అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాల ట్రిప్‌కి వెళ్లొద్దాం ఇలా..!
మే నెల 15వ తేదీ నుంచి సరస్వతి నదికి పుష్కరాలు. పుణ్యస్నానానికి ముందు ఏమైనా చూడగలిగితే బావుణ్ను.పుష్కరస్నానానికి ముందు ఐఆర్సీటీసీ వీటన్నింటినీ చూపిస్తోంది. పురి... బీచ్‌లో పట్నాయక్ సైకత శిల్పాలు... ఆలయంలో జగన్నాథుడు.కోణార్క్... బోద్‌గయ... సారనాథ్ ఈ టూర్లో చూసే వరల్డ్ హెరిటేజ్ సైట్లు. కాశీ విశ్వనాథుడు... విశాలాక్షి... అన్నపూర్ణలు గంగాసరయుల్లో హారతులు. అయోధ్య బాలరాముడు... హనుమంతుడు... కైక బహుమతి కనక్‌భవన్. ఈ ప్రయాణంలో... తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒడిశాకి వెళ్తాం. నాలుగో రోజుకు బీహార్‌లో అడుగుపెడతాం. ఐదవ రోజు ఉత్తరప్రదేశ్‌కి చేరుతాం. ఎనిమిదవ రోజు త్రివేణి సంగమంలో అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కరస్నానం. మొదటి రోజు..ఈ రైలు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌లో మొదలై బోన్గిర్, జన్‌గాన్, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ టూర్ ప్యాకేజ్‌లో పర్యాటకులు తమకు అనువైన స్టేషన్లో రైలెక్కవచ్చు. అలాగే దిగేటప్పుడు కూడా తమకు అనువైన స్టేషన్లో దిగవచ్చు. ఏ స్టేషన్లో రైలెక్కి, ఏ స్టేషన్లో దిగినా ప్యాకేజ్ ధరల్లో మార్పు ఉండదు.రెండోరోజుఉదయం తొమ్మిది గంటలకు పురి పట్టణం సమీపంలోని మల్తీపత్‌పూర్ స్టేషన్‌కి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన పూరీకి వెళ్లాలి. హోటల్లో చెక్ ఇన్ అయి రిఫ్రెష్మెంట్, లంచ్ తర్వాత జగన్నాథ ఆలయం దర్శనం. రాత్రి బస పూరీలో. ఇది పూరీ కాదు... పురి, అంటే పురం, జగన్నాథపురం అనే ఉద్దేశంలో జగన్నాతపురిగా వ్యవహారంలోకి వచ్చిన పేరు ఇది. ఇస్లాం దాడుల్లో 18 సార్లు ధ్వంసమైన ఆలయం ఇది. గజపతుల రాజ్యం. రాజ్యాలు, రాజరికాలు ΄ోయినప్పటికీ గజపతుల రాజవంశీయులు ఇప్పటికీ ఆలయంలో సంప్రదాయ క్రతువులను నిర్వహిస్తోంది. పురి అనగానే జగన్నాథుడితోపాటు గుర్తు వచ్చే మరో పేరు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుదర్శన్ పట్నాయక్. పురి బీచ్‌లో పట్నాయక్ చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలను చూడాలి. గోల్డెన్ బీచ్, చంద్రభాగ బీచ్‌లు అందంగా ఉంటాయి. మూడోరోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కోణార్క్‌కు ప్రయాణం. ఆలయ వీక్షణం తరవాత మల్తీపత్‌పూర్ స్టేషన్‌కి చేరి రైలెక్కాలి. రైలు భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఆద్రా మీదుగా గయకు సాగిపోతుంది. చేతిలో పది రూపాయల నోటుుంటే... కోణార్క్ సూర్యదేవాలయాన్ని ఒకసారి చూసుకోండి. అసలైన సూర్యదేవాలయాన్ని ఆ తర్వాత చూడండి. కళింగ ఆర్కిటెక్చర్లో ఉన్న కదలని రథం యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ ఆలయం వంద అడుగుల ఎత్తున్న రథం ఆకారంలో ఉంటుంది. 