breaking news
Madam
-
'సార్ మేడమ్' మూవీ రివ్యూ.. అందరికీ కనెక్ట్ అవుతుందా..?
టైటిల్: సార్ మేడమ్నటీనటులు: విజయ్ సేతుపతి, నిత్యా మేనన్, యోగిబాబు, రోషిని హరిప్రియన్, దీప శంకర్, మైనా నందిని, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్ తదితరులునిర్మాణ సంస్థలు: సత్య జ్యోతి ఫిలిమ్స్నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్దర్శకత్వం: పాండిరాజ్సంగీతం: సంతోష్ నారాయణన్విడుదల తేది: ఆగస్టు1, 2025సరికొత్త కథలను ప్రేక్షకుల దగ్గరచేయడంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ వంటి స్టార్స్ ఎప్పుడూ ముందుంటారు. అలాంటిది వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే భారీ అంచనాలు ఉంటాయి. ఈ జోడీ నటించిన కొత్త చిత్రం 'సార్ మేడమ్'.. భార్యాభర్తల అనుబంధం నిత్య జీవితంలో ఎలా ఉంటుందో దర్శకుడు పాండిరాజ్ చూపించారు. తమిళ్లో జులై 25న 'తలైవన్ తలైవి' పేరుతో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఆగష్టు 1న రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేటంటే..ఏడడుగుల బంధం ఎలా ఉంటుందో 'సార్ మేడమ్' చిత్రంలో చూపించారు. పెళ్లైన వారందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) సొంత గ్రామంలోనే పరోటా మాస్టర్‌గా ఒక హోటల్ నడుపుతుంటాడు. ఇందులో చేయి తిరిగిన పరోటా మాస్టర్‌గా ఆయనకు పేరు ఉంటుంది. తనుకు పెళ్లి చెయ్యాలని రాణి (నిత్యా మీనన్) అనే అమ్మాయిని వీరయ్య కోసం చూస్తారు. పెళ్లి చూపుల్లోనే ఇరుకుటుంబాలు ఒప్పుకుంటాయి. ఎలాగైన తమ కుమారుడికి పెళ్లి చేయాలని పదో తరగతి మాత్రమే చదవిన వీరయ్య డబుల్ MA చేశాడని ఆపై ఇల్లు తమ సొంతమని కొన్ని అబద్దాలు చెబుతారు. అయితే, వీరయ్య కుటుంబ నేపథ్యం గురించి నిజం తెలుసుకున్నాక ఆ సంబంధం వద్దనుకుంటారు. కానీ, పెళ్లి చూపుల్లోనే ప్రేమలో మునిగిపోయిన వీరయ్య, రాణి పెద్ద వాళ్లను కాదని పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సంతోషంగా హోటల్ రన్ చేసుకుంటూ వారి సంసార జీవితాన్ని గడుపుతారు. రాణిని మొదటి మూడు నెలలు అత్తమామలు, ఆడపడుచుతో సహా అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అయితే, ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలౌతుంది. రాణిపై అత్త పెత్తనంతో పాటు ఆడపడుచు సాధింపులు మొదలవుతాయి. దీంతో తరుచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒకరోజు అవి తారాస్థాయికి చేరుకుంటాయి. దీంతో వీరయ్య, రాణి ఇద్దరూ విడిపోవాలని విడాకులు తీసుకోవాలనుకుంటారు. ఎంతో ప్రేమగా ఉన్న ఆ జంట విడిపోయేందుకు కారణాలు ఏంటి..? భార్యాభర్తల గొడవలకు ఎవరు కారణం అయ్యారు..? రాణి అన్నయ్యతో వీరయ్యకు ఉన్న గొడవ ఏంటి..? సంతోషంగా ఉన్న కాపురంలో మొదట అగ్గిరాజేసింది ఎవరు..? అనేది అసలు కథ.ఎలా ఉందంటే.. భార్యాభర్తల బంధం బలంగా నిలబడాలంటే ప్రేమ, గౌరవం, నమ్మకం, పరస్పర అవగాహనతో కూడి ఉండాలి. పొరపాట్లు జరగడం సహజం. అప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి.. ఆపై క్షమాపణ చెప్పడానికి వెనుకాడకూడదు. 