breaking news
Restructuring
-
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. మొత్తం 12 మంది సభ్యులుండే ఈ బోర్డును ఆగస్టు 30 నాటికి పునర్ వ్యవస్థీకరించే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. యువ నాయకులతో పాటు ముగ్గరు లేక నలుగురు ప్రస్తుత ముఖ్యమంత్రులకు ఇందులో చోటు కల్పించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 మంది సభ్యుల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మరో 8 మంది ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టి పెట్టుకొని పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త బోర్డులో మార్పులు చేపట్టనున్నారు. బోర్డు లో అవకాశం దక్కనున్న వారిలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన కు ఆర్ఎస్ఎస్తో ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు ఒక కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా జాతీయ రాజకీయాల్లో ఫడ్నవీస్ పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈయనతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, బెంగాల్ సీఎం సువేందు అధికారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ముగ్గురు లేక నలుగురు సీఎంలను బోర్డులోకి తీసుకుంటే ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను తప్పించే అవకాశం ఉందంటున్నారు. పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణలో ప్రాంతాలు, వివిధ సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిథ్యం కల్పించడంపైనా దృష్టి పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన ఇద్దరు నేతలు బీఎస్ యడ్యూరప్ప, తెలంగాణకు చెందిన ఎంపీ కె.లక్ష్మణ్ ప్రస్తుతం బోర్డులో సభ్యులుగా ఉన్నారు. వీరిలో తిరిగి ఒక్కరికే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మొన్నటి బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఎవరికీ ప్రాతినిథ్యం దక్కని దృష్ట్యా లక్ష్మణ్‌ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. బోర్డు తర్వాత సీఈసీ.. బోర్డు పునర్వ్యవస్థీకరణ తర్వాత బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీలో పార్లమెంటరీ బోర్డు సభ్యులందరితో పాటు ఇతర ముఖ్య నా యకులు కూడా ఉంటారు. ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్, మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న రూప్ కుమారి చౌదరి, కేంద్ర ఎన్నికల కమిటీలో పదవీ రీత్యా సభ్యురాలిగా మారనున్నారు. నితిన్ గడ్కరీ ఫడ్నవిస్, యాదవ్‌లను సభ్యులుగా కొనసాగిస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. -
కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ లీప్’ పేరుతో భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 నుంచి 15,000 మంది ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.రూ.2,600 కోట్ల పైచిలుకు వ్యయంఈ పునర్నిర్మాణ ప్రక్రియ కోసం కాగ్నిజెంట్ 230 మిలియన్ డాలర్ల నుంచి 320 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,900 కోట్ల నుంచి రూ.2,600 కోట్లు) నిధులను కేటాయించింది. ఇందులో ప్రధానంగా 200 మిలియన్ల నుంచి 270 మిలియన్ డాలర్లను ఉద్యోగులకు సంబంధించిన ఇతర ఖర్చుల కోసం కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కంపెనీ అధికారికంగా తొలగింపుల సంఖ్యను వెల్లడించనప్పటికీ అంతర్గత వ్యయ అంచనాలు, వివిధ ప్రాంతాల్లోని జీతభత్యాల ప్రమాణాల ఆధారంగా ఈ గణాంకాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.భారత్‌పైనే తీవ్ర ప్రభావం?కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3,57,000 మందికి పైగా సిబ్బందిని కలిగి ఉండగా ఇందులో 2,50,000 మందికి పైగా భారత్‌లోనే పనిచేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ జీతభత్యాల వ్యయం తక్కువగా ఉండటం, ఉద్యోగ విరమణ/తొలగింపు ప్రక్రియకు సంబంధించిన ఖర్చులు సాపేక్షంగా తక్కువ కావడంతో ఈ కోతలు భారత్‌లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
సైయంట్ సీఈవోగా కార్తీక్ నటరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ కొత్త సీఈవోగా కార్తీక్ నటరాజన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఈడీగా ఉన్నారు. ఇప్పటివరకూ సీఈవోగా ఉన్న కృష్ణ బోదనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీగా పదోన్నతి పొందారు. ఏరోస్పేస్ తదితర విభాగాల గ్లోబల్ హెడ్ ప్రభాకర్ అట్ల.. సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. సంస్థను 2 విభాగాలుగా విడదీసే పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సైయంట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సైయంట్ డీఎల్ఎం(డిజైన్ లెడ్ మాన్యుఫాక్చరింగ్) వ్యాపార విభాగం పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. సైయంట్ డీఎల్ఎంకి ఆంటోనీ మాంటల్బానో సీఈవోగా వ్యవహరిస్తారు. -
