breaking news
pranathi das
-
భారత జిమ్నాస్ట్స్ విఫలం
స్టుట్గార్ట్ (జర్మనీ): ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా క్రీడాకారిణులు నిరాశ పరిచారు. ప్రణతి నాయక్, ప్రణతి దాస్, తెలుగమ్మాయి బుద్ధా అరుణా రెడ్డి తమ ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఆల్ అరౌండ్ క్వాలిఫయింగ్‌లో ప్రణతి నాయక్ 45.832 పాయింట్లతో 127వ స్థానంలో... ప్రణతి దాస్ 45.248 పాయింట్లతో 132వ స్థానంలో నిలిచారు. వాల్ట్ ఈవెంట్లో ప్రణతి నాయక్ 14.200 పాయింట్లతో 27వ స్థానంతో సరిపెట్టుకుంది. అన్ఈవెన్ బార్స్‌లో ప్రణతి నాయక్ 10.566 పాయింట్లతో 164వ స్థానంలో... ప్రణతి దాస్ 9.916 పాయింట్లతో 182వ స్థానంలో... అరుణా రెడ్డి 8.925 పాయింట్లతో 193వ స్థానంలో నిలువడం గమనార్హం. బ్యాలెన్స్ బీమ్‌లో ప్రణతి దాస్ (10.866 పాయింట్లు) 138వ స్థానంలో... అరుణా రెడ్డి (10.200 పాయింట్లు) 164వ స్థానంలో... ప్రణతి నాయక్ (9.933 పాయింట్లు) 174వ స్థానంలో నిలిచారు. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ప్రణతి దాస్ (11.466 పాయింట్లు) 151వ స్థానంలో, ప్రణతి నాయక్ (11.133 పాయింట్లు) 179వ స్థానంలో నిలువగా...అరుణా రెడ్డి పోటీపడలేదు. -
ఒడిశాలో బాలికపై రేప్.. సజీవ దహనం
బరంపురం (ఒడిశా), న్యూస్‌లైన్: ఒడిశాలోని గంజాం జిల్లాలో రంబా గ్రామానికి చెందిన ఓ బాలిక పై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..రంబా పోలీస్ స్టేషన్ పరిధిలోని డియాడైయి గ్రామంలో గురువారం రాత్రి ఓ వివాహం జరిగింది. దీనికి తపస్వినీ దాస్(17) అనే బాలిక హాజరైంది. రాత్రంతా బంధువులు, స్నేహితులతో కలసి పెళ్లిలో ఆనందంగా గడిపిన ఆమె వేకువజామున 4 గంటల ప్రాంతంలో బహిర్భూమికని బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు వెదికేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తపస్విని పూర్తిగా కాలిన స్థితిలో విగతజీవిగా పడి ఉంది. ఆమె మృతదేహం పడివున్న స్థితిని, అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం కిరోసిన్ పోసి సజీవ దహనం చేసినట్టు అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆగ్రహించిన స్థానికులు రహదారిపైకి చేరి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రహాదారిని దిగ్బంధించి రాస్తారోకోకు దిగారు. ఇదిలావుండగా రేషన్ డీలర్‌గా పని చేస్తున్న తపస్వినీ దాస్ సోదరి ప్రణతి దాస్ సుమారు రెండు నెలల కిందట ఇదే రీతిలో హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలూ పథకం ప్రకారమే జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.