breaking news
protests at highways
-
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం గ్యాలరీ
రాష్ట్ర్యవాప్తంగా పలు జిల్లాల్లో ప్రధాన రహదారులను వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్భందం చేసారు. ఈసందర్భంగా వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి చిత్తశుద్ధతో పోరాడుతున్నారన్నారు. తిరుపతి - పుంగనూరు ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు. ----------------------- విశాఖపట్నంలో ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు విశాఖపట్నంలో ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు విశాఖపట్నంలో ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు మునగపాక మెయిన్‌రోడ్డును దిగ్బందం చేసి ఆందోళన తెలుపుతున్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రసాద్ సమైక్యాంద్రకు మద్దతుగా మునగపాకలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న దశ్యంర్యాలీగా వస్తున్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు ----------------------------------------- కదిరిరూరల్,న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా మండల పరిధిలోని పట్నం గ్రామం వద్ద వైఎస్సార్ సీపీ నాయకుడు పట్నం గంగిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం 205 జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. ----------------------------------- చిలకలూరిపేటరూరల్: సమైక్యరాష్ట్రం కొనసాగింపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి నేతత్వంలో ఉద్యమాన్ని ఉధతంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. -
చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతున్న రహదారుల దిగ్బంధం
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రహదారుల దిగ్బంధం జరుగుతుంది. జిల్లాలోని పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాంతో రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అలాగే పుత్తూరులో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి నేతృత్వంలో చెన్నై జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని బియ్యపు మధుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దాంతో నెల్లూరు - తిరుపతి నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణవనంలో ఆ పార్టీ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో జాతీయ రహదారిపై దిగ్బంధం కార్యక్రమం జరిగింది. దీంతో కడప-చెన్నై రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిత్తూరు ఇంఛార్జ్ ఏ.ఎస్.మనోహర్ ఆధ్వర్యంలో బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై ధర్నాతో భారీగా వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఆధ్వరంలో రహదారుల దిగ్బంధం కొనసాగుతుంది.