breaking news
Sandhya Reddy
-
అభ్యర్థుల్లో ‘కంగారు’ పుట్టించారు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు. సిడ్నీలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి అలియాస్ సాండీ రెడ్డి.. వెస్ట్ సిడ్నీలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవగా, రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి చెట్టిపల్లి లివింగ్స్టన్.. బ్లాక్ టౌన్ వార్డ్ 5 నుంచి విజయం సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్ అలియాస్ శ్రీనీ.. హాన్స్ బీ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. లివింగ్స్టన్, శ్రీనివాస్ ఇద్దరూ లిబరల్ పార్టీ నుంచి గెలవగా సంధ్యారెడ్డి ఇండిపెండెంట్‌గా విజయం సాధించా రు. ఈ మేరకు బుధవారం ఫలితాలు వెల్లడించారు. కొండా ఫ్యామిలీ నుంచి.. కొండా రంగారెడ్డి సోదరుడు కొండా నారాయణరెడ్డి మనవరాలు సంధ్యారెడ్డి. ఈమె మేనమామ కొండా లక్ష్మణ్ రెడ్డి 1983లో చేవెళ్ల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచి ఖైరతాబాద్‌లో పెరిగిన సంధ్యారెడ్డి.. 16 ఏళ్ల క్రితం నగరానికి చెందిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిన బుచ్చిరెడ్డి కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సంధ్యారెడ్డి కూడా స్ట్రాత్ ఫీల్డ్‌లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు క్లీన్ అప్ ఆస్ట్రేలియా నినాదంతో కార్యక్రమాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి. ఇద్దరూ ప్రస్తుతం హైస్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా చిన్న కుమారుడు నిఖిల్‌రెడ్డి నేషనల్ జూనియర్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఈ స్థానిక సంస్థలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో సంధ్యారెడ్డితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్‌గా గెలవగా మిగిలిన వాళ్లు స్థానిక పార్టీల నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌గా సంధ్యారెడ్డికి అవకాశం వస్తుందని సిడ్నీలోని భారతీయులు భావిస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ అరుదైన ఘనత
మెల్బోర్న్: ప్రవాస తెలుగుమహిళ సంధ్యారెడ్డి ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత వహించారు. హైదరాబాద్‌కు చెందిన కర్రి బుచ్చిరెడ్డి, సంధ్యారెడ్డి దంపతులు దశాబ్దం కిందటే ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన సంధ్యారెడ్డి.. ఆస్ట్రేలియాలో స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న తొలి ప్రవాస తెలంగాణవాసిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ విషయాలను ఆమె భర్త బుచ్చిరెడ్డి తెలిపారు. తన భార్య సంధ్యారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సిడ్నీ సబర్బన్ ఏరియా స్టార్త్ ఫీల్డ్ మునిసిపాలిటీ ఎన్నికల బరిలో సంధ్యారెడ్డి ఉన్నట్లు తెలిపారు. ఆసీస్ లోని ప్రవాస భారతీయులు సంధ్యారెడ్డికి తమ మద్ధతు తెలపడంతో ఆమె విజయంపై బుచ్చిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆ చిచ్చర పిడుగు వీరి కుమారుడే! మరోవైపు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించిన ఆస్ట్రేలియా జూనియర్ చెస్ చాంపియన్ షిప్-2017 (ఏజేసీసీ)ను భారత సంతతికి చెందిన నిఖిల్ రెడ్డి అనే ఎనిమిదేళ్ల బాలుడు సాధించిన విషయం తెలిసిందే. నిఖిల్ రెడ్డి మరెవరో కాదు.. కర్రి బుచ్చిరెడ్డి, సంధ్యారెడ్డి దంపతుల కుమారుడు కావడం గమనార్హం.