breaking news
rain-hit
-
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని వైఎస్సార్సీపీ నాయకులను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ.. కల్లాల్లో, పొలాల్లో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని.. అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని వైఎస్ జగన్ మండిపడ్డారు.ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడిన వరి రైతులు.. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించకపోవడంతో రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు అకాల వర్షాల వల్ల మరింతగా నష్టపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. దీంతో పాటు అకాల వర్షాల వల్ల పలు ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి.. రైతులకు బాసటగా నిలవాలని, వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు. -
చెన్నైకు అయిదు కోట్ల సాయం
భువనేశ్వర్ : భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడు రాష్ట్రానికి ఒడిశా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు రాష్ట్ర మంత్రి విక్రం అరుఖ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిన్న తమిళనాడు సీఎం జయలలితతో మాట్లాడినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత ప్రజలను ఆదుకునేందుకు, సహాయ చర్యల నిమిత్తం తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా ఒడిశాకు చెందిన సుమారు లక్ష మంది చెన్నైలో స్థిరపడినట్టు తెలుస్తోంది.