breaking news
orrange travels owner
-
ఆరెంజ్ ట్రావెల్స్.. సునీల్‌రెడ్డి ఇంట్లో విషాదం..!
నిజామాబాద్: కాంగ్రెస్ నాయకుడు, ఆరెంజ్ ట్రావె ల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గురువారం రాత్రి ఆయన కుమార్తె సమన్వి (16) అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందింది. అదే రోజు రాత్రి మృతదేహన్ని మెండోరా మండలం సావెల్ గ్రామంలో ఆయన స్వగృహానికి తరలించారు. శుక్రవారం ఉదయం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సునీల్‌రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ అర్వింద్, మాజీ ప్ర భుత్వ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షు డు మానాల మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నా యకుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డిలు శుక్రవారం ఆయన నివాసంలో పరామర్శించారు. -
'టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్ద దొంగ'
-
కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు
-
కేశినేని నాని మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు
రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి అధికారి అని, ఆయనవల్లే తాము బస్సులు నడపగలుగుతున్నామని ఆరంజ్ ట్రావెల్స్ సంస్థ అధినేత సునీల్ రెడ్డి అన్నారు. అలాంటివాళ్లు లేకపోతే కేశినేని నాని తమను బతకనిచ్చేవారు కాదని చెప్పారు. టీడీపీ ఎంపీ అయిన కేశినేని నాని పెద్ద దొంగ అని, రూ. 9 కోట్ల సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైనాన్స్ వ్యాపారులను బెదిరిస్తున్నారని, తన మూడు బస్సులపై అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆయన తెలిపారు. బస్సు ప్రమాదం కేసులో పోలీసుల మీద కూడా నాని ఒత్తిడి తెచ్చారన్నారు. తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని అధికారులను బెదిరించారని చెప్పారు. గత ఆరు నెలల నుంచి కేశినేని నాని తమను ఇబ్బంది పెడుతున్నారని, తామంతా కలిసి ఆయనను ఎంపీగా గెలిపించినా తనపై కక్ష పెట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాని కారణంగా ప్రైవేటు ట్రావెల్స్ అన్నీ దెబ్బతిన్నాయని, చాలామంది బస్సులు నడపడం మానేశారని వివరించారు. ఆయన లాంటి అహంకారులు ఎంపీగా ఉండటం విజయవాడ ప్రజల దురదృష్టమని సునీల్ రెడ్డి అన్నారు. తానే గొప్పవాడినని, మిగతావాళ్లు లేమీ చేయలేరని నాని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. తాము అన్నిరకాల అనుమతులతో ధైర్యంగా బస్సులు నడుపుతున్నందునే తమ బస్సులను ఆయన టార్గెట్ చేశారని తెలిపారు.