ముంబై ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ
ముంబై ఇండియన్స్ జట్టుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గెలవడం ద్వారా సీజన్లో నాలుగో విజయాన్ని నమోదు చేయగలిగింది.ఇక ఈ సీజన్లో ముంబైకి ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మిగిలిన మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులోకి వచ్చే అంశంపై స్పష్టత లేదు.డికాక్ దూరంఇలాంటి తరుణంలో ముంబై ఇండియన్స్ మరో ఇద్దరు ఆటగాళ్ల సేవలు కోల్పోయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి ఎడమచేతి మణికట్టుకు గాయమైనట్లు ముంబై యాజమాన్యం ధ్రువీకరించింది.కాగా కేవలం రూ. కోటికి ముంబై ఇండియన్స్ డికాక్‌ను దక్కించుకుంది. ఓపెనర్‌గా మూడు ఇన్నింగ్స్‌లోనే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 132 పరుగులతో రాణించాడు. మిగిలిన మ్యాచ్‌లలోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోకుండా ముంబై పోరాడుతున్న సమయంలో అతడు జట్టుకు దూరం కావడం ప్రభావం చూపే అవకాశం ఉంది.అతడు కూడా అవుట్ఇప్పటికే గాయం నుంచి తిరిగి వచ్చి రోహిత్ శర్మ జట్టుతో చేరినప్పటికీ పంజాబ్‌తో మ్యాచ్‌లో తేలిపోయాడు. డికాక్ సంగతి ఇలా ఉంటే.. ముంబై యువ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బవా కూడా సీజన్ మొత్తానికి దూరమైనట్లు ముంబై పేర్కొంది.గత మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో పోరులో బవా కుడిచేతి బొటనవేలికి గాయమైంది. ఆల్‌రౌండర్‌గా అతడి సేవలు ఉపయోగించుకోవాలని భావించిన ముంబైకి నిరాశే మిగిలింది.ఇదిలా ఉంటే.. డికాక్, బవా గాయాలపై ముంబై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘క్వింటన్, రాజ్ బవా.. వారి వారి ఇళ్లలో విశ్రాంతి పొందుతున్నారు. ముంబై ఇండియన్స్ వైద్య బృందం వారికి మద్దతుగా నిలుస్తుంది. ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తుంది’’ అని ముంబై తన ప్రకటనలో పేర్కొంది. కాగా ముంబై తమ మిగిలిన మ్యాచ్‌లలో మే 20న కోల్‌కతాతో.. మే 24న రాజస్తాన్‌తో తలపడనుంది.చదవండి: సంజూను అసభ్యంగా దూషించిన క్లాసెన్!.. వీడియో వైరల్