13వ శతాబ్దంలో తూర్పు కళింగ గంగరాజు మొదటి నరసింగదేవ కట్టిన దేవాలయం ఇది. యూరప్ నుంచి వచ్చే నావికులు ఈ ఆలయాన్ని బ్లాక్ పగోడా అన్నారు. పురిలోని జగన్నాథ ఆలయాన్ని వైట్ పగోడా అన్నారు. బంగాళాఖాతంలో ప్రయాణిస్తున్న నౌకలకు ఈ ఆలయ శిఖరాలు పెద్ద ల్యాండ్‌మార్క్‌లు. నాల్గోరోజుఉదయం తొమ్మిదిన్నరకు గయకు చేరుతుంది. రైలు దిగి బో«ద్గయకు వెళ్లి హోటల్ గదికి వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత విష్ణుపాద ఆలయదర్శనం. రాత్రి బస బోద్ గయలోనే. బోద్‌గయ కూడా యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది బౌద్ధులకు పవిత్రమైన క్షేత్రం. బుద్ధుడిని హిందూ దశావతారాల్లో భాగంగా గౌరవించడంతో హిందువులకు కూడా ఈ ప్రదేశం గొప్ప యాత్రాస్థలమైంది. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిందని చెప్పే ప్రదేశం ఇది. గయకు సమీపంలో (15 కి.మీలు) ఉండడంతో బుద్ధగయ, బో«ద్గయగా వ్యవహారంలోకి వచ్చింది. విష్ణుపాద ఆలయం గయలో ఉంది. ఈ ఆలయంలో 40 సెంటీమీటర్ల పొడవుగా ఒక అడుగు ఉంటుంది. దాని చుట్టూ షట్భుజి ఆకారంలో పాలరాతి నిర్మాణం ఉంటుంది. దాని చుట్టూ కూర్చుని పాదానికి పూజలు చేస్తారు. ఇక్కడ పూజారుల దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త పడాలి. భక్తులను దబాయిస్తుంటారు. నిర్వహణ సరిగ్గా ఉండదు, పరిశుభ్రత తక్కువ. పూజారులు తొలిచూపులోనే ఉత్తరాది– దక్షిణాది మనుషులను గుర్తించగలుగుతారు. దక్షిణాది వారి పట్ల వివక్ష స్పష్టంగా వారి కళ్లలో కనిపిస్తుంది. ఆలయ గోపురం నిర్మాణ కౌశలాన్ని ఆస్వాదించడానికి ప్రశాంతంగా సమయం కేటాయించాలి. ఐదోరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎనిమిది గంటలకు గయ స్టేషన్‌కు చేరి రైలెక్కాలి. రైలు మధ్యాహ్నం ఒంటిగంటకు వారణాసికి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన సారనాథ్‌కు వెళ్లాలి. రాత్రి బస అక్కడే. సారనాథ్... ఇది బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత ఐదుగురు శిష్యులకు తొలి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం. ఇక్కడి స్థూపాన్ని థమేక్ స్థూప అంటారు. ఇది కూడా యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. మన అధికారిక చిహ్నం అశోకుడి ధర్మచక్రం కూడా ఉంది. టిబెట్ బౌద్ధులు కట్టిన బౌద్ధమఠం కూడా ఉంది. ప్రశాంతంగా చూడాల్సిన ప్రదేశం ఇది. ఆరోరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాశీ (వారణాసి)కి ప్రయాణం. