breaking news
Scorching
-
హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి!
జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు.భారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్‌కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ ఇచ్చినట్లు దౌత్య అధికారులు తెలిపారు. జోర్డాన్‌కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. -
భిక్షాటన మొత్తం 10 లక్షలు కాలిపోయాయి
సాక్షి, ముంబై: పాపం.. ఏళ్ల తరబడి భిక్షాటన చేసి సంపాదించుకున్న డబ్బు ఎలుక పుణ్యమాని తగులబడిపోయింది. అదేం చిన్నా చితకా కాదు.. ఏకంగా రూ. 10 లక్షలు. కళ్యాణ్‌లోని మారూమూల ప్రాంతంలోని చిన్న గుడిసెలో నివాసముంటున్న మహ్మద్ రెహమాన్, అతని భార్య ఫాతిమా.. సమీపంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో భిక్షాటన చేస్తూ.. ఇంత మొత్తాన్ని కూడబెట్టారు. మంగళవారం కరెంటుపోవటంతో.. దీపం పెట్టుకుని పడుకున్నారు. అయితే.. బుధవారం తెల్లవారుజామున ఎలుకలు దీపాన్ని పడగొట్టడంతో.. గుడిసెకు నిప్పంటుకుంది. ఈ దంపతులు ప్రాణాలతో బయటపడ్డా.. సంచుల్లో దాచి గోడల్లో కుక్కి పెట్టిన సంపాదన కూడా కాలిపోయింది. సంచుల్లో ఉన్న నోట్లను బట్టి రూ.10 లక్షల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.