breaking news
research development
-
రూ.లక్ష కోట్లతో పరిశోధనాభివృద్ధి పథకం
న్యూఢిల్లీ: దేశ ప్రగతిరథ వేగం పెరిగేందుకు నూతన ఆవిష్కరణలు ఎంతగానో దోహదపడతాయని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశోధనాభివృద్ధిలో ప్రైవేట్‌రంగ పెట్టుబడులే లక్ష్యంగా ఏకంగా రూ.1 లక్ష కోట్ల మూల నిధితో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) పథకానికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోద ముద్ర వేసింది. దేశ ఆర్థిక భద్రత, వ్యూహాత్మక అవసరాలు, మరింత స్వావలంభన ధ్యేయంగా పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి విస్తృత స్తాయిలో నిధుల కేటాయింపునకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. ఈ వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మీడియాతో చెప్పారు.ఆర్డీఐ రంగంలో ప్రైవేట్ సంస్థలకు తక్కువ వడ్డీకి లేదా వడ్డీరహిత రుణాలను మంజూరుచేయడం, రీఫైనాన్సింగ్ సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. రుణాలు పొందడంలో ప్రైవేట్ సంస్థలు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలను తొలగిస్తూ వ్యూహాత్మక రంగాల్లో నూతన ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలను జోడించడం, పోటీతత్వాన్ని పెంచేలా పథకాన్ని రూపొందించామని మంత్రి చెప్పా రు. కీలక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేలా చేపట్టబోయే నూతన ప్రాజెక్టులకు సాయ పడటం, అవసరమైన అధునాతన సాంకేతికత అందిపుచ్చుకోవడంలో దోహదపడటం, అందుకు కావాల్సిన రుణాల మంజూరు వేగవంతం చేయడం వంటివి ఈ పథకంలో కీలకమైన అంశాలని మంత్రి వివరించారు.ఆర్డీఐ పథకం అమలు, తీరు తెన్నులు, సమీక్ష బాధ్య తలను ప్రధాని మోదీ నేతృత్వంలోని అనుసంధాన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్ (ఏఎన్ ఆర్ఎఫ్) పాలక మండలి తీసుకుంటుంది. ఈ పథకం మార్గదర్శకాలు, రంగాల వారీగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ఆయా ప్రాజెక్టులకు ఫండ్ మేనేజర్లుగా ఏఏ సంస్థలు వ్యవహరిస్తాయనే అంశాలపై కేబినెట్ కార్యదర్శి సారథ్యంలోని భిన్న మంత్రిత్వశాఖ కార్యదర్శుల బృందం నిర్ణయాలు తీసు కుంటుంది. ఈ పథకానికి నోడల్ విభాగంగా శాస్త్ర, సాంకేతిక శాఖ వ్యవహరిస్తుంది.ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి రూ.1 లక్ష కోట్లుఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి రూ.1.07 లక్షల కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భవిష్యనిధి సంస్థ అయిన ఈపీఎఫ్ఓ సారథ్యంలో కొనసాగే సామాజిక భద్రతా స్కీమ్‌ల ద్వారా వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.1.07 లక్షల కోట్లతో పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. తొలిసారిగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు రెండు విడతల్లో గరిష్టంగా రూ.15,000 వరకు అదనపు భత్యం ఇస్తారు. వీళ్లకు రెండేళ్లపాటు సంస్థ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మరోవైపు, తమిళనాడులో 87వ నంబర్ జాతీయ రహదారిలో భాగంగా పరమ కుడి– రామనాథపురం మధ్యలో నాలుగు వరసల రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర కేబినెట్ రూ.1,853 కోట్లు కేటాయించింది. ఈ మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో 46.7 కిలోమీటర్ల పొడవునా రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. -
