breaking news
Sherlock Holmes
-
ఇసుకను చూసి ఉప్పందిస్తారు!
డిటెక్టివ్ ‘షెర్లాక్ హోమ్స్’ పేరు మీరు వినే ఉంటారు. బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన పాత్ర అతడు. నేర పరిశోధనలో అతడిది డేగ దృష్టి! రాలిన వెంట్రుకలు, నేలపై పడి ఉన్న సిగరెట్ పీకలు, ఆఖరికి ఆ... నుసి నుంచి కూడా అతడు నేరస్థుడి జాడల్ని, నీడల్ని కనిపెట్టగలడు. ఆ డిటెక్టివ్ హెర్లాక్ హోమ్స్‌ని మించిన వారే... ‘పాగీ’లు! గుజరాత్లో, మూడు ఎడారి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తుండే ఈ పాగీలు... ఇసుకలో పాదముద్రలను బట్టి చొరబాటు దారుల వివరాలను చెప్పటంలో సిద్ధహస్తులు. మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాగీలు భారత సైన్యానికి సహాయపడ్డారు.అలా చెప్పేస్తారంతే! సరిహద్దుల్లో శత్రువు కదలికల్ని పసిగట్టేందుకు భారత్ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. హైటెక్ గాడ్జెట్స్ ఉన్నాయి. సైనికులు నిరంతరం మూడంచెలుగా గస్తీ కాస్తుంటారు. చీమ చిటుక్కున్నా మన తుపాకులు మేల్కొనే శాటిలైట్ వ్యవస్థ ఉంది. ఇవేమీ అవసరం లేకుండానే ‘పాగీ’లు తమ సహజ పరిశీలనా శక్తితో ఎడారిలో ఇసుక ముద్రల్ని డీకోడ్ చేసి సైన్యానికి ఉప్పందించగలరు. పాగీల దగ్గర వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వస్తున్న ప్రాచీన అపరాధ పరిశోధనా నైపుణ్యం తప్ప, సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. అయినా, ఇసుకపై ముద్రల్ని బట్టి అటువైపు ఎవరు నడిచారు, ఎంతమంది నడిచారు అన్నది విశ్లేషించి చెప్పేయగలరు. కాలం చెల్లినట్లుగా కనిపించే ఈ పాగీలు ఒక విధంగా ఇంటెలిజెన్స్ సిబ్బందికి దీటైనవారు.పేగుల్ని లెక్కపెట్టే వేగులుఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చి చూస్తే పాగీలు ఆదిమానవుల కింద లెక్క. కానీ ఈ మానవ ‘ట్రాకింగ్ వ్యవస్థలు’ ఎడారి చొరబాట్ల వివరాల విశ్లేషణల్లో అత్యంత విశ్వసనీయమైనవి. ఉదాహరణకు : సరిహద్దును ఎవరు దాటారు అన్నదొక్కటే కాకుండా, ఎంత మంది దాటారు? వారు ఏమి మోసుకెళ్లారు? వారి లక్ష్యం ఏమిటి? అన్నవి కూడా పాగీలు అంచనా వేయగలరు. మాదకద్రవ్యాల స్మగ్లర్ల కదలికలను కనిపెట్టటం దగ్గర్నుండి, పూర్తిస్థాయి యుద్ధాల సమయంలో సైనికులకు అత్యవసర సమాచారం అందించటం వరకు ఈ సరిహద్దు సంరక్షకులు దేశం ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. 1965, 1971లో పాకిస్తా¯Œ తో జరిగిన యుద్ధాలలో భారత సైన్యం శత్రు భూభాగాలలో చొచ్చుకు వెళ్లటానికి, శత్రువుల కదలికలను గుర్తించడానికి పాగీల నుండి కీలకమైన సహాయం తీసుకుంది. తరచు యుద్ధాల గమనాన్ని నిర్ణయించటంలో కూడా పాగీల భాగస్వామ్యం ఉంటుంది. మెడలిస్టులు కూడా ఉన్నారుబనస్కాంత, కచ్, పటాన్ జిల్లాల్లో ఉండే పాగీలు ఇటీవలి భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి మళ్లీ కీలకం అయ్యారు. పారంపర్య జ్ఞానమే తప్ప, ఎలాంటి శిక్షణా ఉండని పాగీలు సాధారణ నేత్రాలకు కనిపించని ప్రమాద సూచనలను గుర్తించటంలో అత్యద్భుతమైన ప్రావీణ్యం గలవారు. బనస్కాంత జిల్లాలోని సుయిగామ్ తాలూకా, జలోయా గ్రామానికి చెందిన రేవాజీ రాథోడ్ ఇందుకొక నిదర్శనం. 