breaking news
National Cadet Caps
-
Viral Video: చెప్పినట్టు వినలేదని ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..
ముంబై: ముంబైకి సమీపంలోని థానేకు చెందిన ఓ కాలేజీలో ఓ సీనియర్ ఎన్సీసీ విద్యార్థి జూనియర్ క్యాడెట్లను కర్రతో చితక బాదుతోన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. జూనియర్లను అమానుషంగా కొడుతున్న ఈ వీడియోను చూసి అనేక మంది నెటిజన్లు సీరియస్ అవుతూ ఆ సీనియర్ విద్యార్థిపైనా, కాలేజీ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసున్నారు. ముంబైకు సమీపంలోని థానే బందొర్కర్ కాలేజీలో జోరువానలో ఓ సీనియర్ ఎన్సీసీ క్యాడెట్ అతను చెప్పిన టాస్క్ చేయలేదన్న నెపంతో ఎనిమిది మంది జూనియర్ క్యాడెట్లను వరుసగా తల బురదనీటిలో ఆనించి వీపు భాగాన్ని పైకి లేపమని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను అక్కడి వారెవరో వీడియో తీసి వైరల్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్సీసీ క్యాడెట్లు అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణతో కూడిన నడవడికతోపాటు సేవాతత్వాన్ని అలవాటు చేసే విశేష కార్యక్రమం ఎన్సీసీ. అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మిగతా వారికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉంటారు. అలాంటిది తమ కాలేజీలోని ఎన్సీసీ క్యాడెట్లు ఇంతటి దుశ్చర్యకు పాల్పడటంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ సీనియర్ విద్యార్థి కూడా ఎన్సీసీ క్యాండిడేటే కాబట్టి అతనిపై తప్పక చర్య తీసుకుంటాము. మా కాలేజీలో 40 ఏళ్లుగా ఎన్సీసీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. కానీ ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. శిక్షకుడు లేని సమయంలో ఆ సంఘటన జరిగిందని మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనివారే అలా ప్రవర్తిస్తుంటారని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్.. -
లక్ష్యం+క్రమశిక్షణ=ఎన్సీసీ
ఖమ్మం స్పోర్ట్స్: యువతకు క్రమశిక్షణ నేర్పి వారి జీవన విధానంలో మంచి మార్పులు తెస్తున్న అంశాల్లో ఎన్సీసీ(నేషనల్ క్యాడెట్ క్యాప్స్)ది ప్రముఖ స్థానం. విద్యార్థుల్లో దేశాభక్తి, జాతీయ భావం. ధైర్య సాహసాలు పెంపొందించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. లక్ష్యంతో కూడుకున్న జీవన విధానానికి బాటలు చూపడం ఎన్సీసీ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో ఆదివారం రోజును ఎన్సీసీ దినోత్సవంగా పాటిస్తున్నాం. 1917లో ఆవిర్భవించిన ఎన్సీసీకి 1949 నుంచి దేశంలో అధికార హోదా పొందింది. 1980లో జిల్లాకు పరిచయమైన నాటి నుంచి నేటి వరకు 30వేల మందికి పైగా క్యాడెట్లను సమకూర్చింది. ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డేలో పాల్గొనే జిల్లా క్యాడెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2015లో జరిగే రిపబ్లిక్ వేడుకల్లో ఖమ్మంలోని హార్వెస్ట్ స్కూల్ విద్యార్థులు ఈసారి కూడా ఎంపికయ్యూరు.