'సార్ మేడమ్' సినిమా కూడా ఇలాంటి మెసేజ్‌నే ఇస్తుంది. భార్యాభర్తల అనుబంధాన్ని నిలుపుకునేందుకు వారు పడే పాట్లు కష్టంగానే ఉన్నా చూసే వారికి అందంగానే ఉంటుంది. ఈ చిత్రం ఇప్పటికే పెళ్లైన, పెళ్లి చేసుకోవాలనకునే వారందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ కథలో చాలా సీరియస్‌నెస్ ఉంటుంది. కానీ, దర్శకుడు పాండిరాజ్ చాలా సహజంగా అందరినీ ఆలోచింపచేసేలా నవ్విస్తూనే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. భార్యభర్తల మధ్య తరుచూ కనిపించే గిల్లికజ్జాలు, గొడవలు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాయి.భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా తండ్రికి తెలియకుండా కూతరు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు అత్తమామలు చేసే ప్రయత్నం నుంచి కథ ఆరంభం అవుతుంది. అలా వారి గతాన్ని చాలా ఫన్నీగా చెబుతూ.. మొదట వీరయ్య, రాణిల పెళ్లి ఎలా అయింది..? పెళ్లి తర్వాత రాణిపై అత్త, ఆడపడుచు ఆధిపత్యం చేయడం. కోడలిపై మామగారికి ఉన్న అభిమానం. భార్యపై భర్తకు ఉన్న ప్రేమ.. ఇలా ఒకటేంటి ఎన్నో ఈ కథలో మనకు కనిపిస్తాయి. సంతోషంగా సాగుతున్న సంసారంలో కొన్నిసార్లు గొడవలు సహజం. ఆ గొడవల మధ్యలోకి అత్తమామలు దూరితే సంఘర్షణ డబుల్ అవుతుంది. సినిమా అంతా బాగున్నప్పటికీ ఈ కథ ఎక్కువగా రెండు పాత్రల చుట్టూ తిరగడం కాస్త మైనస్, పదేపదే గొడవ పడటం వంటి అంశాలు రిపీటెడ్‌గా అనిపిస్తాయి. అంతే తప్పా ఇందులో మైనస్‌లు పెద్దగా లేవు. కొన్ని సీన్లు ఎక్కువగా సాగదీశారనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. ఆకాశ వీరయ్యగా విజయ్ సేతుపతి, రాణి పాత్రల్లో నిత్యా మేనన్ ఫుల్ ఎనర్జిటిక్‌గా మెప్పించారు. వారి మధ్య కనిపించే కెమిస్ట్రీ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. సినిమాలో అప్పుడప్పుడు కనిపించే యోగిబాబు తన పంచ్‌లతో నవ్విస్తాడు. సరైన సమయంలో తన పాత్ర ఎంట్రీ ఇస్తుండటంతో బాగా అనిపిస్తుంది. ఆపై విజయ్ సేతుపతి తన నటనతో అదరగొట్టేశాడు. అటు తల్లికి... ఇటు భార్యకు నచ్చచెబుతూ తను మాత్రం ఇద్దరి మధ్య నలిగిపోతుంటాడు. ఒక సామాన్యుడి జీవితానికి వీరయ్య పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. ఆపై అత్తింటి వాళ్లతో పాటు భర్తతో గొడవపడేటప్పుడు రాణి పాత్రలో నిత్యా మేనన్ దుమ్మురేపింది. అదే సమయంలో తన పుట్టింట్లో భర్త గురించి గొప్పగా చెప్పుకున్న సీన్ ప్రతి అమ్మాయి జీవితాన్ని తాకుతుంది. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య జరిగే చిన్న గొడవల్లోకి కుటుంబ సభ్యులు, చుట్టాలు ఎలా ఎంట్రీ ఇస్తారో ప్రీ క్లైమాక్స్‌లో అర్థం అయ్యేలా దర్శకుడు బాగా చూపించాడు. కథకు తగ్గట్టుగా సంగీతం బాగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపిస్తుంది. సినిమా పూర్తి అయిన తర్వాత ఈ కథకు కనెక్ట్ అయిన ప్రతిఒక్కరు నవ్వుతూనే ఆలోచిస్తారు. జీవితం అంటే ఇదే కదా అంటూ బయటకు వచ్చేస్తారు. -
బిష్ణోయ్ గ్యాంగ్‌లో మేడం మాయ.. చేసే పని ఇదే..