1927లో జన్మించిన ఆయన 1962 ఆగస్టు 4న పాగీగా పోలీసు దళంలో చేరారు. సుయిగామ్, వావ్, ధనేరా సరిహద్దు ప్రాంతాల వెంబడి 28 ఏళ్లపాటు, రెండు యుద్ధాల సమయంలో భారత దళాలకు భూభాగాలపై మార్గ నిర్దేశం చేశారు. ఆ నైపుణ్యాలు ఆయనకు ‘సంగ్రామ్ మెడల్’ ‘వెస్ట్రన్ స్టార్’ పురస్కారాలతో సహా కీర్తి ప్రతిష్ఠల్ని, గుర్తింపును సంపాదించి పెట్టాయి. రంగంలోకి దూకేందుకు సిద్ధంగుజరాత్ సరిహద్దులో కొన్ని చోట్ల కంచె లేకపోయినప్పటికీ ఆ ప్రాంతాలు సురక్షితంగా ఉండటానికి ఒక కారణం.. పాగీల నిరంతర నిఘా. వారు కేవలం పాదముద్రలను గుర్తించడమే కాదు, వాటిని అర్థం చేసుకుంటారు కూడా. శత్రువు ఎలాంటి బూట్లు వేసుకున్నాడు, ఏ మార్కెట్లలో ఆ బూట్లు అమ్ముడవుతాయి, అలాగే – ఎంత బరువుతో వారి నడక సాగింది, ఆ వెళ్లినవారు స్త్రీలా, పురుషులా అనేది కూడా పాగీలు కనిపెడతారు. అవసరం అయిన వెంటనే భద్రతా దళాలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న 5–10 మంది శిక్షణ పొందిన పాగీలు, వారికి సహాయంగా ఉండే 20 మంది యువకుల బృందం ప్రస్తుతం సైన్యానికి అందుబాటులో ఉంది. ఇరవై ఐదు మందికి ఉద్యోగాలుకొంతమంది పాగీలను అధికారికంగా సైన్యంలోకి తీసుకున్నప్పటికీ, వారి సంఖ్య తక్కువగానే ఉంది. ‘‘వారు ట్రాకర్లు మాత్రమే కాదు, అపరాధ పరిశోధకులు కూడా..’’ అని గుజరాత్ పోలీసు సరిహద్దు పరిధి ఐజీపీ చిరాగ్ కొరాడియా అంటారు. ‘‘పాదముద్రలను బట్టి వారు ఒక వ్యక్తిని గుర్తించగలరు. వారిలో ఎవరైనా బరువులు మోస్తున్నారా, వారి వద్ద జంతువులు ఉన్నాయా అని కూడా తెలుసుకోగలరు. ఇంకా అనేక ఇతర వివరాలను అందించగలరు. 2013 హోమ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించి 2014లో క్లాస్ 4 పే గ్రేడ్‌లో 25 మంది పాగీలను శాశ్వతంగా నియమించుకున్నాం’’ అని కొరాడియా తెలిపారు. యూనిఫాం ఉండని సైనికులుపాగీలు కేవలం చారిత్రక యోధులు కారు. వారి అవసరం నేటికీ కొనసాగుతోంది. కచ్‌కు చెందిన 70 ఏళ్ల పాగీ తేజ్మల్జీ సోధా 2001 – 2017 మధ్య సైన్యానికి సహాయంగా పనిచేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణానే కాక, అనేకానేక చొరబాట్లను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు. ‘‘వారు ఎంత దూరం వెళ్లినా, నేను కచ్చితంగా ట్రాక్ చేయగలను..’’ అని ఆయన అంటారు. పాగీలు ఇప్పుడు తమకు గుర్తింపును, తగిన పరిహారాన్ని, తర్వాతి తరానికి శాశ్వతకాల ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘మేము యూనిఫాం ధరించం. అయినప్పటికీ మాతృభూమిని కాపాడతాం’’ అని అంటున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ఫీల్డ్ మార్షల్ జనరల్ శామ్ మానెక్షాపాగీలలో అత్యంత పురాతన వ్యక్తులలో దివంగత రణ్ ఛోడ్ పాగి ఒకరు. ఆయన అసలు పేరు రణ్ ఛోడ్ రబారి. తన 100వ యేట వరకు ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. యుద్ధాల సమయంలో భారత దళాలకు సహాయంగా ఉన్నారు. జనరల్ శామ్ మా¯ð క్షా స్వయంగా రణ్ ఛోడ్ సేవల్ని గుర్తించి 1971లో రూ. 300 వ్యక్తిగత నగదు బహుమతిని కూడా అందజేశారు. రణ్ ఛోడ్ పాగి 2013లో తన 112 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత బి.ఎస్.ఎఫ్. ఆయన గౌరవార్థం బనస్కాంత ఔట్పోస్టులలో ఒకదానికి ఆయన పేరు పెట్టింది. -
Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?
