breaking news
Raipur Aims
-
మీ పిల్లలు ఎంత డేంజర్లో ఉన్నారో తెలుసా?
సెల్‌ఫోన్‌ను ఒకరోజులో ఎంతసేపు చూస్తున్నాం? అనే విషయాన్ని ఎప్పుడైనా పరిశీలించారా? ఊహూ.. అంత పట్టింపు ఎక్కడిది అంటారా?. పోనీ మరి మీ పిల్లలు?.. అరగంట?.. గంటా..?.. అంత గమనించడం లేదని అంటారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి. అప్పుడు మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో.. అందులోంచి ఎలా బయటపడేయాలో తెలుస్తుంది!.ఎయిమ్స్ రాయ్‌పూర్ పరిశోధకులు ఈ మధ్య మెటా అనాలసిస్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను ఎంచుకుని.. వాళ్లు ఫోన్లను ఏయే టైంలో.. ఎంతెంత సేపు వాడుతున్నారు(పేరెంట్స్ సమక్షంలోనే) అనే పదిరకాల అధ్యయాలు జరిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు క్యూరస్(Cureus) అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. అందులో మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లలు రోజులో దాదాపు రెండున్నర గంటలపాటు(2గం. 22నిమిషాలు) సెల్‌ఫోన్‌తో గడిపేస్తున్నారని తేలింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్(IAP) సూచిస్తున్న సమయం కంటే ఇది రెట్టింపు. మరో భయంకరమైన విషయం ఏంటంటే.. రెండేళ్లలోపు చిన్నారులు రోజులో గంటన్నరపాటు ఫోన్లకు అతుక్కుపోతున్నారట. అసలే ఈ వయసు వాళ్లను ఫోన్లకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తుండడం గమనార్హం. తాజా అధ్యయన నివేదికపై ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వైద్యనిపుణుడు స్పందిస్తూ.. పిల్లల్లో 60-70 శాతం సూచించిన సమయం కంటే ఎక్కువ ఫోన్‌పై గడుపుతున్నారు. ఇది వాళ్లపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం చూపెడుతుంది అని అన్నారు. చాలామంది పేరెంట్స్.. కాసేపేగా చూడనిస్తే ఏమైద్దిలే అనుకుంటారు. కానీ, వాళ్లు బిజీ లైఫ్‌లో సెల్ఫోన్లకు అతుక్కుపోయి నెమ్మదిగా వాళ్ల పిల్లలకు ఆ అలవాటు చేస్తున్నారు. .. తినే టైంలోనో.. తమ పనుల్లో మునిగిపోయి పిల్లలను బుజ్జగించేందుకు చేతుల్లో పెడుతున్నారు. కేవలం స్మార్ట్ ఫోన్లతోనే ఆగిపోకుండా డిజిటల్ గాడ్జెట్లను(ట్యాబ్, పీసీ, స్మార్ట్ టీవీలు) అలవాటు చేస్తున్నారు. ఈ అలవాట్ల వల్ల మాటలు ఆలస్యం కావడం, చూపులో సమస్యలు, ప్రవర్తనలో ఎదుగుదల లేకపోవడం, ఒబెసిటీ సమస్య, నిద్రలేమి, విషయాలపై దృష్టి సారించలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి అని తెలిపారాయన.అయితే ఇది తీవ్రంగా చర్చించదగ్గ అంశమే అయినా.. పరిష్కారం మాత్రం పేరెంట్స్ చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ముందు తల్లిదండ్రులు ఫోన్లో అధిక సమయం గడపడం ఆపాలని సూచిస్తున్నారు. టెక్ ఫ్రీ జోన్.. తినేటప్పుడు, ఆడుకునేటప్పుడు.. వాళ్లకు ఫోన్లు, ఇతర గాడ్జెట్లు కనిపించకుండా చూడాలి. ఇందుకోసం బెడ్రూం లేదంటే ఇంటి పరిసరాల్లోకి తీసుకెళ్లాలి. వాళ్లతో మాట్లాడాలి.. మాట్లాడించే ప్రయత్నం చేయాలి. ఆటలు ఆడించాలి. ఏడుస్తున్నారు కదా అని ఫోన్లు చేేతులో పెట్టొద్దు. మరీ ముఖ్యంగా ఏ వయసులో ఎంతసేపు చూడొచ్చు అనే పరిమితికి కట్టుబడి ఉండాలి. అప్పుడే వాళ్లు ఆరోగ్యకరంగా పెరుగుతారు అని నిపుణులు అంటున్నారు. -
మొబైల్ ఫోన్లతో వైరస్ ముప్పు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లతో కరోనా వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని రాయపూర్‌కు చెందిన ఎయిమ్స్ వైద్యులు హెచ్చరించారు. కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో ఆసుపత్రుల్లో మొబైల్స్ ఫోన్ల వాడకంపై నియంత్రణలు విధించాలని వారు సూచించారు. ఈ అంశంపై బీఎంజే గ్లోబల్ హెల్త్ జనరల్‌లో ఒక కథనం ప్రచురితమైంది. వైరస్‌ను వ్యాప్తి చేసే సాధనాల్లో మొబైల్ ఫోన్లు ముందుంటాయని, దీనివల్ల ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకే అవకాశం ఉంటుందని ఎయిమ్స్ వైద్య బృందం హెచ్చరించింది. వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి ముఖం, నోరు, కళ్లు, చేతులు అత్యంత కీలకం. ముఖానికి అత్యంత దగ్గరగా వచ్చే వస్తువు మొబైల్ ఫోనే కావడంతో వైరస్ విస్తరణలో అత్యంత ప్రమాదకరమని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థలు మొబైల్ ఫోన్ల వాడకంపై ఎలాంటి నియంత్రణా చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది. ఆస్పత్రుల్లో సిబ్బంది అంతా ఫోన్లను వినియోగిస్తున్నా, వారిలో 10 శాతం మంది కూడా వాటిని పరిశుభ్రంగా ఉంచడం లేదని వారి పరిశీలనలో తేలిందని అన్నారు. -
ఉద్యోగాలు
పుదుచ్చేరి నిట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: ఫ్యాకల్టీ, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ విభాగాలు: ఫ్యాకల్టీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నాన్ -టీచింగ్: ఎలక్ట్రికల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 30, జూలై 1, 2, 3 వివరాలకు: www.nitpy.ac.in రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో ట్యూటర్/క్లినికల్ ఇన్స్ట్రక్టర్ రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ట్యూటర్/ క్లినికల్ ఇన్స్ట్రక్టర్ (నర్సింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది: జూలై 14 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా వివరాలకు: www.aiimsraipur.edu.in విజయనగరం జిల్లాలో 39 పోస్టులు విజయనగరం జిల్లా సెలక్షన్ కమిటీ.. వ్యవసాయశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో బహుళ ప్రయోజన విస్తరణాధికారి (ఎంపీఈఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు: 39 అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ) చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. వయసు: జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 40 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 25 వివరాలకు: www.vizianagaram.nic.in