పార్లమెంటరీ స్థాయీ సంఘాల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునర్వ్యస్థీకరించింది. చైర్మన్ పదవులు అధికార బీజేపీ, మిత్రపక్షాలకే దక్కాయి. ప్రతిపక్షాలకు మొండిచెయ్యి ఎదురయ్యింది. ఇన్నాళ్లూ వివిధ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా పనిచేసిన ప్రతిపక్ష ఎంపీలను తొలగించారు. హోంశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింఘ్వీని తొలగించి, బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్‌ను నియమించారు. ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను తొలగించారు. షిండే వర్గం శివసేన ఎంపీ ప్రతాప్రావు జాదవ్‌ను నియమించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్‌ను పక్కనపెట్టారు. పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నుంచి డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీ, రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క చైర్మన్ పదవి లభించలేదు. -
అదానీ గ్రూప్ పునర్వ్యవస్థీకరణ
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్ బిజినెస్‌లలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ముంబై ఎయిర్‌పోర్ట్స్ సీఈవో ఆర్కే జైన్‌ను ఎయిర్‌పోర్ట్స్ సీఈవోగా ఎంపిక చేసింది. నాన్‌ఏరో బిజినెస్ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్(ఏఏహెచ్ఎల్)కు బెన్ జండీని సీఈవోగా నియమించింది. గత వారం ముంబై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్) మేనేజ్మెంట్ను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుబంధ సంస్థ అయిన ఏఏహెచ్ఎల్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏఏహెచ్ఎల్ ప్రెసిడెంట్ ప్రకాష్ తుల్సియానీ ఎంఐఏఎల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతేకాకుండా ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అహ్మదాబాద్ నుంచి ముంబైకు మారుస్తోంది. త్వరలో ప్రారంభంకానున్న నవీ ముంబై ఎయిర్‌పోర్టులో ఎంఐఏఎల్‌కు 74 శాతం వాటా ఉంది. గతేడాది ఆగస్ట్‌లో జీవీకే గ్రూప్‌నకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో గల వాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అదానీ గ్రూప్ 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. -
నగర సుందరీకరణ, పునర్నిర్మాణంపై దృష్టి
విశాఖ రూరల్: నగర సుందరీకరణ, పునర్నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుపాను సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సోమవారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో కనీసం 2 వేల గృహాలతో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఒక కాలనీని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఐఏవై, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఒక్కో జిల్లాలో రెండు, మూడు మోడల్ కాలనీలు నిర్మిస్తామని వెల్లడించారు. 4జీ కనెక్టవిటీ అన్ని గ్రామాలకు 10 నుంచి 15 ఎంబీపీఎస్ సామర్థ్యంతో అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లు మినహా పారిశ్రామిక, గృహ, వాణిజ్య కనెక్షన్లన్నింటికీ విద్యుత్‌ను పునరుద్ధరించామని ఇందన శాఖ కార్యదర్శి అజేయ్‌జైన్ సీఎంకు వివరించారు. విశాఖలో భూగర్భంలో విద్యుత్ లైన్లు వేసేందుకు రూ.1465 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని తెలిపారు. విశాఖ జిల్లాలో 34,180 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఈ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.49.18 కోట్లు 1.55 లక్షల మంది రైతులకు చెల్లించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ వివరించారు. విశాఖలో మత్స్యకారులకు తగిన పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. స్వల్ప వ్యవధిలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు తోడ్పడిన మూడు జిల్లాల అధికారులను అభినందించారు. సమావేశంలో మంత్రులు సి.హెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని, పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిషోర్‌బాబు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీలు కె.హరిబాబు, కింజరపు రామ్మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కొంత మందిని తప్పిస్తాం
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మందిని మంత్రి మండలి నుంచి తప్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అదేవిధంగా మరి కొంత మంది మంత్రిత్వశాఖలను మారుస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో ఈ వాఖ్యలు చేశారు.


