేవి. తాను ఎదుర్కొన్న తొలి ఓవర్లో 33 పరుగులు (8 బంతులు), రెండో ఓవర్లో 40 పరుగులు (8 బంతులు), మూడో ఓవర్లో 27 పరుగులు (ఆరు బంతులు).. మొత్తంగా 22 బంతులెదుర్కొని కేవలం 18 నిమిషాల్లోనే బ్రాడ్‌మన్ 100 పరుగుల మార్క్‌ను చేరుకోవడం విశేషం. ఇక ఆ మ్యాచ్‌లో ఓవరాల్‌గా బ్రాడ్‌మన్ 256 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 29 ఫోర్లు ఉన్నాయి.అప్పటికే సూపర్ ఫామ్‌లో ఉన్న బ్రాడ్‌మన్‌కు ఈ రికార్డు పెద్ద లెక్క కాదు. ఎందుకంటే టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రాడ్‌మన్ ప్రపంచ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో బ్రాడ్‌మన్ సగటు 99.94. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. మొత్తంగా బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6,996 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు, రికార్డు స్థాయిలో 12 డబుల్ సెంచరీలున్నాయి. తన కెరీర్లో చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు చేసి ఉన్నా బ్రాడ్‌మన్ సగటు వందగా ఉండేది. కానీ తన చివరి మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ డకౌట్ అయ్యాడు.Read: పంత్ హవా.. ఆదాయపు పన్ను చెల్లింపులో అగ్రస్థానం! -
విరాట్ 'రికార్డు' మిస్సయ్యాడు!
బెంగళూరు:మాస్టర్ బ్లాస్టర్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ప్రపంచ దిగ్గజ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సర్ బ్రాడ్‌మన్‌తో పోల్చడం మనకు తెలిసిందే. అయితే సచిన్ టెండూల్కర్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఇప్పుడు పోలుస్తున్నారు. ఈ ముగ్గురూ మేటి క్రికెటర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా, ఆనాటి బ్రాడ్‌మన్ రికార్డును విరాట్ కోహ్లి తృటిలో చేజార్చుకున్నాడు. అప్పుడు టెస్టు సిరీస్‌లో బ్రాడ్‌మన్ నమోదు చేసిన రికార్డును, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విరాట్ చేజార్చుకున్నాడు. ఈ రెండు ఫార్మాట్లకు చాలా వ్యత్యాసమే ఉన్నా, ఒక టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన రికార్డులో ఇద్దరూ వరుస స్థానాల్లో నిలిచారు. 1930లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ 974 పరుగులు నమోదు చేశాడు. ఆ సమయంలో ఏడు టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన బ్రాడ్‌మన్ 139.14 సగటుతో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేశాడు. ఆ తరువాత ఇంతకాలానికి, అంటే దాదాపు 80 దశాబ్దాల తరువాత విరాట్ ఆ రికార్డును చేరే అవకాశాన్నిపరుగు తేడాతో కోల్పోయాడు. ఐపీఎల్-9లో 16 మ్యాచ్‌లాడిన విరాట్ 81.08 సగటుతో 973 పరుగులు నమోదు చేశాడు. అయితే బ్రాడ్మన తన క్రికెట్ కెరీర్లో ఆరు సిక్సర్లు మాత్రమే కొడితే, కోహ్లి మాత్రం ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు(38 సిక్సర్లు) కొట్టిన ఘనతను సాధించడం విశేషం. ఇదిలాఉండగా, వన్డేల్లో ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాత్రం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేరిట ఉంది. 1980-81లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్‌లో గ్రెగ్ చాపెల్ వన్డేల్లో అత్యధిక పరుగులను సాధించాడు. ఆ సిరీస్‌లో 14 మ్యాచ్‌లాడిన చాపెల్ 686 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఆ రికార్డుకు సచిన్ దగ్గరగా వచ్చినా అధిగమించలేకపోయాడు. 2002-03లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్‌లో సచిన్ 61.18 సగటుతో 673 పరుగులు మాత్రమే చేసి స్వల్ప తేడాలో చాపెల్ రికార్డును మిస్సయ్యాడు.


