reskill
-
ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలిచ్చి మరీ..
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పాత ఉద్యోగాలను వేగంగా మార్చేస్తోంది. గ్లోబల్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) దిగ్గజం సేల్స్‌ఫోర్స్ ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐ కార్యకలాపాల నేపథ్యంలో అంతర్గత పునర్నిర్మాణం, బడ్జెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా సాంప్రదాయక విధుల్లో ఉన్న సుమారు 3,000 మంది ఉద్యోగులను కొత్త నైపుణ్యాలతో సేల్స్ విభాగంలోకి మళ్లించినట్లు కంపెనీ చీఫ్ డిజిటల్ ఎవాంజెలిస్ట్ వాలా అఫ్షర్ వెల్లడించారు. మే 18న తన తొలి అధికారిక భారత పర్యటనలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్గతంలో మానవ వనరులు అవసరమైన కొన్ని తక్కువ ప్రభావం చూపే పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని వాలా అఫ్షర్ పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీలో మిగిలిన ప్రతిభావంతులైన ఉద్యోగులను తొలగించకుండా వారికి తగిన శిక్షణ ఇచ్చి సేల్స్ ఫంక్షన్‌కు అనుగుణంగా మార్చినట్లు తెలిపారు.‘ఏఐ ఏజెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ఇప్పటివరకు ఆయా పనులు నిర్వహించిన ఉద్యోగులకు రీ-స్కిలింగ్ అందించాం. బయటి నుంచి ఎవరినీ కొత్తగా నియమించుకోకుండానే అంతర్గత వ్యాపార విభాగాల నుంచే ఈ 3,000 మందిని సేల్స్ పాత్రల్లోకి డిప్లాయ్ చేశాం. ఈ ప్రక్రియ బడ్జెట్ వ్యయాలపై కూడా ప్రభావం చూపుతుంది. బడ్జెట్లు మారుతాయి. కొన్నిసార్లు నాయకత్వ శైలి మారుతుంది. దీనివల్ల మధ్యస్థాయి మేనేజ్మెంట్ తగ్గి కంపెనీ మరింత సమర్థంగా మారుతుంది. అందుకు అనుగుణంగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను కూడా పునసమీక్షించుకోవాల్సి ఉంటుంది’ అని వాలా అఫ్షర్ చెప్పారు.2024లోనే కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ బెనియోఫ్ కోడింగ్, ఉత్పాదకత పెంపునకు ఏఐ సాధనాలే సరిపోతాయని, భవిష్యత్తులో ఎక్కువ మంది ఇంజినీర్లను నియమించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. తాజా వ్యూహం దానికి అద్దం పడుతోంది. 2026 నాటికి ఆంత్రోపిక్ టోకెన్ల కోడింగ్ అవసరాల కోసమే కంపెనీ దాదాపు 300 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని బెనియోఫ్ అంచనా వేశారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
ఐటీ ఉద్యోగులకు డెల్ సీఐఓ వార్నింగ్
లేఆఫ్స్ బెడదతో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగులను డెల్ సీఐఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెట్ బస్క్ అయ్యర్ హెచ్చరించారు. ప్రస్తుతం నడుస్తున్న టెక్నాలజీలను ఎప్పడికప్పుడూ తెలుసుకుంటూ ఉండాలని, మీకు మీరుగా రీస్కిల్ అవుతూ ఉండాలని చెప్పారు. లేనిపక్షంలో ఐటీ ఉద్యోగాన్ని వీడి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు. తమ ఐటీ ఉద్యోగులందరూ లేఆఫ్స్ బెడద ప్రమాదం బారిని పడకుండా.. రెవెన్యూలను ఆర్జించడానికి ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దబడారని భరోసా వ్యక్తంచేశారు. రాబోతున్న స్కిల్స్‌ను నేర్చుకోవాల్సిన బాధ్యత ఉద్యోగుల్లోనే ఉందని, అది ఆర్గనైజేషన్‌కు సంబంధించింది కాదంటూ అయ్యర్ పేర్కొన్నారు. ఏ ఆర్గనైజేషన్ కూడా రీస్కిలింగ్ అందించదని, ఎందుకంటే ఉద్యోగులకు ఏం శిక్షణ ఇవ్వాలో వారికే తెలియదని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఐటీ ఉద్యోగులు తమ భవిష్యత్తును అంచనావేసుకుని, దానికి అనుగుణంగా ఎప్పడికప్పుడూ తమ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. కొత్త టెక్నాలజీలను టెకీలు వాడుతూ, వాటిని తెలుసుకుని ఉండాలని తెలిపారు. ప్రస్తుతం కొత్త టెక్నాలజీలు ఐటీ కంపెనీల స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. ఆటోమేషన్ పెరిగిపోవడం, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారానే కంపెనీలు రెవెన్యూలను ఆర్జిస్తున్నాయి. సంప్రదాయ ఐటీ కంపెనీల్లో ఉన్న సాఫ్ట్వేర్ సర్వీసెస్, మైంటెనెన్స్లలో తక్కువ వ్యాపారం కొనసాగుతోంది. దీంతో కొత్త టెక్నాలజీలకు కచ్చితంగా రీస్కిలింగ్ అవసరం పడుతుందని, ఒకవేళ రీస్కిల్ చేసుకోలేని ఉద్యోగులు కచ్చితంగా ఉద్వాసనకు గురవుతారని డెల్ సీఐఓ అయ్యర్ హెచ్చరించారు.


