breaking news
Sapna Gill
-
బెయిల్‌పై బయటికి.. వెంటనే పృథ్వీ షాపై కేసు
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవలే దాడి జరిగిన సంగతి తెలిసిందే. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదన్న కారణంతో పృథ్వీ షాపై దాడి చేసిన వారిలో సోషల్ మీడియా స్టార్ సప్నా గిల్ కూడా ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమెతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. తాజాగా సప్నా గిల్ బెయిల్‌పై బయటకు వచ్చింది. కాగా మిగతా ఎనిమిది మందిని మాత్రం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే సప్నా గిల్ వచ్చీ రావడంతో పృథ్వీ షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్‌పై రివర్స్ కేసు పెట్టడం ఆసక్తి కలిగించింది. పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా గిల్ ఆరోపించింది. తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని.. అందుకే ప్రతిఘటించాల్సి వచ్చిందని సప్నా గిల్ తెలిపింది. దీంతో పృథ్వీ షా, సప్నా గిల్ల మధ్య వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. సప్నాగిల్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న ఓ క్లబ్‌కు వెళ్లానని, సదరు క్రికెటర్‌ను చూడగానే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందని ఫిర్యాదులో తెలిపింది. తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ కోసం పృథ్వీషాను సంప్రదించగా వాగ్వాదానికి దిగాడని, అతడు బలవంతంగా తన స్నేహితురాలి ఫోన్‌ను తీసుకుని నేలపై హింసాత్మకంగా విసిరి పాడుచేశాడని ఆరోపించింది. తను క్రికెట్‌ను అంతగా అభిమానించనని, అసలు పృథ్వీషా ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేసింది. కావాలనే అతడు, అతడి స్నేహితులు తమపై దాడి చేశారని, నేను వద్దని వారించినప్పటికీ తన మాటలను వినకుండా అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆ సమయంలో పృథ్వీ తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని తెలిపింది. మరోవైపు పృథ్వీషా.. తనపై కేసు పెట్టడంపై కూడా సప్నా గిల్ స్పందించింది. "నేను 50 వేలు అడిగానని చెబుతున్నారు. ఈ రోజుల్లో 50 వేలు అంటే ఏంత? నేను రెండు రీళ్లు చేసి ఒక్క రోజులో అంత సంపాదించగలను. ఆరోపణ చేయాలంటే కనీసం కొంత స్థాయి అయినా ఉండాలి." అని సప్నా గిల్ తెలిపింది. #PrithviShaw https://t.co/EXqoU6AgJO pic.twitter.com/3UfmJCAYwO — Suraj Ojha (@surajojhaa) February 16, 2023 చదవండి: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి టీమిండియా క్రికెటర్‌పై దాడి.. నటి అరెస్ట్ -
టీమిండియా క్రికెటర్‌పై దాడి.. నటి అరెస్ట్
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసులో నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్న గిల్‌ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ఫీ అడిగితే ఇవ్వడం లేదని పృథ్వీ షాపై కొంతమంది దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వారిలో సప్న గిల్‌తో పాటు ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో లంచ్‌కి వెళ్లిన పృథ్వీ షా, అతని స్నేహితుడు సురేంద్ర యాదవ్‌ను సప్న గిల్ గ్యాంగ్ సెల్ఫీ అడుగుతూ ఇబ్బందికి గురి చేసింది. గమనించిన హోటల్ సిబ్బంది వారిని బయటకు పంపించేశారు. దీన్ని అవమానంగా భావించిన సప్న .. షా ప్రయాణిస్తున్న కారును వెంబడించి..అతనిపై దాడికి పాల్పడింది. దీంతో షా,సురేంద్ర యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. సప్న గిల్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సప్న గిల్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన డ్యాన్స్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమె 2.20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే పలు ‘కాశీ అమర్నాథ్’, ‘మేరా వానత్’ వంటి భోజ్‌పురి సినిమాల్లో కూడా నటించింది. Hustle video of #Cricketer #Prithvishaw & #influencer #Sapnagill outside Barrel mansion club in vile parle east #Mumbai, it is said that related to click photo with cricketer later whole fight started. @PrithviShaw @MumbaiPolice @DevenBhartiIPS @CPMumbaiPolice @BCCI pic.twitter.com/6LIpiWGkKg — Mohsin shaikh 🇮🇳 (@mohsinofficail) February 16, 2023