breaking news
lawyers rally
-
'విభజనకు బొత్సనే కారణమని నమ్ముతున్నారు'
విజయనగరం : విజయనగరంలో న్యాయవాదుల అరెస్ట్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు ఖండించారు. ఓ వైపు పట్టణంలో 30 యాక్ట్‌ను అమలు చేస్తూ... ఇంకా కర్ఫ్యూ వాతావరణం కొనసాగించటం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే కారణమని నమ్మటం వల్లే విజయనగరంలో ఆందోళనలు జరిగాయన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తోందని సుజయకృష్ణ రంగారావు అన్నారు. నల్గొండ జిల్లాలో విజయమ్మ పర్యటనను అడ్డుకోవటాన్ని ఆయన ఖండించారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో న్యాయవాదులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అయితే పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఆ నేపథ్యంలో అనుమతి లేదంటూ పోలీసులు న్యాయవాదుల ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు. -
విజయనగరంలో న్యాయవాదుల ర్యాలీ... ఉద్రిక్తత
విజయనగరం పట్టణంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. అయితే పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఆ నేపథ్యంలో అనుమతి లేదంటూ పోలీసులు న్యాయవాదుల ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడ పోలీసులు 30 యాక్ట్ అమలు చేయడం లేదంటూ న్యాయవాదులు ఆరోపించారు. ఒక్క విజయనగరం పట్టణంలోనే ఆ యాక్ట్ అమలు ఎందుకు చేస్తున్నారంటూ న్యాయవాదులు పోలీసులును ప్రశ్నించారు. న్యాయవాదుల ప్రశ్నలకు పోలీసులు నుంచి సరైన స్పందన రాలేదు. దాంతో న్యాయవాదులు విజయనగరం గ్రామీణ పోలీసు స్టేషన్ ఎదుట న్యాయవాదులు బైఠాయించారు.