breaking news
raman lamba
-
మైదానంలోనే ప్రాణాలు విడిచిన భారత క్రికెటర్.. ఆయన గురించి తెలుసా?
క్రికెట్ మైదానంలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటనలలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఒకటి. 2014లో దేశవాళీ టోర్నీ ఆడుతున్న 25 ఏళ్ల హ్యూస్... పేసర్ సీన్ అబాట్ బౌన్సర్‌కు బలయ్యాడు. బుల్లెట్లా దూసుకొచ్చిన బౌన్సర్ అంతే వేగంతో తల వెనుకవైపు బలంగా తాకింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన హ్యూస్.. మూడు రోజుల తర్వాత అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే ఓ భారత క్రికెటర్ కూడా మైదానంలో బంతి తగిలి ప్రాణాలు విడిచారన్న విషయం మీకు తెలుసా? భారత ప్లేయర్ రమన్ లాంబా సైతం మైదానంలో క్రికెట్ ఆడుతూ మరణించాడు.లాంబాకు ఏమైంది?ఫిబ్రవరి 23, 1998న భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వయస్సులో టీమిండియా కీలక ఆటగాడు రామన్ లాంబా ప్రాణాలు విడిచారు. 1998లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్ యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.అప్పటిలో చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్లో ఆడేవారు. ఈ క్రమంలో ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్‌లో అబహానీ క్రిరా చక్రకు ప్రాతినిధ్యం వహించిన లాంబా.. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అకాల మరణం చెందారు. రామన్ లాంబా సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ప్రత్యర్ధి జట్టు బ్యాటర్ మెహ్రబ్ హుస్సేన్ భారీ షాట్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి బలంగా సిల్లీ పాయింట్లో ఉన్న లాంబాకు తాకి వికెట్ కీపర్ వైపు వెళ్లింది. అయితే బంతి తాకిన వెంటనే గాయం అంత తీవ్రమైనదిగా అన్పించలేదు. అతడు ఫీల్డ్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంతరంగా గాయం కావడంతో అతడు కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే అతడిని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకువెళ్లి దగ్గరలో ఉన్న అస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పలు పరీక్షలు తర్వాత బంతి తలకు బలంగా తాకడంతో మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు. అస్పత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత లాంబా తుది శ్వాస విడిచారు. లాంబా భారత తరుపున 4 టెస్టులు, 32 వన్డేలు ఆడారు. మొత్తంగా ఆయన పేరిట 885 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి.దేశవాళీ క్రికెట్లో అదుర్స్..ఫస్ట్ క్లాస్ క్రికెట్లో లాంబాకు అద్బుతమైన రికార్డు ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించిన రమన్ లాంబా 1996-97 రంజీ సీజన్లో పరుగుల వరద పారించాడు. మొత్తంగా 87 మ్యాచ్‌లాడి 53.91 యావరేజితో 6362 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: Asia Cup 2025: భారత స్టార్ ప్లేయర్‌కు ఊహించని షాక్.. శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్..! -
క్రికెటే ప్రాణం అనుకున్నాడు!
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు క్రికెటే శ్వాస. క్రికెటే ప్రాణం అనుకున్నాడు. క్రికెట్ తోడిదే జీవితం అనుకున్నాడు. చివరకు మరణంలోనూ క్రికెట్‌నే శ్వాసించాడు. మైదానంలో అడుగు పెట్టే ప్రొఫెషనల్ ఆటగాళ్లందరికీ ఆటే జీవితకాలపు సహచరి. అందుకే పాతికేళ్ల వయసులోనే ప్రపంచం గర్వపడేస్థాయి ఆటగాడయ్యాడు. మొదటి టెస్టులోనే రాణించి సెహభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాతి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాది వహ్వా అనిపించుకున్నాడు. అగ్రశ్రేణి క్రికెటర్లంతా ఎవడీ కుర్రాడు అని అబ్బుర పడేలా ఆటలో లీనమైపోయాడు. రెండు రోజుల క్రితం న్యూ సౌత్ వేల్స్ జట్టుతో షెఫిన్ షీల్డ్ మ్యాచ్‌లోనూ హ్యూస్ అదరగొట్టేలాగే ఆడాడు. 