breaking news
Marine Products
-
కొన్నేళ్లలోనే రూ.8.6 లక్షల కోట్లకు చేరే ఎగుమతులు
వచ్చే నాలుగైదేళ్లలో ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఇండస్‌ఫుడ్ 2025 ఎగ్జిబిషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘భారతీయ ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉంది. ఉత్పత్తిలో నాణ్యత, పౌష్టికాహారం, సుస్థిరతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఉత్పత్తుల నాణ్యతను పెంచడానికి, దేశవ్యాప్తంగా టెస్టింగ్ ప్రయోగశాలలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నాలుగైదేళ్లలో ఈ విభాగాల నుంచి ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఆహారం, పానీయాల రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతించింది. ఈ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు, యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: రూపాయి ఢమాల్.. నేల చూపులకు కారణాలుఅంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇన్నోవేషన్, మెరుగైన ప్యాకేజింగ్, యాంత్రీకరణలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని సాధించడం భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగంలో ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చెబుతున్నారు. -
సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచుతాం
ఫారిన్ ట్రేడ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అలోక్ త్రివేది సాక్షి,విశాఖపట్నం: దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచే 45 శాతం జరుగుతున్నాయని, వీటిని మరింత పెంచడమే తమలక్ష్యమని ఫారిన్ ట్రేడ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అలోక్ త్రివేది చెప్పారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల పెంపుదలపై భారత ఎగుమతి దారుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖలో మంగళవారం సదస్సు జరిగింది. ఎగుమతి చేయడం ఎలా మొదలుపెట్టాలి, మార్కెట్ రీసెర్చ్, కొనుగోలు దారులను గుర్తించడం వంటి అంశాలను ఆయన వివరించారు. భారత ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ స్కీమ్ వివరాలను ఫారెన్ ట్రేడ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పున్నం కుమార్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడాలని జాయింట్ డైరెక్టర్ జనరల్ ఉన్ని కృష్ణన్ సూచించారు. ఈ సదస్సులో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ పి.వి.వి.ఎస్.ఎస్. శ్రీనివాస్, బ్యాంకర్లు పాల్గొన్నారు.