penalized
-
యూనియన్ బ్యాంక్‌తోపాటు మరో సంస్థపై ఆర్బీఐ జరిమానా
బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడంలో విఫలమైనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్ (లెండ్‌బాక్స్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం నడుచుకోని సంస్థలపై కఠిన చర్యలుంటాయని ఆర్బీఐ పేర్కొంది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై జరిమానాబ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 నిబంధనలు, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాలపై ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.63.6 లక్షల జరిమానా విధించింది. నిధుల బదిలీలో జాప్యం, పూచీకత్తు లేని రుణ విధానాల్లో ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. ముఖ్యంగా వ్యవసాయం వంటి ప్రత్యేక రక్షణ అవసరమయ్యే రంగాల్లో ఆర్థిక సంస్థలు నిర్దేశిత రుణ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూడాలని ఆర్బీఐ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా లేకపోతే పేదరికం తప్పదా?ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్(లెండ్ బాక్స్)పై పెనాల్టీఆర్బీఐ పీర్-టు-పీర్ (పీ2పీ) లెండింగ్ ప్లాట్‌ఫామ్ డైరెక్షన్స్-2017ను పాటించనందుకు లెండ్‌బాక్స్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్‌పై రూ.40 లక్షలు జరిమానా విధించింది. దేశ డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్‌లో గణనీయమైన వృద్ధిని చూసిన పీ2పీ లెండింగ్ కార్యకలాపాలకు సంబంధించిన లోపాలను సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. ఫిన్‌టెక్ కంపెనీలు పారదర్శకత పాటించాలని, వినియోగదారులు, రుణదాతలను రక్షించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని గుర్తు చేసింది. -
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
ఓటరా..! ఓటు వేయడం మీ బాధ్యత! అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రజలను చైతన్యపరుస్తుంది. పైగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే యత్నం కూడా చేస్తోంది.. అంతేగాక టీవీ, సామాజిక మాధ్యమాలతో సహా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే "దేవుడు హుండీలో డబ్బులు వేయడం కాదు! దేశం కోసం ఓటు వేయడం నేర్చుకో!, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకోవడం మన కర్తవ్యం వంటి మాటలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంతలా చేసినా చాలా వరకు ముఖ్యంగా విద్యావంతులే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది కూడా. అయితే ఇలా ఓటు హక్కుని వినియోగించకపోతే కొన్ని దేశాల్లో అధికారులు అస్సలు ఊరుకోరట. చాలా దారుణమైన శిక్షలు విధిస్తారట. అవేంటో తెలుసుకుందామా.!బెల్జియంఇక్కడ వరుసగా నాలుగుసార్లు ఓటు వేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఆస్ట్రేలియాఇక్కడ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది.సింగపూర్ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఆ వ్యక్తుల ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుందిగ్రీస్ఇక్కడ ఏకంగా ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్ నమోదవుతుంది..(చదవండి: పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!) -
13 మంది డిస్మిస్, 45 మందికి ఫైన్
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది అధికారులను డిస్మిస్ చేసింది. 45 మంది అధికారుల పింఛన్ కట్ చేసింది. విధుల నిర్వహణ, ప్రజాసేవలో వాళ్ల పనితీరు అసంతృప్తికరంగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. కొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. అసమర్థులైన అధికారులను తప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, అధికార యంత్రాంగాన్ని సమర్థంగా, బాధ్యతాయుతంగా చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే అన్ని శాఖలకు ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరపాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి తెలిపారు. 50/55 ఏళ్ల వయసు లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తవడానికి ముందు కనీసం ఆరుసార్లు ప్రతి ఉద్యోగికి ఈ సమీక్ష జరగాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. దాన్నిబట్టి వాళ్లను ఉద్యోగంలో ఉంచాలా లేదా రిటైర్మెంట్ ఇప్పించాలా అన్నది నిర్ణయిస్తారు.