breaking news
National Housing Bank
-
ఇల్లు వద్దు.. అప్పు అసలే వద్దు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనలో పురోభివృద్ధిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు.. గత ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరోగమనంలో ఉన్నట్లు వ్యక్తిగత గృహ రుణాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు, చర్యల కారణంగా వ్యక్తిగత గృహ రుణాలు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా గృహ రుణాల్లో 14 శాతం వృద్ధి నమోదైతే.. మన రాష్ట్రంలో మాత్రం క్షీణించినట్లు ఎన్‌హెచ్‌బీ 2024 నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలంలో వివిధ బ్యాంకులు విడుదల చేసిన వ్యక్తిగత గృహ రుణాల విలువ రూ. 15,831 కోట్లకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో బ్యాంకులు విడుదల చేసిన రుణాల మొత్తం రూ.16,033 కోట్లు. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణాల విలువ రూ.202కోట్లు తక్కువ. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మంజూరైన గృహ రుణాల విలువ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 14శాతం పెరిగి రూ.33.53 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో ఔట్‌స్టాండింగ్ రుణాల విలువ రూ.4,10,416 కోట్లుగా ఉన్నట్లు ఎన్‌హెచ్‌బీ నివేదికలో పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించాయనడానికి బ్యాంకుల రుణ మంజూరు తగ్గడం, జీఎస్టీ వసూళ్లు క్షీణించడం నిదర్శనమని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్బీఐ నిష్క్రమణ
ముంబై: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ)లో రిజర్వ్ బ్యాంక్ తనకున్న పూర్తి వాటాలను కేంద్ర ప్రభుత్వానికి విక్రయించింది. అటు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) కూడా వాటాలన్నింటినీ విక్రయించడంతో ఎన్‌హెచ్‌బీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతికి చేరినట్లయింది. ఆర్బీఐ వాటాల విలువ రూ.1,450 కోట్లు కాగా, నాబార్డ్ వాటాల విలువ రూ. 20 కోట్లు. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో, ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో వాటాలు విక్రయించినట్లు ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇకపై ఈ రెండు సంస్థల్లోనూ 100 శాతం వాటాలు ప్రభుత్వానికే ఉంటాయని వివరించింది. బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ఆర్బీఐ అదే రంగ సంస్థల్లో వాటాలు కూడా కలిగి ఉండటం సరికాదన్న నరసింహం రెండో కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ రంగానికి ఊతమిచ్చే యోచనతో 1987–88లో బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఎన్‌హెచ్‌బీ ఏర్పాటైంది. కాగా, వ్యవస్థలోకి మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో నిర్వహించిన రెండో విడత డాలర్/రూపాయి స్వాప్ వేలానికి మంచి స్పందన వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. 255 బిడ్స్ రాగా అయిదు మాత్రమే అంగీకరించినట్లు పేర్కొంది. -
180 బిలియన్ డాలర్లకి రియల్టీ పరిశ్రమ!
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ న్యూఢిల్లీ: దేశీ రియల్టీ పరిశ్రమ 2020 నాటికి 180 బిలియన్ డాలర్లకి చేరుతుందని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) అంచనా వేసింది. స్మార్ట్ సిటీల నిర్మాణం, రీట్స్‌కు పన్ను ప్రోత్సాహకాలు వంటి పలు అంశాలు ఈ పెరుగుదలకు కారణాలుగా నిలుస్తాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పలు సంస్కరణల కారణంగా దేశీ రియల్టీ రంగం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి చూరగొంటుందని, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తుందని ఎన్‌హెచ్‌బీ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో శ్రీరామ్ కల్యాణరామన్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు. జీఎస్టీ బిల్లు అమలులోకి వస్తే.. వేర్‌హౌస్ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. రియల్టీ వృద్ధికి సమతుల్యంతో కూడిన నిబంధనలు సహా పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన చాలా అవసరమని సీబీఆర్ఈ చైర్మన్ (ఇండియా, దక్షిణ తూర్పు ఆసియా) అన్సుమన్ మేగజిన్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ రంగం సహకారం లేకుండా రియల్టీలో వృద్ధి కష్టసాధ్యమని క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ పేర్కొన్నారు. కొత్త రియల్టీ చట్టం.. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి దోహదపడుతుంద ని సీఐఐ చైర్పర్సన్ రుమ్జుమ్ చటర్జీ తెలిపారు. -
గృహ రుణం మరింతగా..
రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గొచ్చన్న సంకేతాలు కనిపిస్తుండటంతో రియల్టీ మార్కెట్లో మళ్లీ కాస్త హడావుడి కనిపిస్తోంది. కొనుగోలుదారులకు అందుబాటు రేటులో ఇళ్లను అందించేందుకు డెవలపర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు మరింత ఎక్కువ రుణం పొందేందుకు వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కూడా తన వంతు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వర్గాల సొంతిల్లు కల మరింత సులువుగా సాకారమయ్యేలా తోడ్పడే తాజా పరిణామాల గురించి వివరించేదే ఈ ప్రాఫిట్ కథనం. మధ్యతరగతి వర్గాల వారి సొంతింటి కల సాకారానికి ఎదురయ్యే అనేకానేక అడ్డంకుల్లో ఇంటి ధర ఒకటి. సరే.. ఏదో రకంగా ఈఎంఐలు వగైరా లెక్కలు వేసుకుని మనకు అందుబాటు రేటులో ఉండే ఇల్లు చూసుకున్నా.. డౌన్‌పేమెంటు సమకూర్చుకోవడమనేది మరో పెద్ద సమస్య. అసలే ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు భారీ స్థాయిలో డౌన్పేమెంట్లు కట్టలేక... సొంతింటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది కొందరికి. ఇలాంటి వారికే ఊరటనిస్తూ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తాజాగా లోన్ టు వేల్యూ (ఎల్టీవీ) నిష్పత్తి నిబంధనలను సడలించింది. గృహ రుణాలకు సంబంధించి ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా లోన్ పొందేలా వీలు కల్పించింది.దీని ప్రకారం హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇకపై రూ. 20 లక్షలకు పైగా ఖరీదు చేసే ప్రాపర్టీలకు కూడా 90 శాతం దాకా రుణం ఇవ్వొచ్చు. అయితే, ఈ రుణానికి మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ నుంచి బీమా ఉండాలి. గతంలో ఎల్టీవీ.. ఇప్పటిదాకా రూ. 20 లక్షల దాకా గృహ రుణాలకు సంబంధించి ఎల్టీవీ నిష్పత్తి ప్రకారం ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు రుణం ఇచ్చేవి. అదే రూ. 20 లక్షలు నుంచి రూ. 75 లక్షల దాకా రుణాలపై ఎల్టీవీ నిష్పత్తి 80 శాతంగాను, అంతకు మించితే 75 శాతంగాను ఉండేది. ఉదాహరణకు చెప్పాలంటే.. గతంలో రూ. 50 లక్షల ఇల్లు కొనాలనుకుంటే రూ. 10 లక్షల పైచిలుకు డౌన్‌పేమెంట్ సమకూర్చుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే రూ. 20 లక్షలు మించిన గృహాలపై 80 శాతం దాకా మాత్రమే రుణం లభించేది. ఇక దీనికి తోడు జీతం సంబంధిత పరిమితులు వగైరాలు కూడా కలుపుకుంటే వచ్చే రుణ మొత్తం మరింత తగ్గిపోయి డౌన్‌పేమెంట్ మరింత అధికంగా కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు.. ప్రస్తుతం మార్టిగేజ్ గ్యారంటీ ప్రోగ్రాం కింద రూ. 20 లక్షలకు పైబడిన రుణాలకు కూడా 90% దాకా ఎల్టీవీ తీసుకునే అవకాశం లభిస్తుంది. దీని వల్ల అదే రూ. 50 లక్షల ఇంటికి సుమారు పది శాతం డౌన్‌పేమెంట్ సమకూర్చుకుంటే సరిపోతుంది. అంటే.. దాదాపు రూ. 5 లక్షలు సర్దుబాటు చేసుకుంటే చాలు. మొత్తం మీద.. ఎన్‌హెచ్‌బీ చేసిన సవరణల వల్ల గతానికి, ప్రస్తుతానికి ఒక చిన్న మార్పు వచ్చింది. గతంలో రుణ గ్రహీత, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ మధ్య మాత్రమే లావాదేవీ జరిగేది. ప్రస్తుతం మరింత అధిక లోన్ పొందాలంటే మూడో పక్షమైన మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ కూడా తోడవుతుంది. ఇక, ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం మరొకటుంది. హెచ్ఎఫ్సీ అధిక రుణం ఇస్తుంది కదా అని కాస్త ఎక్కువ డౌన్‌పేమెంట్ కట్టగలిగే స్తోమత ఉన్నా కట్టకుండా రుణమే తీసుకుంటే ఆ తర్వాత అధిక వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తుందన్నది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకూ డౌన్‌పేమెంట్ మొత్తం ఎక్కువ ఉండేలా చూసుకుంటే.. అధిక రుణం, వడ్డీల భారం తగ్గించుకోవచ్చు. ఏదైతేనేం.. ప్రస్తుతం పండుగ సీజన్ అనీ, మరొకటని బ్యాంకులు గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులు తగ్గిం చడం, ప్రీ పేమెంట్ చార్జీలు రద్దు చేయడం, ఉచితంగా వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయం అంటూ వివిధ ఆఫర్లతో ఊరిస్తున్నాయి. వీటికి సంబంధించి ఏయే బ్యాంకులు ఏమేం ఆఫర్లు ఇస్తున్నాయన్నది బేరీజు వేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. మార్టిగేజ్ గ్యారంటీ.. దీన్నే మార్టిగేజ్ బీమా అని కూడా అంటారు. ఈ బీమా పాలసీ తీసుకుంటే .. ఒకవేళ గృహ కొనుగోలుదారు గానీ రుణం తిరిగి చెల్లించలేక చేతులెత్తేసిన పక్షంలో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకు (హెచ్ఎఫ్సీ) సదరు బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. ఆ రకంగా హెచ్ఎఫ్సీ ఇచ్చిన రుణాలకు కాస్త భరోసా ఉంటుంది. అందుకే, మరికాస్త అధిక మొత్తం రుణం ఇవ్వడానికి హెచ్ఎఫ్సీలు ముందుకు రాగలవు. దేశీయంగా తొలి మార్టిగేజ్ గ్యారంటీ సంస్థ అయిన ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్‌ను స్వయంగా ఎన్హెచ్బీనే 2012లో ఏర్పాటు చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే ఈ మార్టిగేజ్ బీమాను తీసుకునే వారు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సందర్భాన్ని బట్టి హెచ్ఎఫ్సీ సైతం ఈ ప్రీమియం భారం తనపై వేసుకున్నా.. దాన్ని అంతిమంగా రుణగ్రహీతకే బదలాయించే అవకాశాలు ఉన్నాయి. -
హైదరాబాద్ రియల్ ధరల పై అనిశ్చితి