breaking news
Narra Hanumantha Rao
-
శశికళ అంత్యక్రియలకు వచ్చేందుకు భర్తకు అనుమతి
అమెరికాలో దారుణహత్యకు గురైన శశికళ (40), కుమారుడు అనీష్ సాయి (7)ల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత దేశానికి వచ్చేందుకు శశికళ భర్త నర్రా హనుమంతరావుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. న్యూజెర్సీలోని బర్లింగ్టన్లో శశికళ, అనీష్ రక్తపు మడుగులో పడి ఉండగా ఈ హత్యలపై హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, అతడికి కేరళకు చెందిన వేరే మహిళతో సంబంధం ఉందని వివరిస్తూ తన సోదరుడికి శశికళ ఈమెయిల్ పంపడం, ఆ తర్వాతే ఆమె హత్యకు గురి కావడంతో తమ అల్లుడే కూతురిని, మనవడిని హతమార్చి ఉంటాడని శశికళ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే.. అమెరికాలో మాత్రం అతడి మీద ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో.. అతడి ప్రయాణాలను నియంత్రించడం లేదని, తమవాళ్ల అంత్యక్రియలకు వెళ్లేందుకు హనుమంతరావుకు అనుమతి ఉందని బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ అధికార ప్రతినిధి జోయెల్ బెవ్లీ తెలిపారు. హనుమంతరావుకు చాలా గట్టి ఎలిబీ ఉందని కూడా అంటున్నారు. హనుమంతరావు గత వారం రోజులుగా వేరే మహిళతో ఉంటున్నాడని బర్లింగ్టన్ ప్రాంతంలోని సీబీఎస్ ఫిల్లీ చానల్ చెబుతోంది. ఆ మహిళ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. అమెరికాలో ఇద్దరు తెలుగువాళ్లు దారుణ హత్య! ఎన్నారైల హత్య.. వివాహేతర సంబంధమే కారణమా? -
వేరే మహిళతో సంబంధం పెట్టుకొని వేధించేవాడు
-
అమెరికా జంట హత్యల కేసులో కొత్త కోణం
-
అమెరికా జంట హత్యల కేసులో కొత్త కోణం
విజయవాడ: అమెరికాలో జంట హత్యల కేసులో కొత్త కోణం బయటపడింది. మృతురాలు శశికళ పంపిన ఈ మెయిల్స్‌ను ఆమె కుటుంబ సభ్యులు శనివారం బయటపెట్టారు. తన భర్త నర్రా హనుమంతరావుకు ఓ కేరళ మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ శశికళ తన సోదరుడు వేణుకు మెయిల్ లో తెలిపింది. శశికళ మెయిల్ తో తెలిపిన విషయాలు... ‘సీటీఎస్‌లో పని చేసే దీపా అజిత్‌తో హన్మంత్‌కు సంబంధం ఉంది. రోజు దీపాతో హన్మంత్ ఫోన్లు, చాట్లు చేస్తున్నాడు. మొబైల్లో వీటిని చూసి హన్మంత్‌ను నిలదీశా. నేనేం తప్పు చేయలేదని బుకాయించాడు. హన్మంత్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. కొన్నిసార్లు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఏమైనా చేసుకో పో అంటూ తిరగబడుతున్నాడు. ఐదేళ్ల కొడుకు ఉండికూడా మరో మహిళతో సంబంధం ఘోరం. హన్మంతరావును నేనెంతో నమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు ఇలాంటి మోసం జరగుతుందనుకోలేదు. వాళ్ల తల్లిదండ్రులు, అక్కా బావా అందరూ కుట్రదారులే. ఒక్క విషయం కూడా పంచుకోరు, పైగా ప్రమాదకారులు. ముఖ్యంగా మా అత్తమ్య చాలా చాలా ప్రమాదకారి. కొడుకును ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. ఈ విషయాలన్నీ అమ్మకు చెబితే బాధ పడుతుంది. ఇన్ని బాధలున్నా బతుకుతున్నానంటే కేవలం హనీష్ (కొడుకు) కోసమే.’ అని మెయిల్లో పేర్కొంది. అలాగే భార్యాభర్తల మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలుతో పాటు భర్త వేధింపులకు సంబంధించిన సోదరుడు వేణుకు పంపిన మెయిల్లను మృతురాలు తల్లిదండ్రులు మీడియాకు చూపించారు. (చదవండి- వివాహేతర సంబంధమే కారణమా?) తమ కూతురు, మనవడిని దారుణంగా హతమార్చిన హనుమంతరావును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, కృష్ణకుమారిలు డిమాండ్ చేశారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస సహకారం కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి అయినప్పటినుంచే భర్త వేధింపులకు గురిచేస్తున్నడంటూ తమ కుమార్తె పలుమార్లు చెప్పినా తామే సర్దుకుపొమ్మని చెప్పామని, అయితే అల్లుడు ఇంత ఘాతుకానికి పాల్పడతాడని తాము ఊహించలేదని అన్నారు. మరోవైపు జంట హత్యల కేసులో హనుమంతరావును అక్కడ పోలీసులు విచారణ జరిపారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం అతడిని విడుదల చేశారు. హన్మంత్ తో కేరళ యువతి చాటింగ్... అలాగే హన్మంత్ కేరళ యువతితో చేసిన చాటింగ్‌ను కూడా శశికళ బంధువులు బయటపెట్టారు. ‘నా జీవితంతో ఆటలు ఆడుకుంటున్నావు. నువ్వొక అబద్ధాలకోరువు. నా భర్త ముందు నిలబడి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలను. ఇదే విషయం నువ్వు నీ భార్య ముందు చెప్పగలవా?. నీ భార్యకు నువ్వు భయపడుతున్నావు. నాతో సంబంధంపై భయపడేవాడివైతే ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు?. నీ దగ్గర నేనేం దాచలేదు.’ అని కేరళ యువతి హన్మంత్‌కు మెసేజ్ చేసింది. మరోవైపు జంట హత్యల కేసులో హనుమంతరావును అక్కడ పోలీసులు విచారణ జరిపారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం అతడిని విడుదల చేశారు. చదవండి... అమెరికాలో తల్లీబిడ్డల దారుణహత్య -
ఎన్నారైల హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
అమెరికాలో తల్లీ కొడుకులను ఎవరో దారుణంగా హతమార్చారు. ఈ ఘటన తీవ్రంగా కలకలం రేపింది. అయితే, ఈ ఘటన వెనుక మరో కోణాన్ని మృతురాలి తల్లిదండ్రులు బయటపెడుతున్నారు. తమ అల్లుడు నర్రా హనుమంతరావుకు అమెరికాలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అందువల్ల అతడే తమ కూతురిని, మనవడిని హతమార్చి కట్టుకథలు చెబుతున్నాడని ఆరోపించారు. విజయవాడలో ఉంటున్న శశికళ తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజెర్సీలోని బర్లింగ్టన్లో నివాసం ఉంటున్న శశికళ (40), కుమారుడు అనీష్ సాయి (7) హత్యకు గురయ్యారు. వారిద్దరినీ ఎవరో గొంతు కోసి చంపేశారు. శశికళ భర్త నర్రా హనుమంతరావు గత 12ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. శశికళ కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వీరికి 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. తొమ్మిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. శశికళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. (చదవండి: అమెరికాలో ఇద్దరు తెలుగువాళ్లు దారుణ హత్య! ) శశికళ బుధవారం సాయంత్రం బాబును స్కూల్ నుంచి తీసుకొచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారని చెప్పారు. వెంటనే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానన్నారు. అయితే, తమ అల్లుడు చెబుతున్నదంతా కట్టుకథేనని, అతడికి అక్కడ ఒక మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే తమ కూతురిని హతమార్చాడని శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. -
అమెరికాలో ఇద్దరు తెలుగువాళ్లు హత్య!
-
అమెరికాలో ఇద్దరు తెలుగువాళ్లు దారుణ హత్య!
ఒంగోలు: అమెరికాలో జాత్యాహంకార ఉన్మాది కాల్పులలో మరణించిన తెలుగు ఇంజినీర్ కూచిబొట్ల శ్రీనివాస్ ఉదంతం మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. మరో ఇద్దరు తెలుగువారు దారుణహత్యకు గురయ్యారు. మృతులు ప్రకాశం జిల్లా పర్చురు మండలం తిమ్మరాజుపాలెం వాసులు. న్యూజెర్సీలోని బర్లింగ్టన్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ నర్రా హనుమంతరావు భార్య శశికళ (40), కుమారుడు అనీష్ సాయి (7) హత్యకు గురైనట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు వారిద్దర్ని గొంతు కోసి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. నర్రా హనుమంతరావు గత 12ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. శశికళ కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వీరికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. అమెరికాలో తొమ్మిదేళ్లుగా నివసిస్తున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. శశికళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. శశికళ బుధవారం సాయంత్రం బాబును స్కూల్ నుంచి తీసుకొచ్చారు. అయితే, సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపు మడుగులో విగతజీవులుగా పడిఉన్నారు. వారిని గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించిన ఆయన... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు పర్చూరు ఎమ్మెల్యే... అమెరికాలోని తానా ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. కాగా ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.