breaking news
rs. 35 crores
-
30 రోజుల్లో ... రూ. 35 కోట్లు స్వాధీనం
తమిళనాడు ఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు మంత్రి అనుచరుని ఇంటిలో రూ.5 కోట్లు జైలు బెదిరింపులు బేఖాతర్ చెన్నై: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండిపోతుండగా నేతలు, అభ్యర్థులు మాత్రం కాసులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. నగదు బట్వాడాకు పాల్పడితే జైలు ఖాయమన్న ఎలక్షన్ కమిషన్ బెదిరింపులు బేఖాతర్ అంటూ నేతలు సవాల్ విసురుతున్నారు. నెలరోజుల్లో రూ.35 కోట్లు స్వాధీనం కావడం ఈసీని కంగారుపెడుతోంది. ఓటుకు నోటు ఇవ్వడం, పుచ్చుకోవడం రెండూ నేరమేనని ఎన్నికల కమిషన్ ప్రచారం చేసింది. పట్టుబడ్డారంటే ఏడాది జైలు ఖాయమని ఎన్నోసార్లు హెచ్చరించింది. అయితే ఎన్నికల్లో గెలిచామనేదే ముఖ్యంకానీ ఎలా గెలిచామని ఎవ్వరూ అడగరనే సిద్ధాంతాన్ని అన్ని పార్టీలూ ఒంటపట్టించుకున్నాయి. నోటు వెదజల్లితేగానీ సీటు దక్కదని నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఒక సీటు కోసం ఎన్నినోట్లు వెదజల్లడానికైనా సిద్ధపడుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో పగటి వేళ ఎన్నికల అధికారుల నిఘా పెరగడంతో అర్థరాత్రి దాటిన తరువాత, తెల్లవారుజామున కొన్ని పార్టీల నేతలు ఇళ్ల ముందు చీరలు, పంచెలు, బిరియానీ, క్వార్టర్ బాటిళ్లను ఉంచి వెళ్లారు. ఉదయాన్నే వాకిలి చిమ్మేందుకు వచ్చిన గృహిణులు వాటిని భద్రంగా ఇంటిలో పెట్టుకున్నారు. దండాలు పెట్టుకుంటూ పగటి వేళ ప్రచారానికి వచ్చిన అభ్యర్థులు వస్తువులు ముట్టినాయా అని అడగడం ద్వారా ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. అలాగే నోటు చేతిలో పడనిదే గడపదాటని ఓటర్లు కూడా కొందరున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తులు నగదు బట్వాడా తమ వీధిలో జరగలేదంటూ పార్టీ కార్యాలయానికి వెళ్లి మరీ తగవుపెట్టుకున్నారు. రాను రానూ ఓటుకు నోటు సహజంగా మారిపోవడంతో అభ్యర్థులు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. నెలరోజుల్లో రూ.35 కోట్లు: చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించగానే గత నెల 20 వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారులు రాత్రికి రాత్రే వాహన తనిఖీలు ప్రారంభించారు. రూ.50వేలకు మించి నగదు పట్టుబడితే డాక్యుమెంట్లు చూపాలని, లేనిపక్షంలో స్వాధీనం చేసుకుంటామని ఈసీ యథావిధిగా ప్రకటించింది. అనేక హెచ్చరికలు కూడా చేసింది. అయితే ఈ హెచ్చరికల ప్రభావం అభ్యర్థులపై పడిందోలేదో గానీ భారీమొత్తంలో డబ్బు పట్టుపడుతూనే ఉంది. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి రూ.30 కోట్లు పట్టుబడింది. రెండురోజుల క్రితం కేరళ, తమిళనాడు సరిహద్దులో రూ.1.36 కోట్లు, శుక్రవారం రాత్రి కొరటూరులో రూ.63 లక్షలు నగదు పట్టుబడింది. మంత్రి అనుచరుని ఇంటి నుంచి రూ.5 కోట్లు: ఇదిలా ఉండగా, మంత్రి నత్తం విశ్వనాథన్ అనుచరునిగా చెప్పబడుతున్న వ్యక్తి గిడ్డంగిపై శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.5 కోట్ల విలువైన నగదు పట్టుబడి కలకలం రేపింది. కరూరు సమీపం అయ్యంపాళంలో నత్తం విశ్వనాథన్ అనుచరుడిగా చెప్పబడుతున్న అన్బునాథన్కు ఫాంహౌస్, గిడ్డంగి ఉంది. ఆ గిడ్డంగిలో భారీ మొత్తంలో నగదు దాచి ఉంచినట్లు ఈసీ రాజేష్లఖానీకి సమాచారం అందడంతో కరూర్ జిల్లా ఎస్పీ, అతని ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మాత్తుగా రైడ్ చేశారు. మరికొద్ది సేపట్లో అభ్యర్థుల ఖర్చుల వివరాలను సేకరించే ఐఆర్ఎస్ అధికారులు చేరుకున్నారు. గిడ్డంగి నుంచి ఎస్పీ వెలుపలికి వచ్చి... వివరాలు ఏమీ చెప్పకుండా వెళ్లిపోయారు. సమీపంలోని అన్బునాథన్ ఇంట్లో కూడా రాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.5 కోట్లు కంటపడడంతో అధికారులకు కళ్లుతిరిగినంత పనైంది. అన్బునాథన్ గిడ్డంగిలో సైతం నగదు దొరికినట్లు సమాచారం. శుక్రవారం అర్ధ రాత్రి దాటిన తరువాత సైతం తనిఖీలు సాగాయి. -
నా 35 కోట్ల మాటేంటి: సల్మాన్
అత్తారింటికి దారేది సినిమాకు సంబంధించి తనకు ఇంకా రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మీద 'మా'లో ఫిర్యాదు చేశారు హీరో పవన్ కల్యాణ్. కానీ.. 2015 సంవత్సరంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన బజరంగీ భాయీజాన్ సినిమాకు సంబంధించి సల్మాన్ ఖాన్కు ఆ సినిమా నిర్మాత ఇంకా ఏకంగా రూ. 35 కోట్లు బాకీ ఉన్నారట. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీసును మోత మోగించి.. మన దేశంలోనే దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో మరో రూ. 300 కోట్లు కలిపి, మొత్తం రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. సినిమా విడుదలై ఆరు నెలలు గడిచినా.. అంత భారీ కలెక్షన్లు వసూలుచేసినా, ఇప్పటికీ తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోవడంపై సల్లూభాయ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.