breaking news
Money Is Honey
-
స్నేహమేరా జీవితం
‘‘జీవితంలో డబ్బు ముఖ్యం కాదు. స్నేహం అంతకంటే విలువైంది’’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మనీ ఈజ్ హని’. జె.వి. నాయుడు, రోషన్, ఎం.ఆర్, వెంకీ, అభిషేక్, రచనా స్మిత్, రష్మిజా, బాబు పోకల ముఖ్య పాత్రల్లో జనార్ధన్ శివలంకి దర్శకత్వంలో జాలె వాసుదేవనాయుడు నిర్మించారు. జి.వసంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేసి, మరో నిర్మాత రాజ్ కందుకూరికి అందించారు. ట్రైలర్ను కల్యాణ్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మంచి కథ తయారు చేసుకున్న తర్వాత నిర్మాత కోసం వెతకడం మొదలుపెట్టా. ఆ టైమ్లో మా గురువు వాసుదేవనాయుడుగారు సినిమా చేస్తానని ముందుకొచ్చారు. నా తొమ్మిదేళ్ల కష్టమే ఈ చిత్రం. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించాం’’ అన్నారు. సాయివెంకట్, ఆర్.కె.గౌడ్, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
స్వార్థం నిండిన స్నేహం
ఇద్దరు స్నేహితుల స్వార్థపూరిత ఆలోచనలు... వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపాయి? అనేదే ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘మనీ ఈజ్ హనీ’. వెంకీ, జి.ఎం.ఆర్, ఆషిక్, అబంతిక ప్రధాన పాత్రధారులు. జనార్ధన్ శివలెంకి దర్శకుడు. జె.వి.నాయుడు నిర్మాత. ఈ చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది. నేటి స్నేహం పోకడలే ఈ సినిమా ప్రధానాంశమనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.వి, సహ నిర్మాతలు: షేక్ అక్తరున్నీసా, జె.జానకి.