breaking news
lella Appireddy
-
‘ఉప ఎన్నికల్లో చంద్రబాబు చేయని కుట్రలు లేవు’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వ్యవస్థలను పతనం చేసి గెలుపొందిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత దారుణమైన ఎన్నికల కమిషన్‌ను తొలిసారి చూశామని ఆయన మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఆగస్టు 14వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్మీట్లో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఏజెంట్లకు , ఓటర్లకు స్వేచ్చలేని పోలింగ్ జరిగింది ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. పులివెందులకు ఇప్పుడే ప్రజాస్వామ్యం వచ్చినట్టు ఎల్లోమీడియా చెప్తోంది. ఆఫీసుల్లో కూర్చుని మాట్లాడటం కాదు, జనంలోకి వచ్చి మాట్లాడాలి. ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ కళ్లుండీ చూడలేని దుస్థితిలో ఉన్నాయి. పోలింగ్‌కు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళం సృష్టించారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఇలాంటి గెలుపు కూడా గెలుపేనా?, వైఎస్సార్సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా?, పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్ల వేయించుకోవటం కూడా గెలుపేనా?, ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి 35 సార్లు ఫిర్యాదులు చేశాం. 17 సార్లు మేమే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేశాం. 18 ఈమెయిల్స్ కూడా చేశాం. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కమీషనర్ శేషన్ లాగా స్వతంత్రంగా పని చేయమని కూడా చెప్పాం.హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చ, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది. అయినా సరే ఎన్నికల కమిషన్‌లో మార్పు లేదు. ఓటర్ల సంగతి దేవుడెరుగు, కనీసం వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ కూడా ఓటు వేయలేక పోయారు. ఇదేనా ప్రజాస్వామ్యం?, పోలింగ్ లో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఇప్పటికీ టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదు. జమ్మలమడుగు, కమలాపురం నుండి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు. ఎన్నికల కమిషన్ ప్రజల ముందు దోషిగా నిలపడింది. ఎన్నికల కమిషన్ వైఖరిపై మేము ధర్నా చేయాల్సి వచ్చింది. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలి. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం’ అని ఆయన స్పషం చేశారు. -
‘దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?’
తాడేపల్లి: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల అంఃశానికి సంబంధించి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ప్రజలను భయపెట్టి ఎన్నికలకు రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారు.రెవిన్యూ యంత్రాంగం నిస్సిగ్గుగా టీడీపీ కోసం పని చేస్తుంది. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?, రెండు దశాబ్దాల క్రితం బిహార్‌లో ఉన్న పరిస్తితి టీడీపీ ప్రభుత్వం ఏపీలో తీసుకు వచ్చింది. కొంతమంది అధికారులు మితి మీరిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. పులివెందుల ఎన్నికలతోనే రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయా?, ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చేశారు.ప్రజలు ఓటు వేయాలి అనుకుంటున్నారా?, ఓటు వేయొద్దు అనుకుంటున్నారా?, మీరు ఎవరు ఓటుకు రావాల్సిన అవసరం లేదనే దురహంకారంతో మార్చారు. ప్రజా స్వామ్య బద్దంగా పులివెందుల ఎన్నిక నిర్వహించండి. ప్రజలు ఎవరి పక్షంగా ఉన్నారో తెలుస్తుంది. నిజంగా టిడిపి గెలిచే పరిస్తితి ఉంటే ఈ దాడులు ఏంటి?, రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు సునీత బయటకు వస్తారు. ప్రభుత్వాన్ని కాపాడటానికి మాట్లాడతారు. చంద్రబాబు మీ నాయకుడే కదా...ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. ఇంకా అధికారులను కలవడం ఎందుకు?’ అని ప్రశ్నించారు. -
‘ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసింది’
తాడేపల్లి : ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. టీడీపీ వైఖరికి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడుతున్నారని ధ్వజమెత్తారు.‘స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చెడగొడుతున్నారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం తాపత్రయం పడుతున్నారు?, తాడిపత్రిలో మా పార్టీకి అధికారం రాకపోయినా గౌరవించాం. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి సైతం జగన్ ని మెచ్చుకున్నారు. కానీ నేడు ఏం జరుగుతుందో చూసి జనం నవ్వుతున్నారు.చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పంలో ఏరకంగా టీడీపీ గెలుస్తుంది?, మాచర్ల, కుప్పం, తుని, విశాఖపట్నం ఇలా అన్నిచోట్లా వైఎస్సార్ సీపీ సభ్యులే అధికంగా ఉన్నారు. మా సభ్యులను ప్రలోభపెట్టి, బెదిరించి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కున్నారు. దొడ్డిదారిలో పదవులు కైవసం చేసుకోవటం సిగ్గుచేటు. విప్ ని ధిక్కరించిన వారిపై కోర్టుకు వెళ్తాం. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నాం. అడ్డదారిలో గెలవటం కీసం కూటమి నేతలు అనేక కుట్రలు చేశారు’ అని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. -
నేడు మహానేత జయంతి
సాక్షి, అమరావతి: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించటంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం, ద్విచక్ర వాహనాలు, నిత్యావసర సరుకుల పంపిణీ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఫొటోల ప్రదర్శన, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
7న సీఎం గుంటూరు పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7వ తేదీన గుంటూరు నగరానికి రానున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి మోపిదేవి వెంకటరమణా రావు, ఎమ్మెల్యే విడదల రజని, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్ శామ్యూల్‌ఆనంద్‌కుమార్ శుక్రవారం చర్చించారు. సాక్షి, పట్నంబజారు(గుంటూరు): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7వ తేదీన గుంటూరుకు రానున్న నేపథ్యంలో పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యూల్‌ఆనంద్‌కుమార్‌తో సీఎం పర్యటనకు సంబంధించి వేదిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి మోపిదేవి, ఎమ్మెల్యే రజని, అప్పిరెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతగా రూ.10వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి లబ్ధి చేకూర్చేందుకు రూ.264.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 3.69లక్షల మంది ఉండగా జిల్లాలో 19,751 మంది ఉన్నారు. ఈ క్రమంలో సీఎం గుంటూరులో జరిగే కార్యక్రమంలో చెక్కుల పంపిణీ చేయనున్నారు. బాధితులతో పాటు, ప్రజలు సైతం హాజరుకానున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా స్థలాన్ని నిర్ణయించేందుకు దృష్టీ సారించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, రాష్ట్ర కార్యదర్శి లాలుపురం రాము తదితరులున్నారు. -
‘సీఎం గొప్ప మనసుతో ఒకరోజు ముందే దీపావళి’
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో ఒక రోజు ముందే దీపావళి వచ్చిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి రోజు బడుగు బలహీన వర్గాలకు మంచి కోసమే ఆలోచిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతలో.. మూడు లక్షల 70 వేల మంది బాధితుల కోసం రూ.264 కోట్లు విడుదల చేశారు. రెండో విడతలో రూ.886 కోట్లు విడుదల చేశారు. వైఎస్ జగన్‌పై బాధితులు నమ్మకం ఉంచారు. వారి నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. న్యాయపరమైన ఇబ్బందులు అధిగమించి రూ.1150 కోట్లు విడుదల చేశారు. చంద్రబాబు ఖాళీ ఖాజానాను సీఎం జగన్ చేతికి ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబుది కోతల ప్రభుత్వం. వైఎస్ జగన్‌ది చేతల ప్రభుత్వం. ఈ నెల 29వ తేదీన అన్ని అగ్రిగోల్డ్ బాధిత సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అగ్రిగోల్డ్ స్కామ్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోకుండా కమిటీలతో చంద్రబాబు కాలయాపన చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కాజేశారు. చంద్రబాబు లోకేష్ సిగ్గుండే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా’ అని అన్నారు. -
29 నుంచి అగ్రిగోల్డ్ బాసట కమిటీ సమావేశాలు
గుంటూరు: ఈ నెల 29 నుంచి అగ్రిగోల్డ్ బాసట కమిటీ ప్రాంతీయ సమావేశాలు జరుగుతాయని వైఎస్సార్సీపీ నేత, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లేళ్ల అప్పి రెడ్డి తెలిపారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..ఈ నెల 29న విశాఖపట్నంలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల వారితోనూ, 30న విజయవాడ నగరంలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా వారితోనూ, 31న నెల్లూరులో ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారితోనూ, జనవరి 2న అనంతపురంలో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల వారితో సమావేశమవుతున్నట్లు వెల్లడించారు. అగ్రిగోల్డ్ బాసట కమిటీ నేతలు, వైఎస్సాసీపీ సమన్వయకర్తలు అందరూ హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ మెడలు వంచి బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని వ్యాక్యానించారు. -
రాజధాని సమస్యలు పరిష్కారం కావాలంటే..
అమరావతి: తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కిలారు రోశయ్య, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవితో పాటు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిలారు రోశయ్య మాట్లాడుతూ..వచ్చే 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిపించాలని ప్రజలను కోరారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. రాజధానిలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఉండవల్లి శ్రీదేవిని గెలిపించుకోవాలన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడని ఆరోపించారు. రైతులు దగ్గర నుంచి మూడు పంటలు పండే భూమిని లాక్కున్నారని ధ్వజమెత్తారు. రాజన్నరాజ్యం జగన్‌తోనే సాధ్యం: లేళ్ల రాష్ట్రంలో రాజన్న రాజ్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.అధికారంలోకి రాగానే నవరత్నాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి దోచుకోవడం దాచుకోవటం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాజన్న పేరుతో ఉచిత వైద్యం: శ్రీదేవి ప్రజలకు సేవ చేయడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, రాజధానిలో అనేక సమస్యలు ఉన్నాయని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పారు. రాజన్న వైద్యం పేరుతో రాజధానిలో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. మందులు కూడా పంపిణీ చేయాలనుకుంటున్నామని తెలిపారు. వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైఎస్సార్సీపీ నవ రత్నాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని వ్యాక్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని అభ్యర్థించారు. -
‘అక్రమ కేసులు పెట్టినా ఉద్యమం ఆగదు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకం సన్నగిల్లిందని, అందుకే అగ్రిగోల్డ్ బాధితులు ధర్నాలకు దిగుతున్నారని అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెట్టినా ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. హాయ్‌ల్యాండ్‌ను కొట్టేయటానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హాయ్‌ల్యాండ్‌ను కాపాడుకుంటామని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం పెడతామని చెప్పారు. పెద్ద ఎత్తున ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. చదవండి : ‘ఛలో హాయ్‌ల్యాండ్’: కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం.. -
‘నిప్పు అయితే విచారణ జరిపించుకో’
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సొమ్ముతో ఆదుకుంటామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కుట్రల కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాయని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ది లేని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల తరుఫున పోరాడుతున్న న్యాయవాది రవిచంద్రన్‌ను సీఎం చంద్రబాబు, లోకేష్‌లు బెదిరిస్తున్నారని తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హాయ్‌లాండ్ ఆస్తులను కొట్టేయాలనే ఉద్దేశ్యంతోనే అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు. అందుకే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని 2017లోనే చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇంతవరకు దాని ఊసే లేదు. అగ్రిగోల్డ్‌పై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. దాని వెనుక ఉన్న వ్యక్తులెవరో బయటకు రావాలి. ఏపీపై ప్రజలకున్న ప్రేమను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాటకాలు అడుతున్నారు. రాజధాని తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ వర్షం వస్తే కురిసే విధంగా నిర్మాణం చేశారు. అలాంటి భవనాలకు కోట్లు ఖర్చు అవుతాయా? మాజీ సీఎస్‌లు లేవనెత్తిన ప్రశ్నలకు చీఫ్ సెక్రటరీతో జవాబు చెప్పించండి. చంద్రబాబు నీవు నిప్పు అని చెబుతుంటావు. నిజంగా నిప్పు అయితే నీపై విచారణ జరిపించుకో’’ అని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత, అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనటానికి వచ్చిన ఎస్సెల్ గ్రూపును చంద్రబాబు కలిసిన తరువాత వారు వెనక్కు తగ్గారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులందరికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ఆ ఉద్యమాన్ని నీరుగార్చింది ప్రభుత్వమే
సాక్షి, గుంటూరు జిల్లా : మొన్నటి అగ్రిగోల్డ్ ఉద్యమాన్ని ప్రభుత్వమే నీరుగార్చిందని వైఎస్సార్సీపీ రాష్ర్ట కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..మూడేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండేందుకే వైఎస్సార్సీపీ తరపున బాసట కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 9న విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులతో వైఎస్సార్సీపీ ముఖ్య నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. పదమూడు జిల్లాలోని అగ్రిగోల్డ్ ఉద్యమకారులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే రూ.1100 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరారు. -
ప్రజాస్పందనే ప్రభుత్వ మోసాలకు అద్దం పడుతోంది
-
హక్కులు కాపాడి ప్రాణాలు నిలపండి
గుంటూరు వెస్ట్: డయేరియాతో అమాయక ప్రజలు మరణిస్తున్నా చర్యలు తీసుకోవడం చేతగాని ప్రభుత్వం, అధికారులు ప్రజలపై, పార్టీలపై నిందలు మోపి వేసి చేతులు దులుపుకోవడం హేయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. నగరంలో రెండు వారాలుగా డయేరియాతో మృత్యువాత పడుతున్న అమాయకుల తరఫున అప్పిరెడ్డి శనివారం జిల్లా కోర్డు ప్రాంగణంలోని మానవ హక్కుల చైర్మన్, మొదటి అడిషనల్ జిల్లా జడ్జి నంది కొండ నరసింగారావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికి 24 మంది చనిపోయారని, వేల మంది ఆసుపత్రిపాలై, అవయవాలు పనిచేయక నరకయాతన అనుభవిస్తున్నారని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం తప్పించుకునే దారులు వెదుకుతోందన్నారు. గుంటూరంటే కల్తీకి ప్రధాన కేంద్రమనే అపకీర్తి మూటగట్టుకున్నా అధికారుల్లో స్పందన కరువైందన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రజలు మరణించాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరమని అప్పిరెడ్డి పేర్కొన్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాటాల లెక్కల్లో బిజీగా ఉన్నారని,ప్రజల కష్టాలు వినే తీరిక లేవని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేస్తూ, వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయం చేసేందుకే మానవ హక్కుల చైర్మన్‌ను ఆశ్రయించామని తెలిపారు.న్యాయవాదులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, శిఖా బెనర్జీ, పోకల వెంకటేశ్వర్లు, శశి, కేశవ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి చేరిన సుభానీ
-
అంబేడ్కర్ అందరికీ పూజ్యనీయుడు
► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ► గుంటూరులో ప్రారంభమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వారోత్సవాలు పట్నంబజారు(గుంటూరు): దేశంలోని అన్ని కులాలు, మతాలు, జాతుల ఉమ్మడి పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అనేక దేశాలకు స్ఫూర్తిగా నిలిచిన అతి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరికీ పూజ్యనీయుడని కొనియాడారు. అంబేద్కర్ జయంతి వారోత్సవాలను శుక్రవారం ప్రారంభించారు. లాడ్జిసెంటర్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీళ్లతో శుభ్రం చేశారు. అనంతరం స్వయంగా చీపురు చేపట్టి ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ ఆశయాన్ని అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. పార్టీ నేతలు పానుగంటి చైతన్య, పేటేటీ నవీన్బాజీ, వినోద్, విఠల్, రబ్బాని, నరాలశెట్టి అర్జున్ నేతృత్వంలో జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.నసీర్ అహ్మద్, సంయుక్త కార్యదర్శి షేక్ గులాం రసూల్, లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, కొత్తాచిన్నపరెడ్డి, జగన్‌కోటి, గనిక ఝాన్సీరాణి, యరమాల విజయకిషోర్, దేవరాజ్, మేరువ నర్సిరెడ్డి, మేళం ఆనందభాస్కర్,త దితరులు పాల్గొన్నారు. కోబాల్డ్‌పేటలో అంబేద్కర్ విగ్రహానికి అప్పిరెడ్డి స్వయంగా రంగులు వేశారు. వార్డు నేతలు జగన్‌కోటి, షేక్ సైదా, రాజు, రంజుల శ్రీనివాస్, మేళం ఆనందభాస్కర్, తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కేవీపీ కాలనీలోని జోసఫ్‌నగర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి జయంతి వారోత్సవాలు నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షుడు కొండారెడ్డి నాగేశ్వరరావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.