400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యానికి చేరువ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) 400 బిలియన్ డాలర్ల తన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించనుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మార్చి 14వ తేదీ నాటికి భారత్ ఎగుమతుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు. ఆటో విడిభాగాల పరిశ్రమ మొట్టమొదటిసారి 600 మిలియన్ డాలర్ల మిగులు రికార్డును సాధించినట్లు వెల్లడించారు. ఆటో తయారీదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, దిగుమతుల ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆటోమోటివ్ కాంపోనెంట్ రంగానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో కోరారు. అలాగే పరిశోధనా అభివృద్దిపై (ఆర్అండ్డీ) దృష్టి సారించాలని ఈ రంగానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి ఇందుకు సంబంధించి ఈ–మొబిలిటీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలి... కాగా, స్థానికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ట్యాగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దిశలో ప్రభుత్వం కొన్ని కొత్త ఉత్పత్తులను, వాటిని ఎగుమతి చేయాల్సిన దేశాలను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో జీఐ ట్యాగ్ ఉన్న పలు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, ఆయా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో ‘ఉత్సుకత’ ఉన్న కొనుగోలుదారులను చేరలేకపోతున్నాయని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) ద్వారా ప్రభుత్వం పలు చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించింది. జీఐ ఉత్పత్తులంటే... జీఐ ట్యాగ్ ఉత్పత్తుల్లో తిరుపతి లడ్డూసహా కాలా నమక్ బియ్యం, నాగా మిర్చా, బెంగళూరు రోజ్ ఆనియన్, షాహి లిచ్చి, భలియా గోధుమలు, దహ ను ఘోల్వాడ్ సపోటా, జల్గావ్ అరటి, వజ కులం పైనాపిల్, మరయూర్ బెల్లం, డార్జిలింగ్ టీ, బాస్మ తీ రైస్. మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీ, బ్లూ పాటరీ ఆఫ్ జైపూర్, బనారసి చీర వంటివి ఉన్నాయి. ఇప్ప టివరకు 417 నమోదిత జీఐ ఉత్పత్తులు ఉన్నాయి. అందులో దాదాపు 150 వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు. 2021లో జీఐ ఉత్పత్తులు భారీగా ఎగుమతులు జరిగిన విభాగాలను పరిశీలిస్తే.. నాగాలాండ్ నుండి బ్రిటన్‌కు నాగా మిర్చా (కింగ్ చిల్లీ) ఒకటి. మణిపూర్, అస్సాం నుండి బ్రిటన్‌కు బ్లాక్‌రైస్ ఎగుమతులు జరిగాయి. అస్సాం నుంచి బ్రిటన్, ఇటలీలకు నిమ్మకాయల ఎగుమతులు జరిగాయి. జీఐ అనేది నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులపై వినియోగించే ఒక బ్రాండ్ సంకేతం. ఆ మూలం కారణంగా ఉన్న నిర్దిష్ట లక్షణాలను లేదా ఖ్యాతిని సంబంధిత ఉత్పత్తి కలిగి ఉంటుంది. అటువంటి పేరు ప్రఖ్యాతలు ఉత్పత్తి నాణ్యత, విశిష్టతలకు సంబంధించిన హామీని వినియోగదారులకు అందిస్తుంది. -
22 ఏళ్లు..రూ.1.2 కోట్ల వేతనం!
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ–బి)లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదువుతున్న ఆదిత్య పలివాల్(22) సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో ఏడాదికి రూ.1.2 కోట్ల భారీ వేతనంతో కొలువు సాధించాడు. గూగుల్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పరీక్షలో ఆరువేల మంది పాల్గొనగా 50 మంది ఎంపికయ్యారు. వారిలో ఆదిత్య ఒకడు. ఈ నెల 16న న్యూయార్క్‌లో గూగుల్ కృత్రిమ మేథ, పరిశోధనా విభాగంలో ఉద్యోగంలో చేరనున్నాడు. -
ప్రాచీన సాహిత్యంపై పరిశోధనలు పెరగాలి
యూనివర్సిటీక్యాంపస్: ప్రాచీన సాహిత్యంపై పరిశోధనలు పెరగాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయిని పేర్కొన్నారు. ఎస్వీయూలోని తెలుగు అధ్యయనశాఖలో శనివారం జరిగిన ధర్మనిధి ఉపన్యాసంలో ఆమె ప్రసంగించారు. ‘ప్రాచీన సాహిత్యం – స్త్రీ వాద దృక్పథం’ అనే అంశంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. తెలుగు సాహిత్యంలో పురుషకవులే గుర్తింపు పొందారని చెప్పారు. కొంతమంది మాత్రమే స్త్రీ రచయితలు గుర్తింపు పొందారన్నారు. సాహిత్యంలో స్త్రీల సంఖ్య పెరగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో వీసీ దామోదరం, తెలుగువిభాగాధిపతి మునిరత్నమ్మ, అధ్యాపకులు జె. మునిరత్నం,పేటాశ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.