న్యూఢిల్లీ: పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు అతని గ్యాంగ్‌కు అంతకంతకూ ఉచ్చు బిగుస్తోంది. ‘మేడమ్ మాయ’తోపాటు ఈ ముఠాలోని నలుగురు సభ్యులను జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ మేడమ్ మాయకు ప్రత్యేకమైన పనులను ఇచ్చేవాడని సమాచారం.మేడమ్ మాయ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనుచరులతో సన్నిహితంగా మెలుగుతుంటారు. దీనితో పాటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సందేశాలను సంబంధితులకు అందజేసే పనిని మేడం మాయనే చేస్తుంటారు. గ్యాంగ్‌లో మేడమ్ మాయకు ఎంతో ప్రాధాన్యత ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఏ ముఠా సభ్యునికి బెయిల్ ఇవ్వాలో, ఏ నేరస్తుని ఏ జైలు నుండి ఎక్కడికి మార్చాలో మేడమ్ మాయనే డిసైడ్ చేస్తుంటారు.రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడమ్ మాయ ఈ ముఠాలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. జైలులో ఉన్న లారెన్స్ గ్యాంగ్ సభ్యుల పూర్తి వివరాలు మేడమ్ మాయ వద్ద ఉన్నాయి. జైలులో ఉన్న నేరస్తులు అందించే సందేశాలను ఆమె స్థానిక ముఠాకు చేరవేస్తుంటారు. విదేశాల్లో ఉంటున్న పలువురు నేరస్తులతో ఆమెకు మంచి పరిచయాలున్నాయి.మహిళా నేరస్తురాలు మేడం మాయ అసలు పేరు సీమా అలియాస్ రేణు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఆమెను మేడమ్ మాయ అని పిలుస్తారు. మేడమ్ మాయపై జైపూర్, ఢిల్లీ, హర్యానాలలో పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ ముఠాలోని ఏడుగురు నేరస్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె జైపూర్‌లో ఓ వ్యాపారిపై కాల్పులు జరిపేందుకు ప్లాన్ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఇది కూడా చదవండి: దిగొచ్చిన బంగారం.. ఇక కొందాం.. -
పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్! మేడమ్! అని పిలవకూడదు!
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్, మేడమ్ వంటి పదాలతో సంభోదించకూడదట. కేవలం "టీచర్" అనే సంబోధించాలని కేరళ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్యానెల్ (కేఎస్‌సీపీసీఆర్) విద్యాశాఖను ఆదేశించింది. ఉపాధ్యాయులను సర్ లేదా మేడమ్ వంటి గౌరవమైన పదాల కంటే లింగంతో సంబంధం లేకుండా తటస్థమైన పదంతో సంబోధించాలని ప్యానెల్ నిర్ణయించింది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో "టీచర్" అని సంబోధించేలా ఆదేశాలు ఇవ్వాలని చైర్ పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు విజయకుమార్‌లతో కూడిన ప్యానెల్ బుధవారం విద్యాశాఖను ఆదేశించింది. టీచర్ అని సంబోధించడం వల్ల అన్ని పాఠశాలల్లో పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో ఉపకరించడమే కాకుండా ఉపాధ్యాయులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులను లింగం ఆధారంగా సర్ లేదా మేడమ్ అనే సంబోధన కారణంగా ఏర్పడుతున్న లింగ వివక్షతను అంత చేయాలని కోరుతూ..ఒక వ్యక్తి దాఖలు చేసిని పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని ప్యానెల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతికి రాహుల్ నివాళి) -
నన్నే... ఎందుకు?