Fact Check: సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హార్ష్ గోయేంకా తప్పులో కాలేశారు. సరైన సమచారం లేకుండా వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఇంతలో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బెంగాల్ ప్రభుత్వం నిజాలు వెల్లడించింది. షెర్లాక్ హోమ్స్ కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న ఓ పాడుబడ్డ భవనం. ఆ బిల్డింగ్ ద్వారాలకు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ , సీఐడీ వెస్ట్‌బెంగాల్ అన్న బోర్డు. దాని కింద నుంచి నడుముకు టవల్ చుట్టుకుని చేతిలో బకెట్‌తో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి. పైన బోర్డుకు కింద కనిపిస్తున్న మనిషికి మధ్య పొంతనే లేదు. ఈ ఫోటోను ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హార్ష్గోయెంక ట్వీట్ చేశారు. ‘షెర్లాక్‌హోమ్స్ స్టెపింగ్ అవుట్ ఆఫ్ హిజ్ బేకర్ స్ట్రీట్ ఆఫీస్ ఇన్ కోల్‌కతా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. Sherlock Holmes stepping out of his Baker Street office in Kolkata! 😀😀😀 pic.twitter.com/wVSNFYICYA — Harsh Goenka (@hvgoenka) September 21, 2021 మారువేశంలో హర్ష్ గోయేంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. డిటెక్టివ్ మారు వేశంలో ఉన్నాడంటూ చాలా మంది వ్యంగంగా స్పందించగా మరికొందరు డిటెక్టివ్లు ఆఫీసుల కూర్చుని ఉండిపోకుండా ఫీల్డ్‌కు వెళ్లాలని ఇలా చేశారంటూ చమత్కరించారు. కానీ చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం మమతా బెనర్జీని టార్గెట్‌గా చేసుకుని కామెంట్లు చేశారు. వాస్తవం ఇది బ్రిటిష్ కాలంలోనే 1886లోనే కోల్‌కతాలో ఓ బ్రిటీష్ అధికారి హత్యకు గురైతే తొలిసారిగా డిటెక్టివ్ కార్యాలయం నెలకొల్పారు. వందల ఏళ్ల నుంచి ఈ నగరంలో డిటెక్టివ్ డిపార్ట్మెంట్ పని చేస్తోంది. నగరంలోని పీల్ఖానాలో డిటెక్టివ్ భవనం కూలేందుకు సిద్ధంగా ఉండటంతో 2016లో ఆ భవనం ఖాళీ చేశారు. భవనీ నగర్‌లోని సీఐడీ కార్యాలయంలోకి డిటెక్టివ్ ఆఫీస్‌ని మార్చారు. అయితే పాత ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరీ షెర్లాక్‌హోమ్స్ ఇంగ్లండ్ రచయిత విలియం షేక్స్పియిర్ గొప్ప రచనలు ఎన్నో చేశారు. అందులో డిటెక్టివ్ ప్రధాన పాత్రగా షెర్లాక్ హోమ్స్ అనే నాటకం రచించారు. దీంతో సీక్రెట్ ఏజెంట్ అంటే జేమ్స్‌బాండ్ పాత్ర గుర్తొచ్చినట్టు ప్రపంచ వ్యాప్తంగా డిటెక్టివ్ అంటే షెర్లాక్‌హోమ్స్ గుర్తుకురావడం పరిపాటిగా మారింది. చదవండి : కానిస్టేబుల్ ధైర్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా ! -
యాక్టివ్ కెరీర్‌కు.. డిటెక్టివ్!
