breaking news
malabar gold showroom
-
బంగారు దుకాణాల బరి తెగింపు
అనంతపురం సెంట్రల్: నగరంలో జాయ్‌అలుకస్, మలబార్‌గోల్డ్ జ్యువెలరీ నిర్వాహకులు కోవిడ్–19 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల అనుమతులు లేకుండా తెరవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్–19 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు నగర పాలక సంస్థ ప్రజారోగ్యం అధికారి డాక్టర్ రాజేష్ తనిఖీలో తేలింది. దీంతో సదరు నిర్వాహకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎంహెచ్ఓ తెలిపారు. భౌతికదూరం పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అనంతలో అవంతిక
అనంతపురం కల్చరల్ : అనంతపురంలో ప్రముఖ సినీనటి తమన్న సందడి చేసింది. మలబార్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్‌ను ప్రారంభించడానికి గురువారం నగరానికి విచ్చేసిన తమన్నాను చూడటానికి అభిమానులు భారీగా తరలిరావడంతో సప్తగిరి సర్కిల్ కిటకిటలాడింది. మలబార్ షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత తమన్నా మాట్లాడుతూ నాణ్యమైన ఆభరణాలతో, స్వచ్ఛమైన బంగారంతో మలబార్ వారు ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం తాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో నటిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించిన ‘బాహుబలి’ వంటి తెలుగు సినిమాలో నటించడం గర్వంగా ఉందని చెప్పారు. నిర్వాహకులు మాట్లాడుతూ 178వ షోరూమ్‌ను అనంతలో ప్రారంభిస్తున్నామని, తొలిసారి పూర్తీస్థాయి హాల్‌మార్క్ బంగారంతో పాటు ప్లాటినమ్, డైమండ్స్ ఆభరణాలను జిల్లాకు పరిచయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ స్వరూపతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూముల నిర్వాహకులు హాజరయ్యారు.