breaking news
lady missing
-
బ్యూటీపార్లర్‌కు వెళ్లిన యువతి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్‌సిటీ : బ్యూటీపార్లర్‌కు వెళ్లిన యువతి అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన నగరంలోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ లఖన్రాజు కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గాప్రసాద్, చెల్లెలు మున్నీకుమారి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలసి దోమలగూడ బండార్‌నగర్‌లో నివాసముంటున్నారు. గత నెల (ఆగస్ట్) 25న ఉదయం 10 గంటలకు బ్యూటీపార్లర్‌కు వెళ్లివస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు చుట్టుపక్కల వారితో పాటు, బంధువుల ఇళ్లల్లో ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. పది రోజులు గడుస్తున్నప్పటికీ ఆమె గురించి సమాచారం లేకపోవడంతో దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ లఖన్‌రాజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్నెట్ కేఫ్‌కు అని వెళ్లి..
హైదరాబాద్: ఇంటర్నెట్ కేఫ్‌కు అని వెళ్లిన ఓ యువతి తిరిగి కనిపించకుండా పోయిన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీలోని నిజాంపేట పరిధి రాజీవ్‌గృహకల్పలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కృష్ణ కూతురు లావణ్య(21) ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి కనిపించటం లేదు. బంధువులు, మిత్రులను ఆరా తీసినా లాభం లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జనగా మురళి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.