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాల దర్శనం. సాయంత్రం గంగా హారతి తర్వాత రాత్రి బస వారణాసిలో. వారణాసిలో అడుగు పెట్టక ముందే మనోఫలకం మీద విశ్వనాథుడి రూపం మెదలుతుంది. కాశీ లైవ్ దర్శనం పేరుతో వెలువడిన వీడియోలను మన మైండ్ రీమైండ్ చేసుకుంటుంది. కొత్తగా కట్టిన ఆలయం నిర్మాణపరంగా ఒక అద్భుతం. విశ్వనాథుడి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నప్పుడు పరిశీలనగా ఆలయ ప్రాంగణమంతా పరికించి చూస్తే ఇనుప కంచె వేసిన తెల్లటి నిర్మాణం కనిపిస్తుంది. అదే అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తున్న జ్ఞానవాపి. అక్కడి నంది విగ్రహం విశ్వనాథ ఆలయంలోని శివలింగానికి అభిముఖంగా ఉంటుంది. ఆ తర్వాత విశాలాక్షి, అన్నపూర్ణ, వారాహి, కాలభైరవ ఆలయాలను దర్శించుకుని గంగానదిలో పడవ విహారం చేయాలి. మణికర్ణికా ఘాట్, దశాశ్వమేథ ఘాట్ల వంటి అనేక ఘాట్లను సందర్శించి, గంగాహారతిని చూస్తే కాశీయాత్ర పరిపూర్ణమవుతుంది. ఇక్కడ ఉదయం పూట తాజా మీగడలో చక్కెర వేసి అమ్ముతారు. చాలా రుచిగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత బనారస్ కిళ్లీ వేసుకుని బనారస్ చీరలు, చుడీదార్లు కొనుక్కుంటే మనసు సంతృప్తి చెందుతుంది. సారనాథ్‌లో టైమ్ దొరికితే దుస్తుల షాపింగ్ అక్కడే చేయవచ్చు. సారనాథ్‌లో వీవర్స్ సొసైటీ మగ్గాలు, ప్రభుత్వ ఆథరైజ్డ్ దుకాణాలున్నాయి. ఏడోరోజుఉదయం వారణాసిలో గది చెక్ అవుట్ చేసి ఏడు గంటలకు రైలెక్కాలి. అయోధ్యకు ప్రయాణం. మధ్యాహ్నం 12.30కు అయోధ్యధామ్ స్టేషన్‌కు చేరుతుంది. రామజన్మభూమి, హనుమాన్‌గరి దర్శనం తర్వాత సాయంత్రం సరయు నదిలో హారతిని వీక్షణం. రాత్రి భోజనం తర్వాత అయోధ్యధామ్ స్టేషన్‌కు చేరి రైలెక్కాలి. ప్రయాణం ప్రయాగ్‌రాజ్‌కి సాగుతుంది.గంగా తీరం నుంచి సరయు తీరానికి చేరి అయోధ్యలో అడుగుపెట్టినప్పటి నుంచి బాల రాముడి రూపం త్వరగా రమ్మని పిలుస్తూ ఉంటుంది. విశాలమైన బాలరాముడి ఆలయాన్ని చూసిన తరవాత అయోధ్యలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం హనుమాన్ గరి, ఆ తర్వాత కనక్ భవన్. సీతారాములకు వారి వివాహ సందర్భంగా కైకేయి ఇచ్చిన బహుమతిగా చెబుతారు. అయోధ్యలో నాగేశ్వరనాథ్ఆలయాన్ని రాముడి కుమారుడు కుశుడు నిర్మించాడని చెబుతారు. సరయు నదిలో హారతి కూడా గంగాహారతిని తలపిస్తూ కనువిందు చేస్తుంది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటుతాయి.ఎనిమిదో రోజుతెల్లవారు జామున 4.30 గంటలకు రైలు ప్రయాగసంగమం రైల్వేస్టేషన్‌కి చేరుతుంది. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరిండం ఇతర క్రతువులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం రెండు గంటలకు రైలెక్కాలి. ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) మనకు త్రివేణి సంగమస్థలిగానే గుర్తొస్తుంది. కుంభమేళా పూర్తి చేసుకుని నగరం సాధారణ స్థితికి చేరేలోపే సరస్వతి పుష్కరాల ఉత్సాహం మొదలైంది. త్రివేణి సంగమంలో గంగ, యమున నదులు స్పష్టంగా కనిపిస్తాయి. గంగ నీరు బురద మట్టి కలిసినట్లు గోధూళి వేళను తలపిస్తుంది. యమున నీరు మన కృష్ణానది నీటిలాగ కారుమేఘాన్ని తలపిస్తుంది. పడవలో నది విహారం చేస్తూ రెండు నదుల నీటిని బాటిళ్లలో నింపుకోవచ్చు. సరస్వతి నది ఇక్కడ అంతర్వాహిని కావడంతో ఆ నీటిని వర్ణించడం సాధ్యం కాదు. పుష్కరాల సమయంలో ఇక్కడ తీర్థ స్నానం చేస్తారు. పూజాదికాలు నిర్వహిస్తారు.తొమ్మిదో రోజుతెల్లవారు జామున 4.30 గంటలకు రైలు ప్రయాగసంగమం రైల్వేస్టేషన్‌కి చేరుతుంది. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరిండం ఇతర క్రతువులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం రెండు గంటలకు రైలెక్కాలి. ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) మనకు త్రివేణి సంగమస్థలిగానే గుర్తొస్తుంది. కుంభమేళా పూర్తి చేసుకుని నగరం సాధారణ స్థితికి చేరేలోపే సరస్వతి పుష్కరాల ఉత్సాహం మొదలైంది. త్రివేణి సంగమంలో గంగ, యమున నదులు స్పష్టంగా కనిపిస్తాయి. గంగ నీరు బురద మట్టి కలిసినట్లు గోధూళి వేళను తలపిస్తుంది. యమున నీరు మన కృష్ణానది నీటిలాగ కారుమేఘాన్ని తలపిస్తుంది. పడవలో నది విహారం చేస్తూ రెండు నదుల నీటిని బాటిళ్లలో నింపుకోవచ్చు. సరస్వతి నది ఇక్కడ అంతర్వాహిని కావడంతో ఆ నీటిని వర్ణించడం సాధ్యం కాదు. పుష్కరాల సమయంలో ఇక్కడ తీర్థ స్నానం చేస్తారు. పూజాదికాలు నిర్వహిస్తారు.ఇర ఈ టూర్ మే నెల 8వ తేదీన మొదలవుతుంది. పుష్కరాలు మొదలయ్యే 15 తేదీ నాటికి ప్రయాగ్‌రాజ్‌కి తీసుకువెళ్తుంది. అంటే సరస్వతి నదికి పుష్కరాలు మొదలైన తొలిరోజే పుష్కర స్నానం ఆచరించే అవకాశం కలుగుతుంది. పుష్కరాలు మే నెల 26వ తేదీతో ముగుస్తాయి.ప్యాకేజీ వివరాలివి: అయోధ్య కాశీ పుణ్య క్షేత్ర యాత్ర (సరస్వతి పుష్కరాల స్పెషల్) ఇది 9 రాత్రులు, 10 రోజుల యాత్ర. పురి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్లు కవర్ అవుతాయి. ఐఆర్సీటీసి నిర్వహిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ పేరు ‘అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర (సరస్వతి పుష్కరాలు స్పెషల్), కోడ్ ఎస్‌సీజెడ్‌బీజీ 41 ఇందులో ఎకానమీ (స్లీపర్ క్లాస్), స్టాండర్డ్ (3 ఏసీ), కంఫర్ట్ (2ఏసీ) కేటగిరీలుంటాయి. ఎకానమీలో ఒక్కొక్కరికి సుమారు 17 వేలు, స్టాండర్డ్‌లో 27 వేలు, కంఫర్ట్‌లో 35వేల రూపాయలు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ని సందర్శించండి. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG41(చదవండి: