జోగుళాంబ ఆలయ హుండీ ఆదాయం రూ.19.73 లక్షలు
అలంపూర్‌రూరల్ : అలంపూర్ జోగుళాంబ ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం దేవస్థాన ఈఓ గురురాజ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా ప్రేమ్‌కుమార్ హాజరయ్యారు. గత నాలుగు నెలల హుండీ ఆదాయం మొత్తం రూ.19లక్షల 73,873 ఉండగా, ఇందులో అమ్మవారి ఆలయం ద్వారా రూ.14లక్షల91వేలు, స్వామివారి ద్వారా రూ.4లక్షల82,883 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కొందరు భక్తులు బంగారు ముక్కు పుడక, వెండి వస్తువులు హుండీలో వేశారని వాటిని జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ సమక్షంలో లెక్కిస్తామని, పుష్కరాల సందర్భంగా సమక్క–సారక్క ఆలయం నుంచి అదనంగా హుండీలను తెప్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ మేనేజర్ కపాదానం, బ్యాంకు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.