నన్ రేప్‌పై బెంగాల్ సర్కారుకు నోటీసులు
న్యూఢిల్లీ: ఓ పాఠశాలలో పనిచేస్తున్న క్రైస్తవ సన్యాసినిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ కేసులోని పూర్తి వివరాలను తమకు అందించాల్సిందిగా కోరింది. రెండు వారాల్లో నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ఎన్‌హెచ్చార్సీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును తాము స్వయంగా సుమోటోగా స్వీకరించినట్లు వెల్లడించారు. కొందరు వ్యక్తులు కోల్‌కతాలోని నన్‌పై అత్యాచారం చేసి , 12లక్షల సొమ్మును దోచుకుని బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.