breaking news
kanteti satyanarayana
-
కిరణ్ మోసం చేశాడు: కంతేటి
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో తనకు శాసనమండలి సభ్యత్వం ఎప్పుడో ఖరారైనప్పటికీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించిన తీరువల్లే ఏడాది ఆలస్యమైందని నూతన ఎమ్మెల్సీ, పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు ఆరోపించారు. ఆయన సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... కిరణ్ కుటుంబంతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ సీటు విషయంలో 2011 నుంచి తనను మోసం చేశారని ఆరోపించారు. చివరకు గవర్నర్ కోటాలో తన పేరు ఖరారైనా ఏడాదిపాటు ఆ జాబితా ఆమోదం పొందకుండా తొక్కిపెట్టారని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తీరువల్లే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయిందన్నారు. కిరణ్ మూడేళ్ల కిందటే సీఎం పదవికి రాజీనామా చేస్తే సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా అదే బాట పట్టేవారని, తద్వారా రాజ్యాంగ సంక్షోభం వచ్చి విభజన నిర్ణయం ఆగిపోయేదని అభిప్రాయపడ్డారు. రైలులో ఏ టికెట్ దొరక్కపోతే జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కినట్లుగా ఏ పార్టీలో టికెట్ దొరక నివారే కిరణ్ పార్టీవైపు వెళతారని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌లో గంజాయి మొక్కలు పెరుగుతున్నాయని, ఈ విషయాన్ని చాలాసార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. -
కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి, వాణిలకు ఛాన్స్
హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్యాహ్నం గవరన్నర్ నరసింహన్‌ను కలిసినట్లు సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్సీల రేసులో పలువురు నేతలు ఉన్నాయి అయితే పీసీసీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి, పదవీకాలం పూర్తి కానున్న ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.