breaking news
praja court
-
చర్చలకు సిద్ధం: సీజేపీ
న్యూఢిల్లీ: నెల రోజులుగా ఉద్యమబాటలో పయనిస్తున్న తాము ఇకపై చర్చల బాటలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం ప్రకటించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు సత్వరం చరమగీతం పాడాలంటూ ఉద్యమపంథాలో వెళ్తున్న తాము ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ‘‘చర్చలకు మోదీ సర్కార్ సుముఖంగా ఉందని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమాచారమిచ్చారు. ఆయన అధికార నివాసంలో చర్చలకు రావాలని ఆహా్వనంపలికారు. అయితే అధికారిక నివాసాల్లో చర్చలకు మేం సిద్ధంగా లేము. జంతర్‌మంతర్‌లో ప్రజాకోర్టు ఇప్పటికే కొలువుతీరి ఉంది. ప్రజలు వచ్చినట్లు మంత్రులూ ఇక్కడికొచ్చి చర్చిస్తే బాగుంటుంది. ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది’’అని దాస్ చెప్పారు. ‘‘మనందరం విద్యావంతులమే. జంతర్ మంతర్‌లో భద్రత పరంగా ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు అని ప్రభుత్వం భావిస్తే దీక్షాస్థలికి బదులుగా మరేదైనా తటస్థ వేదికపై చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. చర్చలకు మేం రెడీ అని ఎప్పుడో చెప్పాం. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనడం ఉత్తమమైన ప్రక్రియ. అయితే అర్థరహిత చర్చలకు మా ఉద్యమంలో చోటేలేదు. నిరసనకారుల డిమాండ్ల సాధనకు కృషిజరిగేలా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకురావాలి. మా డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉందనేదే ఇక్కడ అసలు విషయం. ఎందుకంటే కాలం చాలా విలువైంది. ఇంకా వేలాది మంది జంతర్మంతర్లోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితంనాటి పోలీసుల లాఠీచార్జ్, ఉద్యమకారుల ప్రతిఘటన ఉదంతంలో విద్యార్థులపై పోలీసులు ఎలాంటి కేసులు మోపకూడదు. ఉద్యమం ఉధృతమవుతోంది. ఢిల్లీ నుంచి ఉద్యమం గోవా, ముంబై, జైపూర్‌లకు పాకింది. ఇది సహజంగానే జాతీయస్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది’’అని దాస్ వ్యాఖ్యానించారు. -
పీఠం కోసం పాకులాట
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాకోర్టులో విఫలమయ్యాం. అధినేత మెప్పుపొందాలంటే జిల్లా పరిషత్ పాలకమండల్ని కైవసం చేసుకుందాం. పక్కా వ్యూహం అమలు చేయండి. అధికారపార్టీ హోదా, అవసరమైతే డబ్బు దేనికైనా వెనుకాడవద్దు. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి జెడ్పీ చేరేందుకు విశ్వప్రయత్నం చేయండి. జిల్లా పది నియోజకవర్గాలకు చెందిన టీడీపీ సమావేశంలో చేసుకున్న తీర్మాణమిది’. మరో పదహారు మంది జెడ్పీటీసీల మద్దతు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. వైఎస్సార్సీపీ సభ్యుల్లో సహకారం అందించే వారెవరైనా ఉన్నారా? అని గోతికాడ నక్కలా పడిగాపులు గాస్తున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 11స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 50 జెడ్పీటీసీలున్నా 26స్థానాలు దక్కించుకున్నవారికి పాలకమండలి సొంతం కానుంది. ప్రజావిశ్వాసంతో నెగ్గలేకపోయిన తెలుగుదేశం పార్టీనేతలు ఎంతటి అనైతిక చర్యకైనా పాల్పడి జిల్లా పరిషత్‌కు కైవసం చేసుకోవాలనే తపనలో ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకోసం కోట్లు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఇరువురు నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా కాకుండా జెడ్పీటీసీల బంధువుల ద్వారా పురమాయిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ సభ్యుడు లేకపోయినా.. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎస్సీ జనరల్‌కు రిజర్వుడు అయింది. అయితే తెలుగుదేశం పార్టీ గెలుపొందిన 11మందిలో ఎస్సీ సభ్యుడు లేరు. ఎస్సీ సభ్యుడు లేకపోయినా పాలకమండలి కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అత్యాశ పడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఆర్. శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో ఈ తతంగం నడుస్తున్నట్లు సమాచారం. గత ఐదు రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నా వైఎస్సార్సీపీ సభ్యులు ఇసుమంత కూడా చలించనట్లు సమాచారం. టీడీపీ ఎత్తుగడలను ఎక్కడికక్కడ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వంపై గెలుపొందిన తాము మండల పరిధిలోనే ఉన్నామని, మీలాగా నీతి తక్కువ పనులు చేయలేమని ఓ ఎమ్మెల్సీతో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ ఒకరు బహిరంగంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. అధికారంలో ఉండగా ప్రజావిశ్వాసం పెంపొందించుకోవడం వైపు దృష్టి సారించకుండా అనైతికత వైపు అడుగులేస్తుండటాన్ని పలువురు పార్టీ సీనియర్ నేతలే తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది.