నేరాలను, నేరస్థులను గుర్తించడంలో షెర్లాక్ హోమ్స్ చూపిన ప్రతిభాపాటవాలు మనల్ని అబ్బురపరుస్తాయి. కల్పిత పాత్రే అయినా డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులున్నారు. నేరాలు ఘోరాలు, అవినీతి అక్రమాలు నానాటికీ పెరిగిపోతున్న ఆధునిక కాలంలో డిటెక్టివ్‌ల అవసరం కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుత సమాజంలో అపరాధ పరిశోధకులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అందుకే అపరాధ పరిశోధనను కెరీర్‌గా ఎంచుకుంటే అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను, క్లయింట్ల అభిమానాన్ని సొంతం చేసుకోవచ్చు. పరిశోధకులకు చేతినిండా పని అపరాధ పరిశోధకులకు డిటెక్టివ్ ఏజెన్సీలు, న్యాయ సేవా సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కౌన్సిళ్లు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలున్నాయి. కేసుల ముడి విప్పేందుకు న్యాయవాదులు, పోలీసులు కూడా డిటెక్టివ్‌ల సహాయం కోరుతుంటారు. విడాకులు, దత్తత, తప్పిపోయినవారిని గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టడం.. వంటి వ్యవహారాల్లో వీరి ప్రమేయం తప్పనిసరి. సమాజంలో అభద్రతాభావం, నేరాలు ఉన్నంతకాలం అపరాధ పరిశోధకులకు చేతినిండా పని దొరుకుతుంది. డిటెక్టివ్‌లో తమ వృత్తిలో పేరు తెచ్చుకోవాలంటే అన్ని అంశాల్లో ఎంతోకొంత పరిజ్ఞానం అవసరం. లా, సైకాలజీ, సోషియాలజీ, టోపోగ్రఫీ, ఆయుధాలు, కెమిస్ట్రీ, జియాలజీ, ఫిలాసఫీ, అనాటమీ వంటి సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలి. ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, పరిజ్ఞానం, అనుభవంతోపాటు సేవలను మార్కెట్ చేసుకొనే నైపుణ్యంపైనే డిటెక్టివ్‌ల విజయం ఆధారపడి ఉంటుంది. కావాల్సిన నైపుణ్యాలు: డిటెక్టివ్లకు మంచి పరిశీలన, విశ్లేషణ నైపుణ్యాలు ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ పెంచుకోవాలి. న్యాయ పరిజ్ఞానం అవసరం. నీతి నిజాయతీలకు కట్టుబడి ఉండే లక్షణం ముఖ్యం. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. చేపట్టిన బాధ్యతలను పూర్తిచేసేందుకు ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఓర్పు, సహనం అలవర్చుకోవాలి. వెర్బల్, రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ వృత్తిలో సవాళ్లు, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురుకావొచ్చు. వీటిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. అర్హతలు: డిటెక్టివ్‌గా మారేందుకు ప్రత్యేకంగా విద్యార్హతలు అంటూ లేవు. అయితే, కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడం మంచిది. క్రిమినాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ వంటి కోర్సులు చేసినవారు అపరాధ పరిశోధకులుగా వృత్తిలో రాణించొచ్చు. క్లయింట్లను మెప్పించడానికి, మెరుగైన సేవలు అందించడానికి మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ స్కిల్స్ ఉండాలి. డ్రైవింగ్ లెసైన్స్ ఉండడం తప్పనిసరి. డిటెక్టివ్‌గా మారాలనుకునేవారు మొదట ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ల వద్ద సహాయకులుగా చేరి, అనుభవం సంపాదించాలి. తర్వాత డిటెక్టివ్ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ అండ్ ఇన్వెస్టిగేటర్స్, కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటర్స్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ డిటెక్టివ్స్ వంటి సంస్థల వెబ్సైట్లలో ఔత్సాహికులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. వేతనాలు: అపరాధ పరిశోధకులు తమ అనుభవం, పనితీరు ఆధారంగా ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో ఏడాదికి రూ.1.25 లక్షల నుంచి రూ.2.5 లక్షలు ఆర్జించే అవకాశం ఉంది. న్యాయ పరిజ్ఞానం ఉన్న డిటెక్టివ్లకు కార్పొరేట్ సంస్థల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభిస్తుంది. ఈ రంగంలో అనుభవాన్ని బట్టి సీనియర్ ఇన్వెస్టిగేటర్, టీమ్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఢిల్లీ యూనివర్సిటీ వెబ్సైట్: www.du.ac.in/du/ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ-ఆగ్రా వెబ్సైట్: www.dbrau.ac.in యూనివర్సిటీ ఆఫ్ మైసూరు వెబ్సైట్: www.unimysore.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్. వెబ్సైట్: జ్ట్టిఞ://nicfs.nic.in/