breaking news
racial abuse in us
-
బిల్‌గేట్స్ చిన్న కుమార్తెపై జాతి విద్వేష కామెంట్లు.. అసభ్య వ్యాఖ్యలు
కొద్ది రోజులుగా అమెరికాలో జాతి విద్వేష వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా అపర కుబేరుడు బిల్ గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్‌ల కుమార్తె ఫోబ్ గేట్స్‌కు సైతం ఆ వేధింపులు తప్పలేదు. ఇటీవలే ఆమె సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటోను షేర్ చేయటంతో జాతి విద్వేష వేధింపులకు గురయ్యారు. ఆ తర్వాత ఆ ఫోటోను డిలీట్ చేశారు ఫోబ్ గేట్స్. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ నల్లజాతి యువకుడు తన బుగ్గపై ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేశారామె. దీంతో ఆ ఫోటోను ట్రోల్ చేస్తూ ఆమెపై జాతి విద్వేష వేధింపులకు పాల్పడ్డారు పలువురు నెటిజన్లు. ఇరువురిపై జోక్స్ పేల్చారు. 'ఈ సంబంధాన్ని అంతం చేయడానికి బిల్ గేట్స్ సరికొత్త వైరస్‌ని తయారు చేయబోతున్నారు. అసలే వాతావరణ సంక్షోభం విపరీతంగా పెరిగిపోయింది. ఈక్రమంలోనే బిల్‌గేట్స్ కుమార్తె బొగ్గును స్వీకరించేందుకు సిద్ధపడిందా' అంటూ ఓ నెటిజన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. 'బిల్‌గేట్స్ తన కుమార్తెను తిరస్కరిస్తారా లేదా ప్రేమ అంటే కేవలం ప్రేమే అనే వాస్తవాన్ని ఒప్పుకుంటారో చూడాలి. ఒక వ్యక్తి వ్యతిరేకించేవారు.. వారి కుటుంబంలోకి రావటం హాస్యాస్పదంగా ఉంది. ఫోబ్ గేట్స్ కోసం ఇది జరుగుతుందని నమ్ముతున్నా. లవ్ లవ్' అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. You think the racist, republican extremist, Grifters/conspiracy theorist hated @BillGates before …..Wait till they get a load of Phoebe Gates life choices. pic.twitter.com/HPmEZ3tN6b — Popitics (@Popitics1) July 6, 2022 ఫోబ్ గేట్స్.. 2002, సెప్టెంబర్ 14న వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో జన్మించారు. బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దంపతుల ముగ్గురు పిల్లల్లో ఆమె చిన్న కూతురు. 2021, మే 4న బిల్ గేట్స్, మిలిందాలు తమ 27 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ట్విట్టర్ వేదికగా తమ విడాకుల విషయాన్ని ఇరువురు తెలిపారు. -
అమెరికాలో సిక్కు బాలుడిపై జాతివిద్వేష వ్యాఖ్యలు
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ సిక్కు బాలుడిని అతడి స్కూలుకు చెందిన ఇతర పిల్లలు 'ఉగ్రవాది' అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలతో ఏడిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కళ్లజోడు పెట్టుకున్న హర్సుఖ్ సింగ్ అనే సిక్కు బాలుడు స్కూలు బస్సులో కూర్చుని ఉండగా, ఇతర విద్యార్థులు అతడి చుట్టూ చేరి అతడిపై వ్యాఖ్యలు మొదలుపెట్టారు. ఓ అమ్మాయి అయితే అతడిని 'ఉగ్రవాది' అంటూ అతడివైపు వేళ్లు చూపిస్తూ ఏడిపించింది. దీన్ని అతడు తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. వాళ్లంతా తనను జాతిపేరుతో వేధిస్తున్నారని కూడా అతడు కెమెరా ముందు చెప్పాడు. ఈ వీడియోను ఇప్పటికే 1.30 లక్షల మందికి పైగా చూశారు. తనలాంటి వాళ్లపట్ల ఇలా ప్రవర్తించొద్దని, తాను ముస్లింను కానని, తాను సిక్కునని కూడా హర్సుఖ్ సింగ్ చెప్పాడు. ఇటీవలే సీటెల్ ప్రాంతంలో ఓ హిందూ దేవాలయాన్ని కొంతమంది కూల్చేశారు. నాజీలు ఉపయోగించే స్వస్తిక్ గుర్తు, 'గెటవుట్' అంటూ ఎర్రటి స్ప్రే పెయింటుతో రాసిన అక్షరాలు అక్కడ కనిపించాయి.