breaking news
Ramadan offers
-
‘రంజాన్’తో మార్కెట్లు కిటకిట
అబిడ్స్/జియాగూడ : రంజాన్ పండుగతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రంజాన్ పండుకు ప్రత్యేకంగా కొత్త బట్టలు, రంజాన్ సామాగ్రి, హలీం తయారీ కోసం మేకల విక్రయాల జోరుతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. రంజాన్ పండుగ చేరువవుతుండటంతో మైనార్టీలు పండుగకు కావాల్సి వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రధాన మార్కెట్లకు చేరుకుని కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా జియాగూడ సబ్జిమండి, పురానపూల్, బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, బడీచౌడి, జుమ్మెరాత్‌బజార్ తదితర ప్రాంతాల్లో రంజాన్ విక్రయాలు ఊపందుకున్నాయి. రంజాన్ పండగకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు .. రంజాన్ పండుగకు మైనార్టీలు ప్రత్యేకంగా కుందన్, చెమ్కీతో తయారు చేసిన వస్త్రాలను అధికశాతం పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తారు. అలాగే ఇమిటేషన్ గోల్డ్ వస్తువులు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. రంజాన్ పండుగ రోజున అచ్చమైన ముస్లిం వస్త్రాలను ధరించి శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. రంజాన్ పండుగకు మహారాష్ట్ర, కోల్‌కతా ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం వర్క్ వస్త్రాలు హైదరాబాద్‌కు దిగుమతి అవుతాయి. మైనార్టీలు ఉండే పాత బస్తీ, కార్వాన్, సబ్జిమండి, కోఠి ప్రాంతాల్లో వీటì విక్రయాలు జోరుగా కొనసాగుతాయి. అలాగే చెమ్కీ చెప్పులు, కమ్మలు, జుమ్కాలు, లాకెట్లు, బింగియా, జడ గంటలు తదితరవి ఎక్కువ శాతం కొనుగోలు చేస్తారు. ప్రతి ఏటా వీటి విక్రయాలు లక్షల్లో ఉంటాయి. రంజాన్ వస్త్రాలను ఆరు నెలల ముందు నుంచే ఇతర రాష్ట్రాలలో తయారై నగరానికి చేరుకుంటాయి. వస్త్రాలలో కుందన్స్ డిజైన్లకు గాగ్రా, చుడీదార్, అనార్కలీ, సారీలు తదితరవి అధిక శాతం కొనుగోలు చేస్తారు. వీటి ధరలు రూ. 1500 నుంచి రూ. 10,000 వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉంటాయి. మేక మాంసానికి గిరాకీ.. రంజాన్ సీజన్లో హలీం తయారీకి మేకల మాంసం అవసరం. వీటి విక్రయాలు కూడా జియాగూడ మేకల మండి, పురానాపూల్, రింగ్ రోడ్, మొఘల్ఖనాలా, అత్తాపూర్ హై వే రోడ్డు, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో మేకలను విక్రయిస్తుంటారు. మండిల్లో మేకల విక్రయాలు హలీం తయారీ కోసం జోరుగా కొనసాగుతున్నాయి. హలీం తయారీకి వాడే మేకలు ఝాన్సీ, మహారాష్ట్రాల నుంచి అధిక శాతం మండిలకు దిగుమతి అవుతున్నాయి. దీంతో గొర్రె మేకల ధరలు కూడా సాధారణ రోజుల కంటే ధరలు పెరిగాయి. నాణ్యతకు మారుపేరు.. జియాగూడ మేకల మండి జాతీయ స్థాయిలో నెం.1 మార్కెట్‌గా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మాంసం హలీం తయారీ నిమిత్తం నగరంలోని అన్ని హోటళ్లకు సప్లయి చేస్తున్నాం. మండీని ఆధునీకరించినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. – జమాల్పూర్ బందూలాల్, జియాగూడ స్లాటర్ హౌస్ వెల్పేర్ ఫెడరేషన్ చైర్మన్ -
జోస్ ఆలుక్కాస్ రంజాన్ ఆఫర్లు
ప్రతి కొనుగోలుపై బహుమతి హైదరాబాద్: ప్రముఖ జ్యూయలరీ చెయిన్, జోస్ ఆలుక్కాస్ రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. తమ షోరూమ్‌ల్లో ప్రత్యేక లైట్ వెయిట్ బంగారు, వజ్రాభరణాలు లభిస్తాయని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ సందర్భంగా ప్రతి కొనుగోలుపై బహుమతులు ఇస్తున్నామని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫై చేసిన వజ్రాభరణాల కలెక్షన్ రూ.4,000 నుంచే లభిస్తాయని, రంజాన్ ప్రత్యేక డైమండ్ నెక్లెస్ రూ.1,25,000కు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు తమ పాత బంగారాన్ని సరికొత్త డిజైన్లకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని వివరించారు.