breaking news
lavish dish
-
మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు..
న్యూఢిల్లీ: అవీనితి కేసులో అరెస్టయిన ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనకు సంబంధించిన మరో వీడియోను బీజేపీ బయటపెట్టింది. జైలులో ఆయన పసందైన భోజనం చేస్తున్న దృశ్యాలను విడుదల చేసింది. కమలం పార్టీ జాతీయ ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ఈ వీడియోను ట్వీట్ చేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. 'అత్యాచార కేసు నిందితుడితో జైలులో మసాజ్ చేయించుకున్న ఆప్ మంత్రి మరో వీడియోను చూడండి. ఈ సారి విలాసవంతమైన ఫుడ్‌ను ఆస్వాధిస్తున్నాడు. వెకేషన్‌కు వెళ్లి రిసార్టు భోజనం చేస్తున్నట్లు ఉంది. కేజ్రీవాల్ ఆయన మంత్రికి జైలులో వీవీఐపీ ట్రీట్ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు.' అని షెహ్జాద్ విమర్శలు గుప్పించారు. One more video from media! After taking maalish from rapist & calling him PHYSIO therapist, Satyendra Jain can be seen enjoying sumptuous meal! Attendants serve him food as if he is in a resort on vacation! Kejriwal ji ensured that Hawalabaaz gets VVIP maza not saza! pic.twitter.com/IaXzgJsJnL — Shehzad Jai Hind (@Shehzad_Ind) November 23, 2022 ఈ వీడియోలో సత్యేంజర్ జైన్‌కు ఓ వ్యక్తి కవాల్సినవన్నీ సమకూర్చుతున్నాడు. డస్ట్‌బిన్‌ను మంత్రి కుర్చీ దగ్గర పెట్టాడు. జైలు గదిలో ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. దీంతో అవినీతి కేసులో అరెస్టయిన వ్యక్తికి రాజభోగాలు కల్పిస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. కాగా.. ఇటీవలే సత్యేంజర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియోను విడుదల చేసింది బీజేపీ. అయితే అది మసాజ్ కాదని, ఫిజియోథెరపీ అని ఆప్ చెప్పుకొచ్చింది. కానీ మసాజ్ చేసిన వ్యక్తి రేప్ కేసులో నిందితుడు అని తిహార్ జైలు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. చదవండి: ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్ -
ఆహా..! సొరపిట్టు
♦ ఓ పట్టుపట్టు ♦ పసందైన వంటకం ♦ మాంసాహారులు లొట్టలేయాల్సిందే ♦ పాలసొర టేస్టే వేరు క్రేజీ నాన్‌వెజ్ డిష్ తాడేపల్లిగూడెం : సొరపిట్టు. ఇది తమిళనాడు బ్రాండ్ వంటకం. చూడగానే నోరూరిస్తుంది. మాంసాహార ప్రియులే కాకుండా శాకాహారులూ ఒక్కసారి టేస్టు చూస్తే పోలా అనుకునేలా ఉండే లావిష్ డిష్ ఇది. సముద్రపు చేపలకు మనప్రాంతంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సముద్రపు సొర చేపలతో చేసే ప్రత్యేకమైన వంటకం పిట్టు. ఇది ఇటీవల ప్రత్యేక మెనూగా మారింది. విందులు, వినోదాలలో పాలుపంచుకుంటోంది. భుజించడానికి రుచికరంగా ఉండటంతోపాటు ముళ్ల వంటి బెడద లేకపోవడం దీని ప్రత్యేకత. నరసాపురం, అంతర్వేదిల నుంచి సొర చేపలు భీమవరం మార్కెట్‌కు వస్తున్నాయి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. దీంతో వీటి కొనుగోలుకు మాంసాహార ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. ఎవరైనా సొరపిట్టు కూర ఒక్కసారి తింటే.. కోరిమరీ మళ్లీమళ్లీ చేయించుకోవాలనుకుంటారు. దీనిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండురకాల సొరలు సొర చేపలలో రెండు రకాలు ఉన్నాయి. ముంబై వంటి ప్రాంతాల నుంచి వచ్చేవి ఓ రకం. మన ప్రాంతంలో పాలసొరలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ రకం చేప ధర కిలో రూ.300 వరకు ఉంది. ముంబై నుంచి వచ్చే సొరలు పెద్దవిగా ఉంటాయి. ఇవి కిలో రూ.150కి దొరుకుతాయి. కానీ పాలసొరకున్నంత రుచి ముంబై సొరలకు ఉండదు. చింతచిగురుతో వండితే వాహ్.. సొరచేపను నాలుగు రకాలుగా వండుకోవచ్చు. ఎక్కువగా సొరపిట్టుగా వండుతారు. సొర చేపను ముక్కలుగా చేసిన తర్వాత వాటిలో కొద్దిగా నీరు పోసి. చిటికెడు పసుపు వేసి స్టౌపై పది నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత వేరే బాణీలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అల్లం పేస్టు వేయాలి. పది నిమిషాలు వేయించిన తర్వాత అంతకు ముందు పసుపు వేసి ఉడికించిన సొర చేప ముక్కల పైతోలును తీసి ముక్కలను బాగా పిసకాలి. అలా వచ్చిన పిట్టును వేయించిన ముక్కలలో వేయాలి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు చల్లి కలపాలి. పది నిమిషాల అనంతరం కరివేపాకు. కొత్తిమీర వేసి ఉడికించి ఐదు నిమిషాల తర్వాత దించాలి. దీనిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ అనుభూతే వేరు. సొర పిట్టులో చింతచిగురు వేసి వండుకుంటే ఇంకా బాగుంటుంది. సొర ఇగురు, సొర పులుసు కూడా పెడతారు. కొందరు సొర పిట్టులో కోడిగుడ్డు సొనను కూడా వేసుకుని వండుకుంటారు. ఇదొక రుచి.