breaking news
PVP company
-
వైవిధ్యభరితంగా గ్రహణం
గ్రహణం చిత్రానికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ నిర్మిస్తున్న తాజా చిత్రం గ్రహణం. ఈ సంస్థ ఇప్పటికే నాగార్జున, కార్తీ కలయికలో ఒక మల్టీ స్టార్ చిత్రాన్ని, ఆర్య, అనుష్క జంటగా ఇంజి ఇడుప్పలగు చిత్రంతో పాటు మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, నాల్గో చిత్రంగా గ్రహణంకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నవ దర్శకుడు ఇలన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో యువ నటుడు కృష్ణ హీరోగా, నవ నటి నందిని హీరోయిన్గా నటిస్తున్నారు. కయల్ ఫేం చంద్రన్, కరుణాస్, కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర పూజ కార్యక్రమాలు శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలోని వినాయక స్వామి ఆలయంలో జరిగాయి. చిత్ర ద ర్శకుడు ఇలన్ వివరాలు తెలుపుతూ ఇది వైవిధ్య భరిత త్రిల్లర్ కథా చిత్రంగా పేర్కొన్నారు. గ్రహణం అంటే ప్రజల్లో రక రకాల అభిప్రాయాలు ఉంటాయన్నారు. అలాంటి గ్రహణం రోజు రాత్రి జరిగిన ఓ సంఘటన ఇతి వృత్తాంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.ఏప్రిల్ 16 నుంచి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించి నిరవధికంగా ముందుకు వెళ్తామని నిర్మాతలు తెలిపారు. పూజా కార్యక్రమానికి దర్శకుడు విష్ణువర్దన్, నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజ, ఎస్ఆర్ ప్రభు, స్టూడియో-9 సురేష్, ధనంజయన్, సీవీ కుమార్, టి.శివ విచ్చేసి యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఓ శుభవార్త!
‘‘మీతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. కాకపోతే 24 గంటల తర్వాతే’’ అంటూ శ్రుతీహాసన్ ట్విట్టర్లో ఊరించారు. ఇది చదివినవాళ్లల్లో కొంతమంది శ్రుతి చెప్పనున్న ఆ శుభవార్త తన పెళ్లికి సంబంధించినది కావచ్చని కొందరు ఊహించేసుకున్నారు. కానీ, ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను’ అన్నారు కాబట్టి, పెళ్లికి సంబంధించిన వార్త అయ్యుండక పోవచ్చని కూడా భావించారు. వాస్తవానికి శ్రుతి చెప్పాలనుకున్న వార్త ఓ చిత్రానికి సంబంధించింది. నాగార్జున, కార్తీ కాంబినేషన్లో పీవీపీ సంస్థ ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ను కథానాయికగా తీసుకున్నారు. దీని గురించే శ్రుతి ప్రత్యేకంగా ప్రకటించాలనుకున్నారు. ఈ కథ విన్నాననీ, కొత్తగా ఉండటంతోపాటు హృదయానికి హత్తుకునే విధంగా ఉందని ఆమె తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళాల్లో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించనున్నారు.