breaking news
Shivraj singh chowhan
-
బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే బయటకు..
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారిని మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు తీశారు సహాయక సిబ్బంది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి చిన్నారి ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లా లాల్గౌన్ పాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాన్సీ అనే చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీసి చెకప్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. बेटी की मां से फोन पर बात की है। यह जानकर संतोष और आनंद हुआ कि बेटी स्वस्थ है। उसे जनरल चेकअप के लिए अस्पताल ले जाया गया। मेरी शुभकामनाएं और आशीर्वाद बेटी के साथ हैं। मामा शिवराज सदैव तुम्हारे साथ हैं! https://t.co/KK9GdA7Qfz — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 26, 2023 కాగా నాన్సీ బోరుబావిలో సుమారు 30 అడుగుల లోతులో చిక్కుకుందని అధికారులు పేర్కొన్నారు. వివిధ రకాల పరికరాలు, జేసీబీలు ఉపయోగించి పాపను కాపాడినట్లు వివరించారు. గతేడాది జూన్లో కూడా ఈ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఐదేళ్ల బాలుడు పొలంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. సహాయక సిబ్బంది 8 గంటలు శ్రమించి అతడ్ని సురిక్షితంగా కాపాడారు. చదవండి: గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం -
ప్రమాద మృతులకు పరిహారం ప్రకటన
జబువా: మధ్యప్రదేశ్ హోటల్లో సంభవించిన పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి రూ. 50వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. జబువా జిల్లా కేంద్రంలోని ఒక రెస్టారెంటులో గ్యాస్ సిలిండర్ లీకై.. పేలిపోవడంతో పైన ఉన్న రెండు అంతస్తులు కుప్పకూలాయి. ఈ సంఘటనలో ఇప్పటి వరకు 82 మంది మృతిచెందినట్టు సమాచారం. పేలుడు కంటే, భవన శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని వంటగదిలో పేలుడు జరగటంతో... మొదటి, రెండో అంతస్తు కూలిపోయింది. దీంతో హోటల్లో ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ భవనం కూలి పక్కనే ఉన్న భవనాలపై పడటంతో.. రెండు భవనాలు కూడా ఒరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.