60 పై చిలుకు పరుగులు చేసి మరో సెంచరీ వైపు చూస్తున్నాడు. అంతలో న్యూ సౌత్ వేల్స్ బౌలర్ సీన్ అబాట్ విసిరిన ఓ బౌన్సర్‌ను హుక్ చేద్దామనుకున్న హ్యూస్ అంచనా తప్పింది. బంతి నేరుగా తలకు మెడకు మధ్య సున్నితమైన భాగాన్ని వేగంగా వచ్చి తాకింది. అంతే హ్యూస్ కుప్ప కూలిపోయాడు. వెంటనే హెలికాప్టర్‌పై హ్యూస్‌ను సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌కు తరలించారు. తలకు సర్జరీ చేయాలని వైద్యులు తేల్చారు. హ్యూస్ అప్పటికే కోమాలోకి వెళ్లిపోయాడు. చికిత్స పొందుతూ హ్యూస్ ఈ రోజు తుది శ్వాస విడిచాడు. కెరీర్లో ఇప్పటి వరకు 26 టెస్టులు ఆడిన హ్యూస్ వచ్చే నెల 4 నుంచి ఆరంభం కానున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మొదటి టెస్ట్‌కు ఆసీస్ జట్టులో స్థానం పొందాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. హ్యూస్కు గాయం అయ్యిందని తెలియగానే ప్రపంచ క్రీడా ప్రముఖులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. హ్యూస్ త్వరగా కోలుకోవాలని బ్రియన్ లారా వంటి దిగ్గజాలంతా ప్రార్ధించారు. క్రికెట్ ఆస్ట్రేలియా అంతా హ్యూస్ కోలుకోవాలని ప్రార్ధనలు చేసింది. అందరి ఆకాంక్షలు, ప్రార్ధనలూ ఫలించి హ్యూస్ ప్రాణం పోసుకుని లేచి వస్తాడని అందరూ కలలు కన్నారు. కానీ చివరి బంతి వరకూ క్రమశిక్షణతో ఆడే అలవాటున్న హ్యూస్, ఆసుపత్రిలోనే చివరి శ్వాస విడిచాడు. గతంలో భారత బ్యాట్స్ మన్ రామన్ లంబా కూడా ఇలాగే క్రికెట్ మైదానంలోనే తలకు గాయమై ప్రాణాలు విడిచాడు. కాకపోతే రామన్ లంబా సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తూ తలకు గాయమై మరణించాడు. ఇపుడు హ్యూస్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. హ్యూస్, రామన్ లంబాలు తుది శ్వాస వరకు క్రికెట్‌నే ప్రేమించారు. క్రికెటే జీవితం అనుకున్నారు. క్రికెట్ అంటే అంత పిచ్చి వారికి. ఆట అంటే అంత అభిమానం వారికి. ఆ ఆటతోనే అంతిమ యాత్రకూ సిద్ధమయ్యారు. ** -
క్రికెట్ 'గాయాలు'
సిడ్నీ:క్రికెట్ లో గాయాలు కావడం సర్వసాధారణమే అయినా.. కొన్నిసందర్భాల్లో క్రికెటర్లు మృత్యువుతో సాహసం చేస్తుంటారు. నాటి నుంచి నేటి వరకూ క్రికెటర్లను 'గాయాలు' బాధిస్తూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ ను అప్పుడప్పుడూ మరణాలు షాక్ కు గురి చేస్తుంటాయి. తాజాగా ఆసీస్ క్రికెటర్ హ్యూస్ తలకు తీవ్రంగా గాయం కావడంతో మృత్యువుతో రెండు రోజులు పోరాడి అసువులు బాసాడు. గతంలో కొంతమంది క్రికెటర్లు మృతి చెందగా, మరి కొందరు క్రికెట్ తీవ్ర గాయాలతో ఆట నుంచి వైదొలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. *1959 లో అబ్దుల్ అజీజ్.. 19 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతూ బాల్ తన ఛాతికి బలంగా తగలడంతో కుప్పకూలిపోయాడు. చివరకు ఆస్పత్రిలో మరణించాడు. *1960లో వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫ్రిత్ వేసిన బౌన్సర్ భారత క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ తలకు తగలడంతో ఆరు రోజులు కోమాలు ఉన్నాడు. ఆ మ్యాచ్ అనంతరం నారీ కాంట్రాక్టర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. *1975 లో న్యూజిలాండ్ ఆటగాడు ఈవెన్ ఛాట్ ఫీల్డ్ కు ఇంగ్లండ్ పేసర్ పీటర్ లీవర్ వేసిన బంతి తగలడంతో అతనికి నాలుకకు తీవ్రగాయమైంది. అనంతరం అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. *1986లో వెస్టిండీస్ స్పీడ్ స్టార్ మైకేల్ మార్షల్ వేసిన బంతి ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్ ముక్కుకు తగిలి అతనికి తీవ్ర గాయమయ్యింది. *భారత ఆటగాడు రమణ్ లాంబా షార్ట్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఆటగాడు మెహ్రబ్ హుస్సేన్ కొట్టిన షాట్ కు కుప్పకూలిపోయాడు. మూడు రోజుల కోమాలో ఉన్న అనంతరం లాంబా మృతి చెందాడు.