breaking news
mojo
-
పోలీసుల అదుపులో రేవతి
-
పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ
సాక్షి, బంజారాహిల్స్ : మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. రేవతి నివాసం వద్ద నుంచి స్టేషనుకు తరలించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లఘు పరిశ్రమలకు ఇన్స్టామోజో రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఇన్స్టామోజో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు తక్షణ రుణాలను అందజేసేందుకు మోజో క్యాపిటల్ సేవలను ప్రారంభించింది. కంపెనీ కస్టమర్లకు రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిం చాల్సి ఉంటుందని ఇన్స్టామోజో కో–ఫౌండర్ ఆకాశ్ గెహానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘24 గంటల్లో కస్టమర్ ఎప్పుడు కోరినా క్షణాల్లో లోన్ వారి ఖాతాలో చేరుతుంది. వడ్డీ కస్టమర్నుబట్టి, తీసుకున్న రుణం ఆధారంగా 24 శాతం వరకు ఉంటుంది. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది కస్టమర్లు రుణాలను అందుకున్నారు. మొత్తం రూ.40 కోట్లు జారీ చేశాం. ఆరు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో మాకు భాగస్వామ్యం ఉంది. మరిన్ని సంస్థలతో చేతులు కలుపుతాం. ఇన్స్టామోజోకు 200 నగరాల్లో 5 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు’ అని వివరిం చారు. సంస్థ వినియోగదారులకు రోజువారీ లాజిస్టిక్స్, డెలివరీ సేవల కోసం మోజో ఎక్స్ప్రెస్ సర్వీసులను సైతం పరిచయం చేసింది. కంపెనీలో 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.


