breaking news
Kasyap
-
Bihar Election: యూట్యూబర్ అభ్యర్థి సంగతేంటి?
పట్నా: బీహార్‌లోని చాన్పాటియా అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్లు అగ్రశ్రేణి పోటీదారులెవరనేది వెల్లడించాయి. తాజా డేటా ప్రకారం బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్ 30,290 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ 28,719 ఓట్లు సాధించారు. మనీష్ కశ్యప్‌గా పేరొందిన ప్రముఖ యూట్యూబర్ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.యూట్యూబర్ నుండి రాజకీయ నేత మారిన త్రిపురారి కుమార్ తివారీ(మనీష్ కశ్యప్) ప్రస్తుతం 12,081 ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. ఆయన జన్ సురాజ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. చాన్పాటియా అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2020లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఉమాకాంత్ సింగ్ కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ రంజన్‌ను 13,469 ఓట్ల తేడాతో ఓడించి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.సోషల్ మీడియాలో ప్రాంతీయ సమస్యను ప్రస్తావిస్తూ ప్రజాదరణ పొందిన మనీష్ కశ్యప్ ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగారు. తన డిజిటల్ ప్రజాదరణతో ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశించారు. కాగా బీహార్ వలసదారులపై దాడులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో 2023లో తమిళనాడు పోలీసులు యూట్యూబర్ మనీష్ కశ్యప్‌ను అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మనీష్ 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ తరువాత బీజేపీని వీడి జన్ సురాజ్‌లో చేరారు. -
సైనా,కశ్యప్ పెళ్లి చేసుకోబోతున్నారా?
-
కశ్యప్ రాణించేనా?
న్యూఢిల్లీ: ఈ సీజన్లో తొలి టైటిలే లక్ష్యంగా హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నీ బరిలోకి దిగుతున్నాడు. కెనడాలోని కాల్గరీ నగరంలో నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు జరుగుతాయి. మేటి ఆటగాళ్లను ఓడిస్తూ ఇటీవల సంచలన ప్రదర్శన చేసిన మరో భారత ఆటగాడు ప్రణయ్ ఈ టోర్నీలో రెండో సీడ్‌గా, కశ్యప్ 16వ సీడ్‌గా బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీలో తెలుగు రాష్ట్రాల నుంచి రుత్విక శివాని, సిక్కి రెడ్డి, శ్రీకృష్ణప్రియ, సాయి ఉత్తేజిత రావులు తలపడనున్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంటకు రెండో సీడ్ దక్కింది. గతేడాది ఈ టోర్నీలో భమిడిపాటి సాయిప్రణీత్ సింగిల్స్ టైటిల్‌ను, మను అత్రి–సుమిత్ రెడ్డిలు డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈసారి సాయిప్రణీత్ గైర్హాజరు కాగా, మూడో సీడ్‌గా బరిలోకి దిగుతున్న మను అత్రి–సుమిత్ జంట టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్... క్యాస్టిలో (మెక్సికో)తో, కశ్యప్... డానియెల్ టొరె రీగల్ (పెరూ)తో ఆడతారు. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో జాతీయ చాంపియన్ రీతూపర్ణ దాస్... హరుకొ సుజుకి (జపాన్)తో, సాయి ఉత్తేజిత రావు... రాచెల్ హండెరిచ్ (కెనడా)తో, రుత్వికా శివాని... గా యున్ కిమ్ (కొరియా)తో పోటీపడతారు. పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ మను అత్రి–సుమిత్ జోడీ... కొహెయి గొండొ–తత్సుయా వతనబే (జపాన్) జంటపై గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది. -
హైదరాబాద్ చేరుకున్న కామన్వెల్త్ విజేతలు
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన తెలుగుతేజాలు హైదరాబాద్ తిరిగొచ్చారు. మంగళవారం సాయంత్రం బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, పీవీ సింధు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కశ్యప్ పసిడి పతకం, సింధు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. కశ్యప్, సింధుతో పాటు గురుసాయి దత్ ఇతర క్రీడాకారులు నగరానికి వచ్చారు.


