breaking news
Jazula srinivas goud
-
జాతీయ ఓబీసీ ఫెడరేషన్ ఆవిర్భావం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో పనిచేస్తున్న బీసీ సంఘాలను ఒకే గొడు గు కిందకు తెస్తూ జాతీయ బీసీ ఫెడరేషన్ ఆవిర్భవించింది. ఆదివారం ఢిల్లీలో జాతీయ ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ నుంచి బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు, అన్ని రాష్ట్రాల నుంచి ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల బీసీ సంఘాలను కలిపి ఒకే ఫెడరేషన్‌ను ఏర్పాటుచేశారు. దీనికి జాతీయ చైర్మన్‌గా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిజర్వేషన్లు దక్కేవరకు పోరాటం.. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణను శాస్త్రీయంగా చేపట్టాలని, బీసీ ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, సమగ్ర కుటుంబ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ ఎత్తేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని, కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని, ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని పలు తీర్మానాలు చేశారు. ఓబీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం కల్పించి ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన భాగం ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్ల సాధనకై వచ్చే నెలలో లక్ష మందితో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. -
రాజధానిలో బీసీ భవన్ ఏర్పాటు
జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ హైదరాబాద్: రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఉన్న బీసీల సంక్షేమం, అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికిగాను హైదరా బాద్‌లో 10 ఎకరాల స్థలంలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో బీసీలకు నిలువ నీడ కూడా లేదన్నారు. ఒక శాతం కూడా లేని బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సదన్ ప్రకటిం చారని, 3% ఉన్న రెడ్డి సామాజిక వర్గం కోసం 17 ఎకరాల్లో రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవన్‌కు ఈ నెల 22న సీఎం శంకుస్థాపన చేయనున్నారన్నారు. బీసీ భవన్ ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా బీసీలు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంద న్నారు. వెంటనే బీసీ భవన్‌కు భూమి కేటాయించి రూ. వంద కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెలలోగా బీసీ భవన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీల సత్తా చాటుతామన్నారు. సమావేశంలో బీïసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జాజుల లింగం తదితరులు పాల్గొన్నారు.