జీవన గమనం నేను ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాను. కాలేజీలో మా మేడమ్‌తో సమస్యగా ఉంది. ఆమె కోర్ సబ్జెక్ట్ చెబుతారు. క్లాస్‌లో ఆమె పాఠం చెప్పేటప్పుడు మిగిలిన క్లాస్మేట్స్ అందరిలాగే నేనూ నువ్వుతూ ఉంటాను. ఇతరులు నవ్వినప్పుడు ఏమీ అనని మేడమ్ నేను నవ్వినప్పుడు మాత్రమే తిడుతూ ఉంటారు. దాంతో క్లాస్‌లో నవ్వడమే మానేశాను. క్లాస్‌లో నేను నవ్వకపోయినా, వేరే వాళ్లెవరో నవ్వినా ఆమె నన్నే తిడుతున్నారు. ఆమె తరచూ నన్నే తిడుతుండటంతో చదువు మీద శ్రద్ధ చూపలేకపోతున్నాను. ఇదే పరిస్థితి కొనసాగితే నా చదువు ఏమైపోతుందోనని బెంగగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు - గంగాధర్, ఏలూరు ఆమె మనస్థితి, గృహపరిస్థితి తెలీదు కాబట్టి తరచూ పిల్లల్ని ఎందుకు తిడుతోందో, తిట్టడానికి ఎప్పుడూ మిమ్మల్నే ఎందుకు ఎన్నుకుంటుందో వదిలేద్దాం. మీ నవ్వు ఎలా ఉందో పరిశీలించుకోండి. వెటకారంగా ఉందా? ఆమె లెక్చరర్ని పరిహసిస్తున్నట్టు ఉందా? అలా ఉంటే ఎవరికైనా ఒళ్లు మండుతుంది కదా. రెండో విషయం ఏమిటంటే, నవ్వుతూ ఉండటం వేరు. ఆహ్లాదంగా ఉండటం వేరు. మేము తరచూ క్లాసుల్లో విద్యార్థులకు ’సీరియస్‌గా ఉండొద్దనీ, పాఠాలను ఆహ్లాదంగా వినండి’ అని చెబుతూ ఉంటాం. చాలామంది టీచర్లు క్లాసులో పిల్లల్ని ‘నవ్వకు, శ్రద్ధగా విను’ అని తిడుతూ ఉంటారు. శ్రద్ధగా వినటం అంటే సీరియస్‌గా వినటం కాదు. ప్రశాంతంగా వినటం. అదే విధంగా పెద్దలు కూడా పిల్లల్ని ‘హార్డ్‌వర్క్ చెయ్యి, పైకి వస్తావు’ అంటారు. హార్డ్‌వర్క్ అంటే కష్టపడి పని చెయ్యటం...! మనసుకు గానీ, శరీరానికి గానీ ఒక పని సాధ్యం కానప్పుడు అది హార్డ్‌వర్క్ అవుతుంది... హార్డ్‌వర్క్ చేస్తూ టీవీ చూడు. హార్డ్ వర్క్ చేసి క్రికెట్ ఆడు అని మాత్రం అనరు. చదువుకే ఈ పనిని ఆపాదిస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే... పెద్దలే పిల్లలకు చిన్నతనం నుంచి చదువంటే ఒక రకమైన విరక్తిభావం కలుగ చేస్తున్నారన్న మాట. ఈ సమాధానం ఆమె చదివేలా చెయ్యండి. మీ సమస్య తొలగిపోతుంది. నేను ఇటీవలే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయ్యాను. మా పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. మా పేరెంట్స్ కోరుకుంటున్నట్లుగా నాకు ఎంబీబీఎస్‌లో చేరాలని లేదు. ఎంబీబీఎస్‌లో చేరే బదులు క్రియేటివ్‌గా ఏదైనా చేయాలని ఉంది. ఏదైనా ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే నాకు ఇష్టం. ఎంబీబీఎస్ నాకు తగిన కోర్సు కాదని బలంగా అనిపిస్తోంది. అలాగని, ఏ కోర్సులో చేరితే రాణించగలనో అనే దానిపై ఎంతగా ఆలోచించినా ఇంకా ఒక స్పష్టతకు రాలేకపోతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - అమూల్య, ఊరు రాయలేదు ’ప్రాక్టికల్‌గా నేర్చుకోవటం’ అంటూ వ్రాసిన మీ ఉత్తరం అస్పష్టంగా ఉంది. మెడిసిన్‌లో ప్రాక్టికాలిటీ గానీ, మెడికల్ రీసెర్చ్‌లో క్రియేటివిటీ గానీ లేవని ఎలా అనుకుంటున్నారు? మీకు మరో రకమైన రీసెర్చ్ కావాలనుకుంటే ఫార్మసీలో గానీ, అగ్రికల్చర్ రంగంలో గానీ చేరండి. నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. పాలిటిక్స్‌లో చేరితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. అయితే, పాలిటిక్స్‌లో రాణించగలనా? లేదా? అనే మీమాంసలో పడి ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. పాలిటిక్స్‌లో రాణించడానికి ఏం చేయాలో నాకు తెలియదు. అయితే, ఎలాగైనా పాలిటిక్స్‌లోకి రావాలని ఉంది. దానికి నేను ఏం చేయాలి? - పేరు రాయలేదు 1. ‘ఒక నాయకుడి కింద ఎంత కాలం నిజాయతీగా ఉండాలి? ఎప్పుడు అతణ్ని అధిగమించాలి’ అన్న విచక్షణాజ్ఞానం. 2. ఎప్పుడు వినాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అన్న సంయమనం. 3. అనుచరుల్నీ, హితుల్నీ ఊరు పేరుతో సహా గుర్తుపెట్టుకోగలిగే జ్ఞాపక శక్తి. 4. తర్వాత వచ్చే ఎన్నికలకు డబ్బు సంపాదించగలిగే ఆర్థిక ప్రణాళిక. 5. కార్యకర్తలను ఆకట్టుకునే నైపుణ్యం, నిరంతరం అధిష్టానం కనుసన్నల్లో మెలిగే చాతుర్యం... ఈ అయిదూ రాజకీయ విజయానికి అయిదు మెట్లు. ఈ అర్హతలు మీకెంత వరకు ఉన్నాయో... ఎంతవరకు పెంచుకోగలరో అలోచించుకోండి. - యండమూరి వీరేంద్రనాథ్